గత ఏడాది నుంచి బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ బుధవారం ఔన్సుకు 3,550 డాలర్లు దాటి చరిత్రలోనే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తే అనేక అంశాలు కనిపిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో బంగారం ధరలు పెరిగిన ప్రధాన కారణాలను చూస్తే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా ప్రాంతంలో పెరుగుతున్న ఘర్షణలు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంగా చెప్పవచ్చు.
వీటిల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ట్రంప్ విధానాలు బంగారం ధరలను పెంచడంలో కీలక పాత్ర పోషించడమే. ఆయన ప్రకటించిన లిబరేషన్ డే, టారిఫ్స్.. ప్రపంచ వాణిజ్య రంగంలో అనిశ్చితిని సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఏ దిశలో వెళ్తుందో స్పష్టత లేకపోవడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తి అయిన బంగారాన్ని ఆశ్రయించారు. దీంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.
అదేవిధంగా.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వాతంత్ర్యంపై ట్రంప్ చేస్తున్న దాడులు కూడా మార్కెట్లను కలవరపరిచాయి. వడ్డీ రేట్లను తగ్గించాలని ఆయన ఫెడ్‌పై ఒత్తిడి తెస్తుండటం, డాలర్ విలువ తగ్గితే అమెరికా ఎగుమతులకు లాభమవుతుందని ఆయన బహిరంగంగా చెబుతుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనపడుతున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంక్ డిపాజిట్లు, బాండ్లు వంటి వడ్డీ ఇచ్చే ఆస్తులు ఆకర్షణ కోల్పోతాయి. అటువంటి సమయంలో బంగారం దగ్గర ఉంచుకోవడం పెట్టుబడిదారులకు లాభదాయకంగా అనిపిస్తుంది. దీంతో వారంతా బంగారాన్ని సేఫ్ హెవెన్ గా భావిస్తున్నారు. దీంతో Gold సామాన్యులకు దొరకని పరిస్థితి నెలకొంది.

డాలర్ విలువ పడిపోతే విదేశీ పెట్టుబడిదారులు కూడా బంగారంపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. ఎందుకంటే తమ స్థానిక కరెన్సీతో అమెరికా బంగారం కొనుగోలు చేయడం వారికి తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుంది. ఈ కారణంగా గ్లోబల్ డిమాండ్ పెరిగి ధరలు పైకి వెళుతున్నాయి. ఇక అమెరికా వెలుపల కూడా ఆర్థిక ఒడిదుడుకులు బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. బ్రిటన్‌లో పౌండ్, జపాన్‌లో యెన్ బలహీనపడటం, జపాన్ రాజకీయ అస్థిరత.. ఇవన్నీ కలిపి పెట్టుబడిదారులను బంగారం వైపు లాగుతున్నాయి. టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు తమ కరెన్సీ విలువ పడిపోవడంతో ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం బంగారాన్ని విశ్వసనీయ ఆస్తిగా భావిస్తున్నాయి. ఇది కూడా పసిడి పెరుగుదలకు కారణమవుతోంది.
విదేశీ ప్రభుత్వాలు కూడా పెద్ద మొత్తంలో డాలర్లను నిల్వ చేయాల్సి రావడం వల్ల సాధారణంగా అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెడుతుంటాయి. అయితే ట్రంప్ విధానాల కారణంగా అమెరికా ఆస్తులపై నమ్మకం తగ్గింది. ఫలితంగా వారు బాండ్లకన్నా బంగారంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. దీని వలన అంతర్జాతీయంగా బంగారం ధర మరింత ఎత్తుకు వెళ్ళింది. క్లుప్తంగా చెప్పాలంటే.. ట్రంప్ ఆర్థిక విధానాలు, ప్రపంచ వాణిజ్య యుద్ధాలు, డాలర్ బలహీనతపై అమెరికా అధ్యక్షుడి భయాలు, ఫెడ్‌పై ఒత్తిడి, పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. బంగారం ధరలను రికార్డు స్థాయికి తీసుకెళ్తున్నాయి.
ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం మరింత ఎత్తుకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడిదారులకు ఇది భరోసా కలిగించే అంశమైతే.. వినియోగదారులకు మాత్రం పెరుగుతున్న ధరలు కొత్త సవాళ్లను సృష్టించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications