July Changes: జూలై 1 నుంచి పెరగనున్న కీలక మార్పులు..!

జూన్ నెల ముగియనుంది. బుధవారం నుంచి జూలై నెలలోకి అడుగు పెట్టనున్నాము. జూలై 1 తేదీ నుంచి కొన్ని కీలక మార్పులు రానున్నాయి. ఈ ఆర్థిక మార్పులు సామాన్యుడి జేబు చిల్లులు పడేలా చేయనుంది. ముఖ్యంగా జూలై 1 నుంచి పాస్ పోర్ట్ ఫీజులు పెరగనున్నాయి. ఆధార్ అప్డేట్, కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డుల నిబంధనలు మారనున్నాయి.

Passport Fee: జూలై 1 నుంచి పాస్ పోర్ట్ ఫీజులు పెరగనున్నాయి. 36 పేజీల సాధారణ పాస్ పోర్ట్ ఫీజును రూ. 1500 నుంచి ఏకంగా రూ.2500 లకు పెంచారు. అలాగే తత్కాల్ సేవ ద్వారా పాస్ పోర్ట్ ఫీజు కూడా పెంచారు. దీన్ని రూ. 3,500 నుంచి రూ.5 వేలకు పెంచారు. ఇక 60 పేజీల పాస్ పోర్ట్ ఫీజు రూ. 3,500 నుంచి రూ.6 వేలకు పెంచారు. పాస్ పోర్ట్ పోయిన లేక పాడైపోయిన కొత్త పాస్ పోర్ట్ కోసం గతంలో రూ.1750 చెల్లించే వారు. ఇప్పుడు దీన్ని రూ.4,250కి పెంచారు.

passport

SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు సంబంధించి నిబంధనలు జూలై 1 నుంచి మారనున్నాయి. ఎంపిక చేసిన ఫోన్ పే SBI క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ ప్రొగ్రామ్ లో మార్పులు చేశారు. ఇక నుంచి రివార్డ్ పాయింట్లపై పరిమితులు విధించింది.

Aadhaar Free Update: ఆధార్ లో మెయిల్ అప్డేట్ చేసుకోవాలంటే రూ.75 చెల్లించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ జూలై 1 నుంచి 6 నెలల పాటు రుసుమును మాఫీ చేసింది.

RBI New Rule: బ్యాంకుల ద్వారా ఆర్థిక ఉత్పత్తుల తప్పుదోవ పట్టించే విక్రయాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక్కడ తప్పుదోవ పట్టించే ఉత్పత్తులు కొనుగోలు చేసిన వినియోగదారులు పూర్తి రీఫండ్, నష్టపరిహారం పొందేందుకు అర్హులని పేర్కొంది. ఈ నిబంధనలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. జూలై 1 నుంచి కమర్షియల్ సిలిండర్ల ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వీటితో పాటు ఒకటో తేదీన గ్యాస్ రేట్లు కూడా మారుతుంటాయి. ఇంకా పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా మారే అవకాశం ఉంటుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+