For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon Prime Day 2022: అమెజాన్ ప్రైమ్ డే లో మెగా డిస్కౌంట్లు.. స్మార్ట్ ఫోన్ ప్రియులకు స్పెషల్ ఆఫర్లు..

|

Amazon Prime Day 2022: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వచ్చే వారం అమెజాన్ ప్రైమ్ డే- 2022 సందర్భంగా జూలై 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు మెగా సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సహా పలు కేటగిరీల్లోని కస్టమర్‌ల కోసం అమెజాన్ అనేక డీల్‌లను వెల్లడించింది. టీవీలు, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌ కేటగిరీలో Apple, Samsung, OnePlus, Xiaomi, Realme వంటి బ్రాండ్లపై వినియోగదారులు ఉత్తమ ఆఫర్లను పొందవచ్చు. ICICI, SBI క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తగ్గింపు కూడా ఉంది. పైగా ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న వారికి ఉత్పత్తులపై రూ. 20,000 వరకు తగ్గింపు, 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఉంది.

Apple&Samsung:

Apple&Samsung:

ఎంపిక చేసిన ఐఫోన్ మోడల్‌లపై వినియోగదారులు రూ.20,000 వరకు తగ్గింపును పొందవచ్చు. iPhone 13 Pro, iPhone 13 Pro Max మోడళ్లపై గొప్ప డీల్‌లు అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో Samsung అభిమానులు Galaxy S21 FEపై 30 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని అమెజాన్ వెల్లడించింది. Galaxy M52పై ఫ్లాట్ రూ.15,000 తగ్గింపుతో సహా బ్రాండ్ M-సిరీస్ ఫోన్‌లపై ఆఫర్‌లను ఆస్వాదించవచ్చు. వినియోగదారులు Galaxy M53, M33పై రూ. 8,000 తగ్గింపు, Galaxy M32పై రూ.5,000 తగ్గింపును పొందవచ్చు.

OnePlus:

OnePlus:

అమెజాన్ సేల్ లో OnePlus-9ని రూ.37,999కి అందిస్తోంది. కస్టమర్‌లు 9 నెలల వరకు నో-కాస్ట్ EMIతో OnePlus-10R, OnePlus 10 ప్రోలను కొనుగోలు చేయవచ్చు. వారు కూపన్‌లపై రూ.4,000 వరకు, పాత మెుబెల్ ఎక్ఛ్సేంజ్ పై రూ.7,000 వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. కస్టమర్‌లు OnePlus-10Rని కూపన్‌లు, బ్యాంక్ ఆఫర్‌లతో రూ.34,999కే కొనుగోలు చేయవచ్చు. ఎక్ఛ్సేంజ్ లో అదనంగా రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు. OnePlus Nord 2CE Lite అదనపు కూపన్‌లతో వస్తుంది. OnePlus Nord 2T, Nord CE2 మోజళ్లపై తక్షణ బ్యాంక్ తగ్గింపులతో పాటు నో-కాస్ట్ EMIతో పొందవచ్చు.

Xiaomi:

Xiaomi:

Redmi 9-సిరీస్ అమెజాన్ ప్రైమ్ డే- 2022 సందర్భంగా కూపన్‌తో రూ. 600 అదనపు ప్రయోజనాలతో రూ. 6,899 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది. Note 10T 5G, Note 10 Pro, Note 10 Pro Max, Note 10Sలను కలిగి ఉన్న Redmi Note 10 సిరీస్ కొన్ని అదనపు బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 10,999 నుంచి విక్రయించబడుతుంది. కస్టమర్లు Xiaomi 11 Liteని రూ. 23,999కి, Xiaomi 11T ప్రోని రూ.35,999కి పొందవచ్చు. Xiaomi 12 Pro కూడా రూ.56,999 తగ్గింపు ధరలో అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్లు, కూపన్‌లతో పాటు రూ.6,000 వరకు అదనపు ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి.

Realme and iQOO:

Realme and iQOO:

Narzo 50 5G, Narzo 50 Pro, Narzo 50Aలను కలిగి ఉన్న Realme Narzo 50-సిరీస్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్న వారు.. సేల్ సందర్భంగా రూ.11,499 ప్రారంభ ధర వద్ద పొందవచ్చు. iQOO Neo 6 రూ.29,999కి లభిస్తుండగా, iQOO Z6 Pro రూ.23,999కే అందుబాటులో ఉంది. కస్టమర్లు iQOO Z6ని కూపన్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో రూ.14,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

75 శాతం డిస్కౌంట్..

75 శాతం డిస్కౌంట్..

ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, కెమెరాలు, టాబ్లెట్‌లు, హెడ్‌ఫోన్‌లు, ప్రింటర్లు, గేమింగ్ యాక్సెసరీలు, స్పీకర్‌లు, సౌండ్‌బార్‌లతో సహా ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలపై ప్రైమ్ డే- 2022 సేల్ సందర్భంగా Amazon 75 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. పవర్ బ్యాంక్‌లు ప్రారంభ ధర రూ.499, మొబైల్ కేస్‌లు, కవర్లు రూ.99 నుంచి, కేబుల్స్ రూ.49, ఛార్జర్‌లు రూ.139 కే అందుబాటులో ఉన్నాయి.

ఇతర ఉత్పత్తులపై ఇలా..

ఇతర ఉత్పత్తులపై ఇలా..

ప్రైమ్ డే- 2022 సేల్ సమయంలో కస్టమర్‌లు Amazon Echo స్మార్ట్ స్పీకర్‌లు, స్మార్ట్ డిస్‌ప్లేలపై 55 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. Kindle eReadersపై రూ.4,000 వరకు తగ్గింపు లభిస్తుండగా.. కిండ్ల్ పేపర్‌వైట్ రూ.11,099, కిండ్ల్ పేపర్‌వైట్ సిగ్నేచర్ రూ.15,299కే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Read more about: amazon ecommerce
English summary

Amazon Prime Day 2022: అమెజాన్ ప్రైమ్ డే లో మెగా డిస్కౌంట్లు.. స్మార్ట్ ఫోన్ ప్రియులకు స్పెషల్ ఆఫర్లు.. | from smart phone to home appliances and electronic goods are available at mega discounts in Amazon Prime Day 2022 sale

Amazon Prime Day 2022: Best deals on Apple, Samsung, OnePlus smartphones and more
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X