Stock Market: గతవారం ప్రారంభంలో మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ చివరి రోజు మంచి లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. అయితే ఇప్పుడు రానున్న వారంలో మార్కెట్లు ఎలా ఉంటాయనే ఆందోళన రిటైల్ ఇన్వెస్టర్లలో నెలకొంది.
ప్రధానంగా యుఎస్ క్రెడిట్ రేటింగ్ డౌన్‌గ్రేడ్ వార్తలు, పెరుగుతున్న యూఎస్ బాండ్ ఈల్డ్‌లతో స్థిరమైన ఎఫ్‌ఐఐ అమ్మకాలు, చైనా & యూరోజోన్‌ల నిరాశాజనకమైన ఫ్యాక్టరీ డేటా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీయటంతో రెండవ వారంలో వరుసగా మార్కెట్లు పతనాన్ని చూశాయి. దీనికి తోడు చాలా మంది లాభాలను స్వీకరించేందుకు మెుగ్గుచూపారని తెలుస్తోంది. కానీ రానున్న వారంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం ప్రకటించనుంది. దీనిపై ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టారు. అమెరికా ఫెడ్ మాదిరిగా రేట్ల పెంపు ఉంటుందేమో వేచి చూడాలి.

మరోపక్క జూన్ త్రైమాసిక ఆదాయాల సీజన్ ముగింపులో ఉన్నాము. ఇదే క్రమంలో ఎల్ఐసీ, టాటా పవర్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, హిండాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, ONGC వంటి ప్రముఖ పేర్లతో సహా 1,800 కంటే ఎక్కువ కార్పొరేట్ సంస్థలు వచ్చే వారం తమ క్యూ-1 ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇవి మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. అలాగే ఆగస్టు 10న అమెరికా తన ద్రవ్యోల్బణం డేటాను విడుదల చేయనుంది. జూలైలో ప్రధాన ద్రవ్యోల్బణం 3 శాతం వద్ద ఎక్కువగా ఉండవచ్చని చాలా మంది ప్రపంచ నిపుణులు భావిస్తున్నారు.
మార్చి నుంచి కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆగస్టులో భారతీయ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా మారారు. ప్రధానంగా 10 ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరిగటం దీనికి కారణంగా ఉంది. ఇదే క్రమంలో వరుసగా ఆరో వారం కూడా చమురు ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. అలాగే వచ్చే వారం టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్, శ్రీవారి స్పైసెస్, SBFC ఫైనాన్స్, కాంకర్డ్ బయోటెక్ వంటి ఐపీవోలు మార్కెట్లలోకి రానున్నాయి. అలాగే కార్పొరేట్ యాక్షన్స్ కూడా మార్కెట్లను కొంత మేర ప్రభావితం చేసే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications