South Asia Political Landscape : దక్షిణాసియాలో రాజకీయాలు గత కొంత కాలం నుంచి భగ్గుమంటున్నాయి. ఏకంగా దేశ నాయకులనే మార్చివేసేలా యువత ఉద్యమిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే.. భారతదేశ పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల్లో ప్రజలు తమ అసంతృప్తిని పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు. అవినీతి, నిరుద్యోగం, న్యాయసంబంధ సమస్యలతో పాటు ఇతర సమస్యలు ప్రజల కోపానికి కారణమయ్యాయి. వీటితో పాటు తాజాగా నేపాల్ లో విధించిన సోషల్ మీడియా నిషేధం కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ దేశాల్లో జరిగిన నిరసనల్లో కొన్ని సాధారణ అంశాలను గమనించినట్లైతే.. అవినీతి, బంధుప్రీతిని వ్యతిరేకించడం, పేదలకు ఉద్యోగాలు లేకపోవడం, పారదర్శకత, సమానత్వానికి పోరాటం వంటి అంశాలు ఉన్నాయి.
2025 సెప్టెంబర్ 9న, నేపాల్‌లోని జనరల్ జెడ్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ ఉద్యమం దెబ్బకు ప్రధాని కె.పి. శర్మ ఓలి తన రాజీనామా ప్రకటించారు. నిరసనలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. యువకులు సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. దీంతో పాటుగా ఉద్యోగ అవకాశాల కొరత, పెరిగిన అవినీతి, సామాజిక అసమానతను వారు తీవ్రంగా ఖండించారు. పోలీసు దళాలు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్‌లు, ప్రత్యక్ష మందుగుండు సామగ్రి ఉపయోగిస్తూ నిరసనకారులను అణచాలని ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పింది.

నిరసనకారులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించి, ప్రధాన మంత్రి, ఇతర సీనియర్ నాయకుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘర్షణలో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు. KP ఓలి వెంటనే ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సి వచ్చింది. యువత తాము ఎదుర్కొంటున్న అసమానతలపై స్వేచ్ఛగా మాట్లాడేందుకు వీధుల్లోకి వచ్చినప్పటి నుండి, నేపాల్ రాజకీయ దృశ్యం పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.
గతంలో జరిగిన రాజకీయ సంక్షోభాలను ఓ సారి పరిశీలిస్తే..
శ్రీలంక తీవ్ర రాజకీయ సంక్షోభం: 2022లో శ్రీలంక ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పడిపోయింది. ప్రజలు ఆహారం, ఇంధనం, మందుల కొరతతో కష్టపడుతున్నపుడు, ప్రభుత్వ వైఫల్యం తీవ్ర విమర్శకు గురైంది. గోటబయ రాజపక్స అధ్యక్షుడిగా ఉండగా ప్రజలు అతనిని పూర్తిగా బహిష్కరించి.. ఆయన ఇంట్లోకి చొరబడి దాడి చేసే వరకు నిరసనలు సాగాయి. చివరికి గోటబయ రాజపక్స్ దేశాన్ని విడిచి సింగపూర్‌కు పారిపోయారు. అక్కడి నుంచి రాజీనామా చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు తమ వాయిస్ ద్వారా రాజకీయ మార్పును డిమాండ్ చేయడం హైలెట్ అంశంగా చెప్పుకోవచ్చు.
బంగ్లాదేశ్‌లో భారీ నిరసనలు: 2024లో బంగ్లాదేశ్‌లోనూ భారీ నిరసనలు చోటు చేసుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమం నడిపారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో కోటా వ్యవస్థను చర్చిస్తూ, అవినీతి, బంధుప్రీతిపై అవినీతిపరులైన రాజకీయ నాయకుల సమర్ధనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అధికారం బంధుప్రీతితో పాలించబడుతుందంటూ..వేలాది మంది ప్రజలు రోడ్డు మీదకు చేరి తమ నిరసనలు వెళ్లగక్కారు. ప్రభుత్వ అధికారాన్ని అణచివేయడం వలన షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. నిరసనలు పెరిగి పోలీస్ దళాలతో ఘర్షణలు, హింస జరగడంతో, ప్రధానమంత్రి షేక్ హసీనా చివరికి భారతదేశానికి వచ్చి తన రాజీనామాను ప్రకటించారు.
నేపాల్ జనరల్ జెడ్ తిరుగుబాటు: 2025 ఆగస్టులో నేపాల్‌లో జనరల్ జెడ్ తిరుగుబాటు దేశాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టివేసింది. సోషియల్ మీడియా నిషేధం, అవినీతి, ఉద్యోగ అవకాశాల కొరతకు నిరసనలు పెరిగాయి. వేలాది మంది యువత వీధుల్లోకి వచ్చారు, స్కూల్ యూనిఫార్మ్‌లు ధరించి, పుస్తకాలను తీసుకొని ప్రజాస్వామ్య పోరాటంగా నిలిచారు. పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్‌లతో నిరసనకారులను గట్టిగా అణచివేయాలని ప్రయత్నించినప్పటికీ, వారు వెనక్కి తగ్గలేదు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. నిరసనలు పెరిగి పార్లమెంట్ భవనం, మాజీ ప్రధానమంత్రులు ఇళ్లకు నిప్పటించే పరిస్థితులు కనిపించాయి. చివరికి కెపి శర్మ ఓలి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దేశాధ్యక్షుడు కూడా తన రాజీనామాను ప్రకటించాల్సి వచ్చింది.
ఇండోనేషియా రాజకీయ అస్థిరత: ఇండోనేషియాలోని జకార్తాలో ఎంపీలకు గృహ భత్యాలు అత్యధికంగా ఉండటం వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనగా మారారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, ఇతర సామాజిక రంగాల్లో కోతలు అమలు చేయడం ప్రజల కోపానికి కారణమైంది. ఎంపీలకు గృహ భత్యాలు, పెన్షన్లు అధికంగా ఉండటం వ్యతిరేకించి వేలాది మంది నిరసనలు చేపట్టారు.ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. కొన్ని చోట్ల భద్రతా దళాల కఠిన చర్యల కారణంగా తీవ్ర హింస జరిగినా కూడా ఉద్యమకారులు తమ నిరసనలు ఆపలేదు.
ఏదైమైనా దక్షిణాసియాలో ప్రజల నిరసన ఒక సామాన్య సమస్య కాదు. ఇది చాలా సంవత్సరాలుగా పెరిగిపోయిన నిరుద్యోగం, అవినీతి, అవకాశ అసమానతలతో కూడిన నిరాశల సమాహారంగా చెప్పవచ్చు. యువత తన హక్కుల కోసం, సమానత్వానికి, పారదర్శక రాజకీయ వ్యవస్థ కోసం వీధుల్లోకి వచ్చారు. ప్రతి దేశంలో పరిస్థితులు భిన్నమైనప్పటికీ, ఆందోళనలకు వెనుక ఉన్న మూల కారణాలు మాత్రం అవినీతి, సామాజిక అసమానతలు, రాజకీయ నాయకుల పిల్లలు విలాస జీవనశైలిలో జీవించడమేనని చెప్పుకోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications