Ram Mandir: కోట్లాది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు. అయితే ప్రస్తుతం యూపీలోని అయోధ్య నగరంలో రామమందిర నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రతిష్ఠాపన జరుగుతోంది. అయితే దీనివల్ల లాభపడుతున్న కంపెనీలు, వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రామ్ లల్లా శంకుస్థాపన కార్యక్రమం రోజున దేశవ్యాప్తంగా రూ.50,000 కోట్లకు పైగా అదనపు వ్యాపారం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపాలు, పూజా సామాగ్రి, రంగోలీలు, పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు, శ్రీరాముని స్టిక్కర్లు, రాముడిని ముద్రించిన టీషర్టులు-కీచైన్స్, రాముని పఠాలతో పాటు ఇతర దేవతా వస్తువులకు భారీగా డిమాండ్ పెరుగుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక మందిర నిర్మాణం వల్ల ఆదాయాన్ని పొందనున్న 6 కంపెనీలను పరిశీలిస్తే..

- ముందుగా ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన రామమందిర నిర్మాణాన్ని చేపడుతున్న లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. దేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థగా గుర్తింపు ఉన్న కంపెనీ 2020 ఆగస్టు 5న ఈ ప్రాజెక్టును చేపట్టింది. అప్పటి నుంచి కంపెనీ షేర్ ధర భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో L&T షేర్ ధర రూ.934 నుంచి ఏకంగా రూ.3550కి పెరిగింది. ప్రస్తుతం నిర్మించిన శ్రీరాముని మందిరానికి రూ.1800 కోట్లు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది.
- రామ మందిరం ప్రారంభానికి ముందు లాభపడిన కంపెనీల్లో ప్రవేగ్ కంపెనీ షేర్లు కూడా ఉన్నాయి. ఈ సంస్థ అయోధ్యలోని రామజన్మభూమి సమీపంలో టెంట్ సిటీని నిర్మిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో టెంట్ సిటీలను నిర్మించేందుకు కూడా కంపెనీకి ఆర్డర్లు వచ్చాయి. కంపెనీ దీనికి ముందర స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, కచ్‌లో టెంట్ సిటీ, లక్షద్వీప్‌లోని అగట్టి ద్వీపంలో కనీసం 50 టెంట్‌ల అభివృద్ధి వంటి ప్రాజెక్టుల్లో నిమగ్నమై ఉంది. ప్రస్తుతం స్టాక్ ధర రూ.1172కి చేరుకోగా గడచిన మూడేళ్లలో పెట్టుబడిదారులు 1,888.21 శాతం రాబడిని అందుకున్నారు.
- ఇక రాముని ఆలయంతో టాటా గ్రూప్ కంపెనీ అయిన ఇండియన్ హోటల్స్ సైతం లాభాలను అందుకోనుంది. హోటల్ వ్యాపారంలో ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ.456 రేటు వద్ద కొనసాగుతోంది. అయితే గడచిన మూడేళ్లలో 281 శాతం రాబడిని అందించింది. అలాగే ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయించిన ఎయిర్ ఇండియా సైతం దీని నుంచి లాభాలను పొందనుందని నిపుణులు చెబుతున్నారు.
- మందిర ప్రారంభం కారణంగా భక్తుల రద్దీ కలిసొచ్చే కంపెనీల్లో ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా వచ్చి చేరింది. ఇప్పటికే కంపెనీ తన సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టాక్ ధర రూ.3030 వద్ద కొనసాగుతోంది.
- ఇక చివరగా మందిర ప్రారంభంతో లాభపడే కంపెనీల జాబితాలో IRCTC, ఐటీసీ కూడా వచ్చి చేశాయి. యూపీకి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపాలని ఇప్పటికే భారతీయ రైల్వేలు షెడ్యూల్ విడుదల చేయగా.. ఆతిథ్య రంగంలో కొనసాగుతున్న ఐటీసీ హోటల్స్ సైతం రద్దీ నుంచి మంచి ఆదాయాన్ని పొందుతాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Note: పైన పేర్కొన్న షేర్లు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటి అధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్లు నష్టాలతో కూడుకున్నవి ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుడిని ముందుగా సంప్రదించండి.


Click it and Unblock the Notifications