అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి సంపాదించాలంటే ఉన్న ఏకైక మార్గం రియల్ ఎస్టేట్. ఇక ఏ రంగంలోనూ ఆస్థాయిలో ఆదాయం కనిపించదు. అందుకే అందరూ రియల్ ఎస్టేట్ వెంట పరుగులు పెడుతుంటారు. తాజాగా రూ. 12 వేలు పెట్టుబడి పెట్టి దాన్ని రూ. 100 కోట్లుగా ఎలా మార్చుకోవచ్చో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పిన కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురుగ్రామ్ లో సైలెంట్ ఇన్వెస్టర్ మ్యాజిక్ చేసే విధానం నెటిజన్లను షాకింగ్ కు గురి చేస్తోంది.
కోట్ల రూపాయలు సంపాదించాలంటే వారసత్వం అవసరమా? దశాబ్దాల పాటు ఎదురు చూడాలా? ఇవన్నీ పాతరోజులంటోంది గురుగ్రామ్‌కు చెందిన ఐశ్వర్య శ్రీ కపూర్. ఇప్పటి పెట్టుబడిదారులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపద ఎలా సాధించాలో నేర్చుకుంటున్నారని చెబుతున్నారు. ఆమె ఏమంటున్నారంటే.. సంపద అనేది ఖచ్చితమైన ఒప్పందం నుంచి రాదు... ఆ ఒప్పందం ఆస్తులను వేగంగా మెరుగుపరిచేలా చేసుకునే వారిదే అసలైన విజయం అంటూ చెప్పుకొచ్చారు.

ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొన్ని సూత్రాలు చెబుతున్నారు. అమ్ముడవుతున్న మొదటి దశలోనే ఫ్లాట్ కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు, రూ. 12 వేలు స్క్వేర్ ఫీట్ ధరతో 2,000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కొంటే మొత్తం ఖర్చు రూ. 2.4 కోట్లు అవుతుంది. కొంతకాలానికే అదే ప్రాపర్టీ రూ. 14,000 స్క్వేర్ ఫీట్‌కు చేరితే రూ. 40 లక్షల లాభం సిద్ధం! అదికూడా మీరు స్వాధీనం చేసుకోవడానికి ముందేనని చెబుతోంది.
డెవలపర్‌తో చెల్లింపుల ప్లాన్ గురించి చర్చలు జరపడం లేదా బేరం ఆడటం వంటివి చేయడమన్నది గొప్ప అవకాశం అని ఆమె అంటోంది. 40:60 ప్లాన్ నుండి 50:50 లేదా ఫ్లెక్సిబుల్ ప్లాన్‌కు మారితే 3%-5% వరకు తక్కువ ధరకు పొందవచ్చు. అంటే చెల్లింపుల వేగాన్ని పెంచి మనం డిస్కౌంట్ తెచ్చుకోవచ్చు. లాభం మొదట చెల్లింపులోనే మొదలవుతుందని సూచిస్తోంది. ఇక తక్కువ ఖర్చుతో ఇంటిని అప్‌గ్రేడ్ చేస్తే రీసేల్ విలువ అమాంతం పెరుగుతుందని కూడా ఆమె చెప్పుకొస్తోంది.
ఉదాహరణకు రూ.300 స్క్వేర్ ఫీట్ ఖర్చుతో ఇంటి ఫినిషింగ్ మెరుగుపరిచితే రీసేల్ సమయంలో అదే రూ. 500-రూ. 600 స్క్వేర్ ఫీట్ ఎక్కువ ధర ఇవ్వొచ్చు.అయితే మీరు స్వాధీనం చేసుకున్న తర్వాత ఎక్కువ కాలం ఆలస్యం చేస్తే returns పడిపోతాయి.3-4 ఏళ్లలో 12%-15% IRR సాధించవచ్చు. కానీ, అమ్మకం ఆలస్యం చేస్తే అదే ఆస్తి కేవలం 7%-9% IRR ఇస్తుంది. కాబట్టి స్పీడ్ + టైమింగ్ + తెలివి ఈ మూడు ఉపయోగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చెబుతోంది.
ఒక ఆస్తి కొనుగోలు చేసే ముందు రెంటల్ డిమాండ్, లీగల్ టైటిల్, నిర్మాణ నాణ్యత ఇవన్నీ పరిశీలించాలి. వాస్తవ లాభాలను కలిగించని ఆస్తి, ఖర్చులతో నష్టాలు మాత్రమే మిగులుస్తుంది.బ్యాంక్ లోన్‌లు, ప్రైవేట్ ఫండ్లు కలిసి వస్తాయి. కానీ ప్రాపర్టీ బ్రేక్ ఈవెన్ 90% కంటే ఎక్కువైతే ప్రాజెక్ట్ ముప్పులో ఉందని అర్థం చేసుకోవాలని చెబుతోంది. గట్టి పరిశీలన లేకపోతే - లీగల్ సమస్యలు, రిపేర్ ఖర్చులు, ఖాళీగా ఉండే ప్రాపర్టీలు దెబ్బతీస్తాయి. క్యాష్ ఆన్ క్యాష్ రిటర్న్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ కన్నా మెరుగ్గా ఉండాలని ఐశ్వర్య శ్రీ కపూర్ చెబుతోంది.
అస్థిరమైన చెల్లింపుల ద్వారా మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చని చెబుతోంది. మీరు పే చేసే సమయంలో 100 శాతం ముందుగా చెల్లించకుండా.. నిర్మాణం జరుగుతున్న కొద్దీ డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడ చెల్లించకుండా మిగిలిన డబ్బు వేరే చోట మీకు ఆదాయం రూపంలో వస్తూ ఉంటుందని ఐశ్వర్య చెబుతోంది .
More From GoodReturns

వైజాగ్ రియల్ ఎస్టేట్.. ఈ నాలుగు జోన్లలోని ఫ్లాట్ల కోసం ఎగబడుతున్న కొనుగోలుదారులు..కారణం ఏంటంటే..

Bengaluru: బెంగళూరు రియల్ ఎస్టేట్ 2026.. ఏ ఏరియాలో ధర ఎంత? పూర్తి వివరాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications