For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST Rate Hike: సామాన్యులకు జీఎస్టీ కష్టాలు.. సోమవారం నుంచి పన్ను పెరిగే వస్తుసేవలు ఇవే..

|

New GST Rates: GST కౌన్సిల్ నిర్ణయం అమల్లోకి రావటంతో సోమవారం అంటే జూలై 18 నుంచి గృహోపకరణాలు, బ్యాంకు సేవలు, ఆసుపత్రులు, హోటళ్ల సేవల కోసం కస్టమర్‌లు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్యాక్ చేసిన, లేబుల్ చేయబడిన ఆహార పదార్థాలు, ఆసుపత్రి గదులతో సహా అనేక నిత్యావసర వస్తువులు, సేవల ధరలు పెరగనున్నాయి.

గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 47వ జీఎస్‌టీ సమావేశంలో.. ఆమె రాష్ట్ర అధికారులతో చర్చింది దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మినహాయింపు జాబితాలోని వస్తువులు, సేవల సంఖ్యను తగ్గించారు.

List of items to get costlier from monday as GST rate hiked by central government

సోమవారం నుంచి ఖరీదుగా మారుతున్నవి ఇవే:
* రూ.5,000 కంటే ఎక్కువ అద్దెతో ఉన్న ఆసుపత్రి గదులతో పాటు, ముందుగా ప్యాక్ చేసిన, లేబుల్ చేయబడిన గోధమ పిండి, పనీర్, పెరుగు వంటి ఆహార పదార్థాలపై కస్టమర్లు 5 శాతం GST చెల్లించాలి.
* రోజుకు రూ.1,000 వరకు అద్దె ఉన్న హోటల్ గదులు, మ్యాప్‌లు, చార్టులు, అట్లాస్‌లపై 12 శాతం GST వర్తిస్తుంది.
* టెట్రా ప్యాక్‌లు, చెక్కుల జారీకి బ్యాంకులు వసూలు చేసే రుసుములపై ​​మొత్తం 18 శాతం GST విధించబడుతుంది.
* ప్రింటింగ్, రైటింగ్ లేదా డ్రాయింగ్ ఇంక్ వంటి ఉత్పత్తులు, కటింగ్ బ్లేడ్లు, పేపర్ కత్తిరించే కత్తులు, పెన్సిల్ షార్పనర్లతో, LED బల్బులు, డ్రాయింగ్ అండ్ మార్కింగ్ సాధనాలపై జీఎస్టీ రేటు 12 నుంచి 18 శాతానికి పెరుగుతుంది.
* సోలార్ వాటర్ హీటర్లపై జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెరుగింది.
* రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు , శ్మశానవాటికలకు సంబంధించిన వర్క్ కాంట్రాక్ట్‌లు వంటి కొన్ని సేవలపై జీఎస్టీ పన్ను రేటు 12 శాతం నుంచి 18 శాతానికి పెరుగుతుంది.
* RBI, IRDA, SEBI వంటి రెగ్యులేటర్లు అందించే సేవలపై 18 శాతం జీఎస్టీ విధించబడుతుంది. * వ్యాపార సంస్థలకు నివాస గృహాన్ని అద్దెకు ఇవ్వటంపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
* బయో-మెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ సదుపాయాలు 12 శాతం GSTని ఆకర్షిస్తాయి.
* రోజుకు రూ.5,000 మించిన నాన్-ICU హాస్పిటల్ రూమ్‌లకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లేకుండా 5 శాతం GST విధించబడుతుంది.

సోమవారం నుంచి చౌకగా మారుతున్న వస్తువులు, సేవలు ఇవే:
* ఆస్టోమీ ఉపకరణాలపై, రోప్‌వేల ద్వారా వస్తువులు, ప్రయాణీకుల రవాణాపై పన్నులు జూలై 18 నుంచి.. 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించబడుతోంది.
* ట్రక్కు, గూడ్స్ క్యారేజీని అద్దెకు తీసుకుంటే ఇంధనం ధర కలిపితే ఇప్పుడు 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది.
* ఈశాన్య రాష్ట్రాలు, బాగ్డోగ్రా నుంచి విమానంలో ప్రయాణీకుల రవాణాపై GST మినహాయింపు ఎకానమీ తరగతికి మాత్రమే పరిమితం చేయబడుతుంది.
* ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడినా లేదా అమర్చకపోయినా, జూలై 18 నుంచి 5 శాతం రాయితీ GST రేటుకు అర్హులు.

Read more about: జీఎస్టీ gst
English summary

GST Rate Hike: సామాన్యులకు జీఎస్టీ కష్టాలు.. సోమవారం నుంచి పన్ను పెరిగే వస్తుసేవలు ఇవే.. | from july 18th monday these household items and services becoming costly with new gst rates imposed by central government

List of items to get costlier from monday as GST rate hiked by central government
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X