నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నా, జీవితాలు మాత్రం అప్పుల మాయాజాలంలో ఇరుక్కుపోయాయి. ఓ రెడ్డిట్ వినియోగదారి తన నెల జీతం రూ. 43,000 అయితే అవి మూడే నిమిషాల్లో ఎలా ఖాళీ అయ్యాయో వివరించారు. ఇంటి అద్దె, క్రెడిట్ కార్డు పేమెంట్లు, EMIs, మిగిలిన బిల్లులు, ఖర్చులు ఇలా ఇవన్నీ కలిపి చివరికి అతని బ్యాలెన్స్ రూ. 7కే పరిమితం చేశాయి. ఇది ఎవరి వ్యక్తిగత తప్పు కాదు, కానీ ఇది నగర జీవనశైలిలో వేగంగా మింగేస్తున్న నిశ్శబ్ద సంక్షోభం. పర్సనల్, గృహ, వాహన రుణాల సౌలభ్యం స్థిరంగా ఉన్న జీతాలు మరియు ప్రతిష్ట కోసం వస్తువుల కొనుగోళ్ల మోజులో పడిపోయారు. ఇవన్నీ కలసి, మధ్యతరగతి జీవితాన్ని నెల నెలా దోచేస్తున్నాయి.

ఆ ఉద్యోగి తన పోస్ట్ లో చెప్పిన ప్రకారం తన జీతం తన ఖాతాలో క్రెడిట్ అయ్యినప్పుడు 5 నిమిషాల్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం రూ. 43,000 నుంచి చివరకి రూ. 7 కి మిగిలిపోయింది. అది అంత త్వరగా ఎలా ఖర్చుయిందంటే రూ. 19,000 ఇంటి అద్దెకి, రూ. 15000 క్రెడిట్ కార్డు మినిమమ్ పేమెంట్(మొత్తం బకాయి రూ. 60,000), మరో రెండు EMIsకి రూ. 10,000, ఇంకా మిగతా బిల్లులు ఇంటర్నెట్, మొబైల్ రీఛార్జీ లకి మొత్తం రూ. 3700. ఇలా మొత్తం అన్నీ బిల్లులు పోగా తనకి రూ. 7 మిగిలింది. ఇది ఒక వ్యక్తి సమస్య లాగా అనిపించినా, ఇలాగే చాలామంది మధ్య తరగతి ఉద్యోగుల ఆర్దిక వాస్తవాలు. చాలా కుటుంబాలు EMIల పైనే ఆధారపడి ఉంటున్నాయి. ఇలాంటి జీవన శైలి చాలా మంది నగర యువత జీవిస్తున్నారు.
ఇలా ఎందుకు జరుగుతున్నాయి?
RBI గణాంకాల ప్రకారం, గత మూడేళ్లలో పర్సనల్ రుణాలు 75% పెరిగాయి. ఉద్యోగులు వారి జీతంలో సగానికిపైగా (33%-45%) భాగాన్ని EMIకే ఖర్చుపెడుతున్నారు. ఇంటి అద్దె, ఆహారం, పొదుపుఖర్చులు వంటివి పక్కన పెట్టిన తర్వాతనే గణాకాలు ఇలా ఉన్నాయి.
మార్సెలస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్‌కు చెందిన సౌరభ్ ముఖర్జియా ఇలా అంటున్నారు "ఇది పెట్టుబడుల కోసం అప్పు కాదు బతకడానికి తీసుకునే అప్పునే ఎక్కువ అవుతుంది.
పెర్ఫియోస్‌కి చెందిన సుజయ్ హెచ్చరిస్తు ఇప్పుడున్న పరిస్థితుల్లోఒక కొత్త EMI జీవనశైలిలో మొబైల్‌లు, గాడ్జెట్లు వెంటనే వచ్చేటట్లు చేస్తున్నాయి. కానీ దీని వెనక అప్పు మాత్రమే ఉంది. దీర్ఘకాలికంగా అది మన ఆర్థిక ఆరోగ్యాన్ని భగ్నం చేస్తుంది.
ఆర్థికవేత్త ఆర్.పీ.గుప్తా దీన్ని "టిక్కింగ్ బాంబు"గా చెప్పుకొస్తున్నారు. ఇది ఉద్యోగిని ఆధారిత ఆర్థిక వృద్ధిని మందగించిస్తూ, అసమానతల్ని పెంచే ప్రమాదం ఉంది.
డేటా శాస్త్రవేత్త మోనిష్ గోసార్ చెప్పిన మాటలు కళ్ళు తెరిచేలా ఉన్నాయి "బ్యాంకులు మమ్మల్ని ఉరికి పడేయలేదు-వాళ్లు కేవలం తాడు ఇచ్చారు. మేమే మెడలకు వేసుకుంటున్నాం.
ప్రస్తుతం మనిషి సంపాదించే డబ్బుతో సంబంధం లేని క్రెడిట్ కార్డులు, బై నౌవ్ పే లేటర్, పర్శనల్ రుణాలు మొత్తం కలిపి దేశ GDPలో 41.9% వంతు ఉండగా, సగం వరకు అప్పులు ఖర్చుల కోసమే తీసుకుంటున్నాం కానీ సంపద సృష్టిచడం కోసమైతే కాదు.
ప్రతి వ్యక్తికి సగటు అప్పు రూ.4.8 లక్షలు. అదే సమయంలో దేశీయ గృహ పొదుపులు 47 ఏళ్ల కనిష్టానికి చేరాయి. ఈ రెడ్డిట్ ఉద్యోగి కథ తన ఒక్కరిదే కాదు ఇది మన దేశ మధ్యతరగతికి ముంచుకొస్తున్న ఆర్థిక ప్రమాదమే అని చెప్పొచ్చు.
ఈ అప్పుల జీవితం నుంచి బయటపడాలంటే మార్పు మీలోనుండే మొదలవాలి. జీతం వచ్చిన ప్రతి నెలా ఖర్చులకు అలవాటు అయ్యే జీవితం కాకుండా, భవిష్యత్తు కోసం ఒక చిన్న పోదుపును కూడా మొదలుపెట్టే జీవనశైలి వైపు అడుగులు వేయాలి. మీ అవసరాల్ని అర్థం చేసుకుని, అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం. అప్పు అన్నది అవసరంగా ఉండొచ్చు కానీ అలవాటయ్యేంత వరకు అయితే కాదు. ఎంత సంపాదించామన్నది కాదు ఎంత మిగుల్చుకోగలిగామన్నదే అసలైన ఆర్థిక విజయం. ఇలాంటి దిశ వైపు అందరం నడవాల్సిన సమయం ఇది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications