పూణెలో ఒక శాండ్‌విచ్ స్టోరీ జీవితాన్ని మార్చిన పాఠంలా మారింది. అది ఒక సాధారణ ఆర్డర్..కాని జీవితాన్ని మార్చిన అనుభవాల పేజీ.. కరుణ, నిజాయితీ, మానవత్వం ఇవన్నీ ఆ ఒక్క అర్డర్ రూపంలో బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాయి. ఇప్పుడు ఈకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం..ఇది కేవలం ఒక లంచ్ ఆర్డర్ కాదు..ఒక జీవిత పాఠం.
శ్రీపాల్ గాంధీ అనే యూజర్ తనకు జరిగిన అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. పనీర్ టిక్కా శాండ్‌విచ్, బింగో చిప్స్, ఓట్ రైసిన్ కుకీలు"తో కూడిన ఒక సాధారణ ఆర్డర్ తన హృదయాన్ని ఎలా తాకిందో ఈ పోస్టులో వివరించారు. అతను పోస్ట్ చేసిన వివరాలను ఓ సారి మనం చూసినట్లయితే..

పనీర్ టిక్కా శాండ్‌విచ్, బింగో చిప్స్, ఓట్ రైసిన్ కుకీలను శ్రీపాల్ గాంధీ ఆన్ లైన్ లోఆర్డర్ చేశారు. డెలివరీ వచ్చినప్పుడు, చిప్స్, కుకీలు కనిపించకపోవడం గమనించిన గాంధీ, డెలివరీ రైడర్‌కు విషయం చెప్పారు.అయితే ఆర్డర్ డెలివరీ అయినప్పుడు.. కేవలం శాండ్‌విచ్ మాత్రమే డెలివరీ అయ్యింది. మిగతా ఐటమ్స్ లేవని గమనించి.. గాంధీ ఈ విషయాన్ని డెలివరీ రైడర్‌కి తెలిపారు. జొమాటో రైడర్ కొంచెం తడబడుతూ..సార్, దయచేసి రెస్టారెంట్ లేదా జొమాటోకు కాల్ చేయండని చెప్పాడు. సాధారణంగా జొమాటో రైడర్‌లకు రెస్టారెంట్‌కు తిరిగి వెళ్లాల్సిన బాధ్యత ఉండదు. వారు జొమాటోకు మాత్రమే పని చేస్తారు. అదనపు ట్రిప్పులు చేయడం కూడా వారి పని కాదు.
రెస్టారెంట్ దానికి బాధ్యత వహిస్తూ కస్టమర్ కి సారీ చెప్పింది. జొమాటో రైడర్ వెంటనే తిరిగి వెళ్ళి, మిస్సైన ఐటమ్స్ తీసుకొచ్చాడు. తిరిగి ఇచ్చినపుడు నవ్వుతూ రూ. 20 ఎక్స్ట్రా ఇస్తుంటే... ఆ రైడర్.. దేవుడు నాకు చాలానే ఇచ్చాడు. ఇది నా తప్పు కాదు కదా. ఈ డబ్బు ఎందుకు తీసుకోవాలని అన్నారు. ఇది నా బాధ్యత సార్. కస్టమర్ సంతోషంగా ఉండాలని ఆ రైడర్ చెప్పిన మాటలు గాంధీని కదిలించేశాయి.
ఆ రైడర్ ధైర్యం, వినయాన్ని చూసిన గాంధీ, అతని జీవితం గురించి అడిగారు. వచ్చిన సమాధానం విన ఆశ్చర్యానికి గురయ్యాడు కస్టమర్.. ఒకప్పుడు రైడర్ ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీలో మేనేజర్‌గా పనిచేసేవాడు. నెల జీతం రూ. 1.25 లక్షలు. కానీ ఒక కారు ప్రమాదం ఆయన జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఎడమ చేయి, కాలు పాక్షికంగా పనిచేయకుండా పోయాయి. ఉన్న ఉద్యోగం పోయింది. భవిష్యత్తు చీకట్లోకి వెళ్లిపోయింది.అయితే అతని కథ అక్కడే ముగియలేదు. జొమాటో నా కథను మార్చిందని రైడర్ చెప్పడంతో కస్టమర్ ఆశ్చర్యపోయాడు. వాళ్లు నాకు ఉద్యోగం ఇచ్చారు. ఒక అవకాశం ఇచ్చారు. ఒక ఉద్దేశ్యం ఇచ్చారు సార్ అని అతను చెబుతుంటే కస్టమర్ భావోద్వేగానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇది కేవలం జీవనోపాధి కాదు-ఆయన మళ్లీ లేచి నడిచే ప్రయాణానికి ఓ మెట్టు అని చెప్పారు.
ఇక ఆయన చేరవేసిన ప్రతి పార్సల్ వెనుక ఒక గాథ ఉంది. రైడర్ కుమార్తె డెంటల్ కోర్స్ చదువుతుంది. ఆమె కలను సాకారం చేయడానికి... తండ్రిగా తాను చేసే ప్రతి డెలివరీ ఓ త్యాగమే, ఓ వేదనతో కూడిన పోరాటమే అని చెప్పక తప్పదు. నేను వికలాంగుడినే కావచ్చు. కానీ నాకు కంపెనీ ఈ అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి నేను ఎప్పటికీ జొమాటో పేరు చెడగొట్టను అని అతను చెప్పిన మాటలు ప్రతి ఒక్కర్ని ఆలోచింపజేస్తున్నాయి. చివరగా దేవుడు నాతో ఉన్నాడు. నేను ఎందుకు భయపడాలి? అని అతను అంటుంటే కస్టమర్ అతని ధైర్యానికి సలాం కొట్టాడు. ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వందలాదిమంది స్పందించారు.
చివరగా మా మాట : మనం ప్రతీరోజూ చూసే ఫుడ్ డెలివరీ రైడర్లు కేవలం ఓ ఆర్డర్‌ని తీసుకువచ్చే వ్యక్తులే కాదని, వారి వెనుక కూడా ఒక జీవిత గాథ ఉంటుంది అని ఈ కథ గుర్తు చేస్తోంది. ఉపాధి కోల్పోవడం, వికలాంగత్వం, ఆర్ధిక బాధలు అన్నీ కలిసినా-ఆయన మానవతను, నిజాయితీని కోల్పోలేదు. ఈ కథ మానవ విలువలకు అద్దం పడుతుంది. ప్రతి డెలివరీ వెనుక ఒక గాథ ఉంటుంది. ప్రతి చిరునవ్వు వెనుక ఒక పోరాటం ఉంటుంది. ప్రతి కష్టంలో... ఒక ఆశ ఉంటుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications