Stock Market: ఈవారం మార్కెట్లను ప్రభావితం చేసేవివే.. ప్లీజ్ తెలుసుకుని ట్రేడ్ చేయండి..
Market Next Week: గడచిన వారం దేశీయ స్టాక్ మార్కెట్లను మధ్యంతర బడ్జెట్, ఫెడ్ నిర్ణయాలు వంటి కీలక పరిణామాల మధ్య కొనసాగాయి. ఈ క్రమంలో భారీ ఒడిదొడుకులు సైతం దేశీయంగా మార్కెట్లలో నమోదయ్యాయి. అయితే వచ్చేవారం పరిస్థితులపై అందరూ ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.
అసలు రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లను కొన్ని అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో ముందుగా కొనసాగుతున్న క్యూ3 ఆర్థిక ఫలితాలు చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి. అనేక కార్పొరేట్ సంస్థలు గత ఏడాది కంటే మెరుగైన, అద్భుతమైన ఫలితాలను నమోదు చేస్తుండటం చాలా మంది పెట్టుబడిదారుల్లో ఆసక్తిని పెంచుతోంది. డివిడెండ్ ఆదాయం, స్టాక్ మార్కెట్ గెయిన్స్ వంటి ప్రయోజనాలను అందుకునేందుకు వారు వేచిచూస్తున్నారు.

అలాగే రాబోతున్న రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ సమావేశాలపై కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వడ్డీ రేట్ల విషయంలో సడలింపులు వస్తాయా లేక యథాతథ స్థితి కొనసాగుతుందా అనే ఆందోళనలు ఉన్నాయి. చాలా మంది అంచనా ప్రకారం భారతీయ సెంట్రల్ బ్యాంక్ సైతం అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ పద్ధతిలో కొనసాగుతుందేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో విదేశీ మదుపరుల ప్రవాహాలను మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
వాస్తవానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం రోజున మార్కెట్లు సప్పగా సాగాయి. దీంతో లాభాలు సాయంత్రానికి ఆవిరై స్వల్ప నష్టాలను నమోదు చేయటం చాలా మందిని నిరాశకు గురిచేసింది. అయితే బడ్జెట్ తర్వాతి రోజున మార్కెట్లు తమ ర్యాలీనికి కొనసాగించాయి. త్వరలోనే దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మార్కెట్లు ర్యాలీని కొనసాగిస్తాయని చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక లోటును తగ్గించుకోవటం ఇప్పటికే మార్కెట్లలో జోష్ నింపి శుక్రవారం ర్యాలీకి దోహదపడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications