భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత ICICI బ్యాంక్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నిబంధనల్లో కీలక మార్పులను తీసుకొచ్చింది. ఆగస్టు 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నియమాలు.. కొత్త కస్టమర్లపై పెద్ద ప్రభావం చూపనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 1 లేదా ఆ తరువాత సేవింగ్స్ ఖాతా తెరవబోయే మెట్రో, అర్బన్ ప్రాంతాల కొత్త కస్టమర్లు మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.
అలా చేయని వారికి భారీగా జరిమానాలు విధించనున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. నెలవారీ కనీస సగటు బ్యాలెన్స్ (Monthly Average Balance - MAB) రూ. 50 వేల రూపాయల వరకు నిర్వహించాలి. అయితే ఇది పాత కస్టమర్లకు వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది. వారు ఇప్పటికీ రూ. 10 వేలు నెలకు మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాలి.

అయితే సెమీ అర్బన్ ప్రాంతాల కొత్త కస్టమర్లు మాత్రం రూ. 25,000 నెలవారీ మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల కొత్త కస్టమర్లు.. రూ. 10,000 MAB తప్పనిసరి చేసింది. ఇక పాత కస్టమర్ల విషయంలో.. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో Monthly Average Balance రూ. 5 వేలు గానే కొనసాగుతుంది. కనీస సగటు బ్యాలెన్స్‌ను పాటించకపోతే భారీగా వడ్డన ఉంటుంది. లోటు మొత్తంలో 6 శాతం లేదా రూ. 500 శాతం.. రెండింటిలో ఏది తక్కువ అయితే.. ఆ మొత్తాన్ని జరిమానాగా వసూలు చేస్తుంది బ్యాంక్.
క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా పరిమితులను కూడా ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ప్రతీ నెలలో మూడు కాంప్లిమెంటరీ నగదు డిపాజిట్లు ఉచితమన తెలిపింది. ఆ తరువాత ప్రతి డిపాజిట్‌కు రూ. 150 ఛార్జ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నగదు డిపాజిట్ పరిమితి నెలకు రూ. 1 లక్ష మాత్రమేనని తెలిపింది. దీంతో పాటుగా నగదు ఉపసంహరణలకూ (withdrawals) ప్రతీ నెలలో మూడు లావాదేవీలు ఉచితం. ఆ పరిధి దాటిటే చార్జీలు వర్తిస్తాయి. ఇక థర్డ్ పార్టీ క్యాష్ డిపాజిట్లు.. ప్రతి లావాదేవీకి రూ. 25 వేల వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది ఐసీఐసీఐ బ్యాంక్
ఏప్రిల్ 2025లో ICICI బ్యాంక్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించింది. ప్రస్తుతం రూ. 50 లక్షల వరకు డిపాజిట్లు ఉన్న ఖాతాలకు 2.75 శాతం వడ్డీ ఇస్తోంది.ICICI బ్యాంక్ ఈ నిర్ణయం ఇతర ప్రైవేట్ బ్యాంకుల కంటే చాలా కఠినంగా కనిపిస్తోంది. దేశంలో అతిపెద్ద దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. 2020లో కనీస బ్యాలెన్స్ నియమాన్ని పూర్తిగా రద్దు చేసింది. మిగతా ఎక్కువ బ్యాంకులు రూ. 2 వేల రూ. 10 వేల మధ్య MAB మాత్రమే ఉంచుతున్నాయి.
బ్యాంకింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఐసీఐసీ ప్రీమియం కస్టమర్లపై దృష్టి పెడుతోంది. ఖాతా నిర్వహణ ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అధిక MAB ఉంచడం వల్ల బ్యాంక్‌కు తక్కువ ఖర్చుతో నిధులు లభిస్తాయి.జ దీని ద్వారా రుణాల కోసం తక్కువ వ్యయంతో మూలధనం సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అధిక బ్యాలెన్స్ ఉంచగల సామర్థ్యం ఉన్న కస్టమర్లకు బ్యాంక్ సేవలు, నెట్‌వర్క్, డిజిటల్ సౌకర్యాలు ముఖ్యమైన ఆకర్షణగా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications