దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతాలు ఎవరికైనా తెలుసా.. వారికి జీత భత్యాలతో పాటుగా ఇంకా ఏమేమి సౌకర్యాలు లభిస్తాయి. భారత సాయుధ దళాల సర్వసైన్యాధిపతిగా ఉన్న రాష్ట్రపతి జీతం ఎంత ఉంటుంది. ప్రభుత్వ పదవుల్లో అత్యధిక వేతనం పొందే పదవి ఎవరది.. ప్రభుత్వ వాహనాలు, విమానాల సౌకర్యం అందుబాటులో ఏ మేరకు ఉంటాయి. అంతర్జాతీయ పర్యటనల సమయంలో వారి వసతి, ఇతర ఖర్చులను ఎవరు భరిస్తారు వంటి విషయాలను ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందామా..
రాష్ట్రపతి: భారత ప్రధమ పౌరుడు, సాయుధ దళాల సర్వ సైన్యాధిపతిగా ఉన్న రాష్ట్రపతిని పార్లమెంట్ రెండు సభల ప్రతినిధులు, రాష్ట్ర అసెంబ్లీల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటారు. రాష్టప్రతి భవన్‌లో రాష్ట్రపతి నివసిస్తారు. ఇక ప్రభుత్వ పదవుల్లో అత్యధిక వేతనం పొందే పదవి రాష్ట్రపతిదేనని చెప్పుకోవచ్చు. రాష్ట్రపతి వేతనం నెలకు రూ.5 లక్షలు (President's Emoluments and Pension Act of 1951 ప్రకారం) ఉంటుంది. పన్నుల నుండి మినహాయింపుతో పాటు, రాష్ట్రపతికి ఉచిత రైలు, విమాన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ఖర్చులతో ఉంటుంది. ఉచిత నివాసం, వైద్య సేవలు, కార్యాలయ ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.1 లక్ష అలవెన్సులు లభిస్తాయి.

ఉపరాష్ట్రపతి: దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిగా ఉపరాష్ట్రపతి ఉన్నారు. ఆయన ప్రధానంగా రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రపతి గైర్హాజరైనప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. భారత ఉపరాష్ట్రపతి వేతనం మరియు భత్యాలు Salaries and Allowances of Officers of Parliament Act 1953 ప్రకారం నిర్ణయించబడతాయి.ఉపరాష్ట్రపతి నెలకు రూ.4 లక్షల వేతనం పొందుతారు. ఇతర సౌకర్యాలు, భత్యాలలో ఉచిత నివాసం, వైద్య సేవలు, రైలు, విమాన ప్రయాణం, ల్యాండ్‌లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్ సేవ, వ్యక్తిగత భద్రత, సిబ్బంది సౌకర్యాలు ప్రభుత్వం తరపున ఉంటాయి.
ప్రధాన మంత్రి : భారత ప్రభుత్వానికి అధిపతిగా, కీలకమైన కార్యనిర్వాహక అధికారాలు, బాధ్యతలు కలిగి ఉంటాడు. భారత రాష్ట్రపతి ఆయనను నియమిస్తారు, అలాగే ఆయన ద్విసభ్య పార్లమెంట్‌లోని ఏదో ఒక సభకు సభ్యుడై ఉండాలి.నెలకు రూ.1.66 లక్షల వేతనంగా పొందుతారు. ఇందులో ప్రాథమిక వేతనం రూ.50,000, ఖర్చుల భత్యం రూ.3,000, పార్లమెంటరీ అలవెన్స్ రూ.45,000, అలాగే రోజువారీ భత్యం రూ.2,000గా ఉన్నాయి. అదనంగా అధికారిక నివాసం, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) భద్రత, ప్రభుత్వ వాహనాలు, విమానాల వినియోగం, అలాగే అంతర్జాతీయ పర్యటనల కోసం ప్రభుత్వ వ్యయంతో ప్రయాణం, వసతి, భోజన సౌకర్యాలు లభిస్తాయి.
ఎంపీలు: ఎంపీ తన నియోజకవర్గానికి సంబంధించి లోక్‌సభలో ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తాడు. లోక్‌సభ సభ్యులను ప్రజలు ప్రతి ఐదు సంవత్సరాలకు జరిగే సాధారణ ఎన్నికల ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. పాలనలో వారి బాధ్యతలు, సేవలకు గాను ఎంపీల వేతనాలు, భత్యాలు నిర్ణయించబడతాయి. ఎంపీలకు నెలకు రూ.1 లక్ష వేతనం లభిస్తుంది. ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు రోజువారీ భత్యాల రూపంలో పెరుగుతూ ఉంటుంది. వారి వేతనాలు, భత్యాలలో నెలకు రూ.50,000 ప్రాథమిక వేతనం, పార్లమెంట్ సమావేశాలు, కమిటీ మీటింగ్‌లకు హాజరవుతారు కాబట్టి రోజుకు రూ.2,000 భత్యం, రహదారి ప్రయాణానికి కిలోమీటరుకు రూ.16 ప్రయాణ భత్యం ఉన్నాయి. అదనంగా, ఎంపీలకు నెలకు రూ.45,000 నియోజకవర్గ భత్యం, అలాగే రూ.45,000 కార్యాలయ ఖర్చుల భత్యం లభిస్తుంది, ఇందులో రూ.15,000 స్టేషనరీ, పోస్టేజ్ కోసం కేటాయించబడుతుంది.
భారత ప్రధాన న్యాయమూర్తి: భారత ప్రధాన న్యాయమూర్తి నెలకు రూ.2,80,000 వేతనం పొందుతారు.రిటైర్‌మెంట్ అయిన తర్వాత మాజీ CJI వార్షిక పెన్షన్ రూ. 16,80,000 ఉంటుంది. దీనితో పాటు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తికి ఒకేసారి 20 లక్షల రూపాయలను గ్రాట్యుటీగా అందజేస్తారు. పదవీ విరమణ తర్వాత అతను, అతని కుటుంబం కూడా సెంట్రల్ సివిల్ సర్వీసెస్‌లోని క్లాస్ వన్ అధికారి, అతని కుటుంబంతో సమానంగా వైద్య సదుపాయాలను పొందుతారు.
సైన్యాధిపతులు (ఆర్మీ, ఎయిర్, నేవీ): వీరందరూ నెలకు రూ.2,50,000 వేతనం పొందుతారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications