Market Next Week: పావెల్ చేతిలో వచ్చేవారం మార్కెట్లు.. ఇన్వెస్టర్లు గుర్తించాల్సిన అంశాలివే..
Stock Market: శనివారం నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. గతవారం మార్కెట్లు భారీగా ఒడిదొడుకులకు లోనైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారంపై ఇప్పుడు ఇన్వెస్టర్ల ఆశలు ఉన్నాయి.
కొత్త నెల ప్రారంభంతో మార్కెట్లు సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకుతూ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. మెుదటి రోజున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ లాభదాయకంగా ముగిసింది. ఈ క్రమంలో యూఎస్ ఫెడరల్ రిజర్వు ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు నెలవారీ గ్లోబల్ సర్వీసెస్ పీఎంఐ డేటా, యూఎస్ ఎకానమీ డేటా, చైనా ద్రవ్యోల్బణం డేటా కోసం అంతర్జాతీయంగా మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మార్చి 6-7 తారీఖుల్లో వడ్డీ రేట్ల పాలసీకి సంబంధించిన కీలక ప్రకటన యూఎస్ సెంట్రల్ బ్యాంక్ నుంచి వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దీనికి తోడు దేశీయంగా ఎకనామిక్ డేటా, క్రూడ్ ఆయిల్ ధరలు, ఎఫ్ఐఐల ఫ్లో వంటి కీలకమైన అంశాలపై ఈ వారం దేశీయ మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. ఆప్షన్స్ చైన్ డేటా ఎనాలసిస్ ప్రకారం రానున్న వారంలో నిఫ్టీ సూచీ 22,800-23,000 మధ్య స్థాయిలో ట్రేడింగ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో ఇండియా విక్స్ సూచీ 15 పాయింట్ల వద్ద గతవారం ముగిసింది.
రానున్న వారంలో అనేక కార్పొరేట్ కంపెనీల ఈజీఎం సమావేశాలు ఉండనున్నాయి. అయితే వీటిలో ఎలాంటి కీలకమైన ప్రకటనలు ఉంటాయోనని రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అడపాదడపా కన్సాలిడేషన్‌కు అవకాశం ఉన్నప్పటికీ.. రాబోయే వారంలో బుల్స్ జోరు మార్కెట్లలో కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications