PM Modi: సెక్యులర్ సివిల్ కోడ్ నుంచి మోదీ ప్రసంగంలో టాప్ అంశాలివే..!

Modi Independenday Speech: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ క్రమంలో దేశ ప్రజలను ఉద్ధేశించి వివిధం అంశాలపై ప్రసగించారు. ఇందుకో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

1. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ థీమ్ 'వికసిత్ భారత్ 2047'గా ఉంది. ఈ సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సైతం దేశ వృద్ధికోసం పెద్దఎత్తున కృషి చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రజల నుంచి సహకారం కోరగా అత్యుత్సాహంతో ముందుకురావటంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని మోదీ చెప్పారు.

From one nation one elections to Medicla seats increasing know top points from modi speech

2. మారుతున్న సమాజంలో వివిధ రంగాల్లో సంస్కరణలు అవసరమని మోదీ చెప్పారు. ముఖ్యంగా విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, చట్టాలు, రాజకీయాలు, అంతరిక్ష పరిశోధనల్లో సంస్కరణలు గురించి ప్రధాని ప్రస్థావించారు.

3. ప్రధాని దేశంలోని మాతృభాష గురించి కీలక ప్రకటన చేశారు. యువతకు వివిధ రంగాల్లో తమ సొంత భాషను ఎక్కువగా ఉపయోగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కొత్త విద్యా విధానంలో ప్రభుత్వం మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందన్నారు.

4. ప్రస్తుతం దేశంలోని వైద్య విద్యార్థులు చదువుకోసం విదేశాలకు వెళ్లటంపై మోదీ స్పందించారు. ఇటీవల ఉక్రెయిన్, బంగ్రాదేశ్ వంటి వరుస ఘటనల తర్వాత మోదీ దీని గురించి మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎక్కువ మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యకోసం ఆరాట పడుతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 25,000 మంది యువకులు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాలి. సమస్య పరిష్కారానికి రానున్న ఐదేళ్లలో 75,000 కొత్త సీట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

5. నాణ్యమైన వస్తువులు, సౌకర్యాలకు భారతదేశం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందుతుంది. ఇందుకోసం డిజైనింగ్ ఇండియాపై దృష్టి పెట్టాలని ప్రధాని ఎర్రకోట వేదికగా ప్రసంగించారు. అందుకు భారత ప్రమాణాన్ని అంతర్జాతీయ ప్రమాణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం కావాలన్నారు. గేమింగ్ ప్రపంచం నేడు వేగంగా అభివృద్ధి చెందని, గేమింగ్ ప్రపంచానికి కొత్త ప్రతిభను తీసుకురాగలమన్నారు. దేశంలోని యువత IT, AI ప్రొఫెషనల్ గేమింగ్ ప్రపంచంలో తమకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

6. మరీ ముఖ్యంగా ప్రధాని నేటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై మాట్లాడారు. ఇప్పటికే సుప్రీంకోర్టు పదేపదే దీనిపై వ్యాఖ్యానించిందని అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సివిల్ చట్టం వాస్తవానికి మతపరమైన సివిల్ కోడ్. అయితే ఇప్పుడు దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరమని మోదీ పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో మతం ఆధారంగా వివక్షను అంతం చేయవచ్చని ప్రధాని అన్నారు.

7. ప్రధాని మోదీ నేడు తన ప్రసంగంలో ఎన్నికల ప్రక్రియ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' అనే అంశాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. భారతదేశ పురోగతి కోసం ఒకే దేశం ఒకే ఎన్నికలకు మద్దతు ఇవ్వాలన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల్లో తరచుగా జరిగుతున్న ఎన్నికలు దేశ ప్రగతికి అడ్డంకులు సృష్టిస్తున్నాయన్నారు.

8. మోడీ తన ప్రసంగంలో"రాజవంశం, కులతత్వం ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని, దీని నుంచి దేశాన్ని విముక్తి చేయడం మన బాధ్యతన్నారు. దీని కోసం లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ప్రతిష్టాత్మక మిషన్ ఉందన్నారు. కుటుంబంలో రాజకీయ నేపథ్యం లేని మోదీ కూడా ఈ సమయంలో స్వపక్షపాతం, కులతత్వం నుంచి స్వేచ్ఛ ఉంటుందన్నారు. యువత ఏ పార్టీలోనైనా చేరవచ్చన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+