దలాల్ స్ట్రీట్‌లోని కొన్ని స్టాక్‌లు చాలా తక్కువ టైంలోనే పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేశాయి. ఇలాంటి షేర్లను మల్టీబ్యాగర్ షేర్లు అంటారు, అంటే ఈ షేర్లు కొంతకాలం వ్యవధిలో వాటి బేస్ ధరను చాలా రెట్లు పెంచుతాయి. దింతో కేవలం కొన్ని సంవత్సరాలలో పెట్టుబడిదారుల సంపద భారీగా పెరుగుతుంది. అయితే పెట్టుబడిదారులకు అద్భుతమైన రిటర్న్స్ అందించిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో కెప్టెన్ పైప్స్ లిమిటెడ్ (captain pipes limited) స్టాక్ ఒకటి.
కెప్టెన్ పైప్స్ కంపెనీ గురించి మాట్లాడితే PVC పైప్స్ పరిశ్రమలో ప్రముఖ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ షేర్లు దలాల్ స్ట్రీట్‌లో పెట్టుబడిదారులకు కానక వర్షం కురిపించింది. ఈ స్టాక్ లాంగ్ టర్మ్, స్మాల్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చింది. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఈ కంపెనీ షేరు ధర 65 పైసలు మాత్రమే. ప్రస్తుత షేర్ ధర రూ.18.92 వద్ద ట్రేడవుతోంది. అయితే గత నాలుగేళ్లలో చూస్తే ఈ స్టాక్ 2823% లాభపడింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.278.13 కోట్లు.

అంటే నాలుగేళ్ల క్రితం ఈ షేర్లలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు దాని విలువ రూ.29.23 లక్షలకు పెరిగి ఉండేది. నాలుగేళ్ల క్రితం ఈ షేర్లు కొని అమ్మకుండా ఇప్పటికీ ఉంచుకున్న వారికి ఇప్పుడు భారీ లాభాలు వచ్చాయి. అలాగే, ఈ స్టాక్ గత కొన్ని సంవత్సరాలుగా స్థిరమైన రాబడిని ఇస్తోంది. ఈ స్టాక్ 2021లో 345% పెరిగితే, 2022లో 427% రికవరీ సాధించింది. 2023లో 22% స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది.
మే 2023లో ఈ కంపెనీ షేర్ రూ.35 స్థాయిని దాటింది. ఈ స్టాక్‌కు ఇది ఆల్ టైమ్ హై. ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో గరిష్ట స్థాయి నుంచి 47% పతనం కావడం గమనార్హం. ఈ స్టాక్ ఎక్స్-బోనస్‌గా మారింది, ఇంకా మార్చి 2023లో ఎక్స్‌ప్లిట్ అయింది. 1:2 రేషియోలో బోనస్ షేర్లను జారీ చేసింది. ఇంకా, 1:10 రేషియోలో వాటా విభజన అంటే రూ.10 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో ఈక్విటీ షేర్ 10 షేర్లుగా విభజించబడింది. అంటే మార్చి 2కి ముందు ఈ షేరు ధర రూ.640. బోనస్ షేర్ అండ్ షేర్ స్ప్లిట్ నేపథ్యంలో ఈ షేర్ సరసమైన ధరలో లభిస్తుంది.
2024-25 రెండవ త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ. 16.72 కోట్లతో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన 24.6% క్షీణించి రూ. 12.61 కోట్లకు చేరుకుంది. ఈ గణనీయమైన క్షీణతకు ప్రధానంగా వ్యవసాయం అలాగే నిర్మాణ విభాగాల్లో డిమాండ్ తగ్గడం. తాజాగా, కంపెనీ రూ.20.6 కోట్ల నిధుల సమీకరణకి ఆమోదం పొందింది. ఒక్కో షేరు ధర రూ.16.5 చొప్పున ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన పెట్టుబడిదారులకు 1,25,00,000 షేర్లను జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications