గత కొద్ది రోజుల నుంచి బెంగుళూరు నగరంలో చిన్న వ్యాపారులు కేంద్రానికి షాకిస్తూ డిజిటల్ పేమెంట్లు వ్యతిరేకిస్తున్న సంగతి విదితమే. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపుల్లో అగ్రగామిగా నిలిచిన సిలికాన్ సిటీ బెంగళూరు ఇప్పుడు కేవలం నగదు ఉంటేనే కొనుగోలు చేయాలని ఖరాఖండిగా చెప్పేస్తోంది. ఐటీ రాజధాని మార్కెట్లలో ఇప్పుడు ఎక్కడ చూసినా No UPI, Only Cash బోర్డులు కనిపిస్తున్నాయి. ఆదాయపు పన్ను శాఖ నుంచి భారీ భయం వారిని వెంటాడుతోంది. Goods and Services Tax (GST) నోటీసుల దెబ్బతో చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, రిజిస్ట్రేషన్ లేని మార్కెట్లు అన్నీ నగదు సహిత లావాదేవీలు జరుపుతున్నాయి.
దీంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. UPI స్వీకరణ ఆపాల్సిన అవసరం లేదని రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ వార్తపై పీటీఐతో సహా పలు జాతీయ మీడియాలు కథనాలు ప్రచురించాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారుల ప్రకటన ప్రకారం.. వ్యాపారులకు అందించే జీఎస్టీ నోటీసులు యూపీఐ మీదనే ఆధారపడి ఉండవని తెలిపారు.

పాయింట్-ఆఫ్-సేల్ మెషీన్లు, బ్యాంక్ బదిలీలు, నగదు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ వంటి లావాదేవీలను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అన్ని రకాల చెల్లింపులను చెక్ చేసిన తర్వాతే వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనిపై వీధి వ్యాపారులు బయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. వ్యాపారులు యూపీఐ చెల్లింపులు ఆపినా పరిమితికి మించి లావాదేవీలు జరిపిన వారు GST నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.
కాగా బెంగళూరులోని వీధి స్టాళ్లు, టీ షాపులు, ఫుడ్ కార్టులు, చిన్న కిరాణ దుకాణాలు వరకు క్యూ ఆర్ కోడ్ లేదు. మీరు డబ్బులు చెల్లించి వస్తువులను కొనుగోలు చేయండి అని బోర్డులు పెట్టుకున్నారు. గడిచిన వారంలో పలువురు వ్యాపారులకు GST చెల్లింపుల నోటీసులు రావడం బెంగుళూరు నగరంలో కలకలం రేపింది. డిజిటల్ లావాదేవీల రికార్డ్ ఆధారంగా రెవెన్యూ శాఖ వారి టర్నోవర్‌ను అంచనా వేసిందనే వార్తలు చిన్న వ్యాపారుల్లో ఆందోళన కలిగించాయి. దీంతో వ్యాపారులు భయంతో యూపీఐ లావాదేవీలను వదిలేసి నగదుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే ప్రధాని మోదీ సర్కారు దేశాన్ని డిజిటల్ వైపు తీసుకెళుతున్న ఈ సమయంలో ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది. కర్ణాటక కమర్షియల్ ట్యాక్స్ శాఖ ఇప్పటికే వెల్లడించిన వివరాల ప్రకారం..సరుకుల విక్రయాల్లో మొత్తం టర్నోవర్ రూ.40 లక్షలు దాటితే జీఎస్టీ తప్పనిసరిగా ఉండాలి. అలాగే సేవల (services) ద్వారా రూ.20 లక్షలు మించితే GST రిజిస్ట్రేషన్ తప్పనిసరి.ఇది పన్ను మాత్రం వర్తించే (taxable) సరుకులు లేదా సేవలపైనే లెక్కించబడుతుంది. కొంతమంది వ్యాపారులు మినహాయించిన వస్తువులు అమ్ముతున్నామన్న భావనతో జీఎస్టీ పరిధిలో రిజిస్టర్ కాలేకపోయారు; కానీ మొత్తం టర్నోవర్ గడువులు దాటితే రిజిస్ట్రేషన్ అవసరమేనని అధికారులు గుర్తుచేశారు.
ఇక పన్ను శాఖ అదనపు కమిషనర్ జూలై 17న విడుదల చేసిన ప్రకటనలో.. నోటీసులు కేవలం UPI డేటాపైనే ఆధారపడడం లేదని స్పష్టం చేశారు. వ్యాపారులు POS, బ్యాంకు ట్రాన్స్‌ఫర్లు, నగదు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా తీసుకున్న మొత్తం చెల్లింపుల్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. సరఫరాల కింద మీరు ఏ రూపంలోైనా పరిగణన (consideration) తీసుకున్నా వారికి GST నోటీసులు తప్పవన్నారు. కాబట్టి UPI ఆపితే పన్ను నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని.. అవసరమైతే శాఖ చట్టప్రకారం బాకీ పన్ను వసూలు చేస్తుందని చెబుతున్నారు.
ఇక బెంగళూరుకు చెందిన ఈ క్యాష్ ట్రెండ్ దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థి విశ్లేషకులు చెబుతున్నారు. డిజిటల్ చెల్లింపుల పెరుగుదల తర్వాత వచ్చిన నమ్మకం దెబ్బతింటే ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్ ప్రమాదంలో పడవచ్చని చెబుతున్నారు. స్పష్టమైన మార్గదర్శకాలు, అవగాహన శిబిరాలతో వారిలో విశ్వాసం నింపాలని సూచిస్తున్నారు.
More From GoodReturns

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications