Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్లను నడిపే అంశాలివే.. రిటైలర్స్ బి అలర్ట్..
Stock Market: భారతీయ ఈక్విటీలు అస్థిరమైన వారాన్ని పూర్తి చేసుకున్నాయి. దేశీయ ఈక్విటీల్లోకి స్థిరంగా విదేశీ పెట్టుబడులు ప్రవహించటం.. కంపెనీలు నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించటం మద్ధతుగా నిలిచాయి.
గతవారం బెంచ్ మార్క్ సూచీల కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మెరుగైన పనితీరును కనబరిచాయి. ఇదే సమయంలో జీడీపీ డేటా విడుదల కావటం కొంత బులిష్ సెంటిమెంట్లకు అనుకూలంగా నిలిచింది. అలాగే ఆటో విక్రయాలు సైతం క్రమంగా పుంజుకున్నాయి. అయితే కొత్త నెలలో పాటు కొత్త వారం మార్కెట్లను ప్రభావితం చేయనున్న కీలక విషయాలను ఇప్పుడు గమనిద్దాం..

జూన్ నెలలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యవిధాన సమావేశంపై ఇప్పుడు మార్కెట్ల చూపు ఉంది. రేట్ల తగ్గింపు ఉంటుందా లేక గతంలో మాదిరిగా ముందుకెళ్తారా అనే దానికోసం రిటైలర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు PMI, US పేరోల్ డేటా వంటి డేటా పాయింట్ల సమాచారం కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారని బ్రోకరేజ్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వెల్లడించారు.
జూన్ 4న OPEC+ సమావేశం జరుగుతున్నందున ఇంధన ధరలపై కూడా అనేక మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దేశంలో ద్రవ్యోల్బణానికి సంబంధించిన డేటాతో పాటు.. ఎల్‌నినో గురించి కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ భారత వాతావరణశాఖ సాధారణ రుతుపవనాలను సూచించటాన్ని రిజర్వు బ్యాంక్ ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంటుందోనని మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. వడ్డీ రేట్ల నిర్ణయంలో ఇది కూడా కీలకమైనదిగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications