Bank FD Rates: ఆగస్టు నెలలో రిజర్వు బ్యాంక్ పాలసీ సమీక్ష సమావేశంలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. వరుసగా మూడు సమావేశాల్లో రేటు పెంపు తరువాత రెపో రేటు 5.4 శాతానికి చేరుకుంది. వడ్డీరేట్ల పెంపుతో బ్యాంకుల రుణ రేట్లు, డిపాజిట్ రేట్లు పెరిగాయి. స్టేట్ బ్యాంక్ సహా ప్రముఖ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రేట్లను పెంచడంతో ఇన్వెస్టర్లకు ఊరట లభించింది. ఆర్‌బీఐ రేట్లపెంపు తర్వాత డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన 6 బ్యాంకుల వడ్డీ రేట్ల వివరాలు పరిశీలిద్దాం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ఆగస్టు 13న దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. వివిధ కాల వ్యవధులకు సంబంధించిన డిపాజిట్లపై 0.15 శాతం పెంచింది. సాధారణ పెట్టుబడిదారులకు 5.65 శాతం, 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న కాలపరిమితి కలిగిన సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.

ఇండస్ఇండ్ బ్యాంక్..
ఇండస్ఇండ్ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఆగస్టు 12న సవరించబడింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 6.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 4.25 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 18 నెలల నుంచి 61 నెలల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు అత్యధిక రేటును పొందుతాయని బ్యాంక్ వెల్లడించింది.

యాక్సిస్ బ్యాంక్..
AXIS బ్యాంక్‌లో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.50 శాతం నుంచి 6.05 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది సాధారణ పెట్టుబడిదారులు పొందే రేటు. అయితే.. సీనియర్ సిటిజన్లు 2.50 శాతం నుంచి 6.80 శాతం వరకు వడ్డీ రేట్లు పొందుతారు. 17 నెలల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లకు అధిక రేట్లు ఉంటాయి. ఆగస్టు 11న సవరించిన రేటు ప్రకారం రూ.2 కోట్ల లోపు 17 నెలల నుంచి 18 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 6.05 శాతంగా ఉంది. అంతకుముందు ఇది 5.60 శాతంగా ఉండేది.

కోటక్ మహీంద్రా బ్యాంక్..
కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా ఫైనాన్స్ కింద ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న ఒక ప్రైవేట్ బ్యాంక్. రెగ్యులర్ డిపాజిటర్లు కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు డిపాజిట్లపై 2.50 శాతం నుంచి 5.90 శాతం వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఇది 3.00 శాతం నుంచి 6.40 శాతం వరకు ఉంది.

కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ దేశంలో నాల్గవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా ఉంది. బ్యాంక్ కు 10,391 శాఖలు, 13,423 ATMలు ఉన్నాయి. ఆగస్టు 8న కెనరా బ్యాంక్ రూ.2 కోట్ల లోపు డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కెనరా బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు డిపాజిట్లను స్వీకరిస్తుంది. రెగ్యులర్ డిపాజిటర్లకు 2.90 శాతం నుంచి 5.75 శాతం వడ్డీ చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 2.90 శాతం నుంచి 6.25 శాతం వరకు ఆఫర్ చేస్తోంది.

యస్ బ్యాంక్
యస్ బ్యాంక్ 2004లో ముంబైలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. కొత్త తరం బ్యాంక్ అయిన యస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే డిపాజిట్లపై 3.25 శాతం నుంచి 6.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.75 శాతం నుంచి 7.50 శాతం వరకు చెల్లిస్తోంది. అత్యధిక రేటు సాధారణ పెట్టుబడిదారులకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వరకు ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications