పేదరికంలో జన్మించి లక్షల రూపాయల జీతానికి చేరుకున్న ఓ బెంగళూరు టెక్కీ కథ రెడ్డిట్‌లో వైరల్ అవుతోంది. బెంగళూరుకు చెందిన ఓ వెబ్ డెవలపర్ తన జీవిత ప్రయాణం గురించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం రెడ్డిట్ వేదికగా షేర్ చేసుకున్నాడు. చిన్నతనంలో పడిన బాధలు, కన్నీళ్లు, కష్టాలను ఇప్పుడు తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. చిన్నప్పుడు పస్తులతె పడుకున్న రోజులు తలుచుకున్న ఈ టెకీ ఇప్పుడు ఏడాదికి రూ. 46 లక్షల జీతం పొందుతున్నాడు. తన కుటుంబానికి ఎనలేని గౌరవాన్ని తీసుకువచ్చాడు. తన తల్లిదండ్రులు కష్టాలు పడుతూ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారని అతడు చెబుతున్నాడు.
రెడ్డిట్‌లో పేరు లేకుండా పోస్ట్ చేసిన ఈ టెకీ.. వ్యవసాయం చేసే రైతు కుటుంబంలో జన్మించాడు. అతని తల్లి పిల్లల కోసం రెండు ఉద్యోగాలు చేసేది. పగలు ఇళ్లకు వెళ్లి శుభ్రం చేయడం, రాత్రి గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేయడం వంటి ఉద్యోగాలతో పిల్లల్ని చదివించింది. ఆమె చేతులు ఎప్పుడూ పనితోనే గడిపేవి కానీ ఆమె హృదయం మాత్రం పిల్లల మీద ప్రేమతో నిండి ఉండేదని అతను ఆత్మీయంగా గుర్తు చేసుకున్నాడు.

ఆ టెకీ తన చిన్నప్పుడు తల్లి వద్ద కాకుండా ఊఱిలో అమ్మమ్మ దగ్గర ఉండి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివాడు. తల్లి బెంగుళూరులో జాబ్ చేసేది. అయితే బెంగళూరులో అధిక ఖర్చులు తట్టుకోలే పిల్లలను ఆమె ఊళ్లోనే తల్లి దగ్గర వదిలేసింది. పిల్లలు అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకున్నారు. డబ్బులేకపోవడంతో తిండి, హాస్టల్ అవసరాల కోసం పాలిటెక్నిక్ కళాశాలలో చేరాడు. ఆ సమయంలో చదువుపై ఆసక్తి కంటే బతకడానికి చాలా అవసరం అనేది అతనిని ముందుకు నడిపించింది.
అయితే అతని అన్నయ్య పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగం సంపాదించడంతో కొంచెం ఆర్థికంగా ఆసరా అయింది.ఆ కుటుంబానికి కొంత ఊపిరిపీల్చుకునే అవకాశం లభించింది.ఆ ఆర్థిక ఆసరాతోనే ఈ యువకుడు కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఓ చిన్న ఉద్యోగంలో చేరాడు. మొదటి ఉద్యోగంలో అతని నెల జీతం రూ.5 వేలు మాత్రమే. అయినా అతను భవిష్యత్తు మీద ఆశతో బతికాడు.నిరంతరం నేర్చుకుంటూ కష్టపడ్డాడు. నేర్చుకుంటూనే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అదే కంపెనీలో ఏళ్ల పాటు పనిచేస్తూ వచ్చాడు.
అతని ప్రతిభను గుర్తించిన కంపెనీ ఉన్నతవకాశం కల్పించింది. ఇప్పుడు అతను అదే సంస్థలో అతను ఇంజినీరింగ్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. అతను పోస్టులో చెబుతూ..నేను కంపెనీలు మారలేదు. నేను మారానని చెబుతున్నాడు. రూ. 46 లక్షల జీతం సాధారణమైపోయిన ఈ రోజుల్లో కూడా.. ఇది తన కుటుంబానికి ఒక గర్వకారణమైన విజయం అని చెబుతున్నాడు. ఇప్పుడు అతనికి అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు వెళ్లే అవకాశాలొచ్చాయి. ఒకప్పుడు కలగా మిగిలిన ఇల్లు, భూమి , కార్ అన్నింటినీ నెరవేర్చుకున్నారు. ఇతని కథ Reddit లోచాలా మందిని ఆకర్షించింది. చాలామంది పాజిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. కృషి, ఓర్పు, ఆశను కలిపితే, ఎంత పెద్ద లక్ష్యమైనా చేరవచ్చని ఈ కథ ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోంది.
More From GoodReturns

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

పిల్లలకు సోషల్ మీడియా బంద్! ఆ రాష్ట్రంలో సంచలన నిర్ణయం!

ఫ్రిజ్‌లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..



Click it and Unblock the Notifications