PC Jewellers: వివాహాలు, శుభకార్యాలతో పాటు వచ్చే నెలలో దీపావళి దగ్గరపడుతున్న వేళ గోల్డ్ రేట్లు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం పసిడి ధరలు ఎవ్వరి ఊహలకు అందని స్థాయిలో పెరగటంతో ఈ రంగంలోని లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా లాభపడుతున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను తగ్గించడానికి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు చర్యలు సమీపిస్తున్న వేళ పసిడి ధరలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా గోల్డమన్ సాక్స్ సంస్థ నివేదికల ప్రకారం 2025 ప్రారంభానికి పసిడి ధరలు మరింత పెరుగుదలను నమోదు చేస్తుందని వెల్లడైంది. ఈరోజు 100 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఏకంగా రూ.13,000 పెరగటం సాధారణ కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ క్రమంలో ఆభరణాల తయారీ విక్రయంలో ఉన్న దేశీయ లిస్టెడ్ కంపెనీల షేర్లు మాత్రం భారీ పెరుగుదలను శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో చూశాయి.

అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న స్టాక్ పీసీ జ్యూవెలర్స్. ఈ కంపెనీ షేర్లు తమ ఇన్వెస్టర్లకు రెండు నెలల కాలంలోనే దాదాపు 3 రెట్లు రాబడులను అందించింది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కేవలం 2 నెలల కిందట కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని కొనసాగించి ఉంటే నేటి మార్కెట్ ధర ప్రకారం దాని విలువ రూ.3 లక్షలుగా మారి ఉండేది. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఎన్ఎస్ఈలో రూ.140.86 రేటు వద్ద ప్రయాణాన్ని ముగించాయి. కంపెనీ రుణాల సెటిల్మెంట్ ప్రక్రియ కొలిక్కి వచ్చిన తర్వాత పసిడి ధరల ర్యాలీ సైతం భారీ ర్యాలీకి దారితీసిందని నిపుణులు చెబుతున్నారు.
ఇదే క్రమంలో మిగిలిన లిస్టెడ్ కంపెనీల షేర్లు శుక్రవారం ఇంట్రాడేలో సైతం మంచి లాభాలను చూశాయి. వారాంతంలో త్రిభోవాందాస్ భీమ్‌జీ జవేరి (TBZ), కళ్యాణ్ జ్యువెలర్స్, సెంకో గోల్డ్, మోటిసన్స్ జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్స్, తంగమయిల్ జ్యువెలరీ షేర్లు 4 శాతం నుంచి 18.5 శాతం మేర పెరుగుదలను చూశాయి. ఈ ఏడాది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన తర్వాత ధరల పతనం కొనసాగటంతో భారతీయ కొనుగోలుదారులు ఉత్సాహంగా షాపింగ్ మెుదలుపెట్టారు.
అయితే ఈ క్రమంలో ధరలు మరింతగా తగ్గుతాయని ఆశించిన చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు ప్రస్తుతం విపరీతంగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి రానున్న వారంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల తగ్గింపుకు నాంది పలుకుతుందని ఇప్పటికే ఊహాగానాలు తారా స్థాయికి చేరాయి. దీంతో అనూహ్యంగా పసిడి కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు, గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు దిగటంతో బలమైన డిమాండ్ కారణంగా ధరలు తారా స్థాయిలను తాకుతున్నాయి.
ఇదే క్రమంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపును గురువారం ప్రకటించటం గోల్డ్ ధరల దూకుడుకు ఆజ్యం పోసింది. అక్కడి సెంట్రల్ బ్యాంక్ డ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బంగారం ధరలు దాదాపుగా 2 శాతం పెరిగాయి. జూన్ తర్వాత యూరో సెంట్రల్ బ్యాంక్ తన వడ్డీ రేటు తగ్గింపులను ప్రకటించటం ఇది రెండోసారి. బలహీనమైన లేబర్ మార్కెట్ గురించి ఆందోళనలను ఉటంకిస్తూ.. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల రేట్ల తగ్గింపుల గురించి ఆశాజనక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిణామాలతో సగటు భారతీయ పసిడి ప్రియులు ఆభరణాలు కొనుగోలు చేయలేని పరిస్థితులను చూస్తున్నారు. అయితే రానున్న కాలంలో పరిస్థితులు కుదుటపడిన తర్వాత తిరిగి గోల్డ్ రేట్లు అందుబాటులోకి వస్తాయని వారు అశిస్తూ వేచిచూసే ధోరణిని కొనసాగిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications