2021 క్యాలెండర్ ఏడాది మరో వారం రోజుల్లో ముగిసిపోయి, 2022 ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం. దాదాపు ప్రతి నెల బ్యాంకు నుండి వివిధ అంశాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి మన పర్సనల్ ఫైనాన్స్ పైన ప్రభావం చూపుతాయి. అయితే డిసెంబర్ 31, 2021 వరకు మీరు పూర్తి చేసే టాస్క్‌లు కూడా కొన్ని ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇందులో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్, జీవన్ ప్రమాన్ సర్టిఫికెట్, డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్స్ కేవైసీ డెడ్ లైన్, నార్త్ ఈస్ట్ రీజీయన్‌లో ఆధార్-యూఏఎన్ లింకింగ్ తేదీ ముగియనుంది.

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువును పలుమార్లు పొడిగించారు. కరోనా, ఐటీఆర్ వెబ్ సైట్‌లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో చివరిసారి గడువును ఈ డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారు. ఐటీ రిటర్న్స్ దాఖలుకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది.
2021-22 అసెస్‌మెంట్ ఇయర్ ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కోసం జూలై 31, 2021 వరకు గడువు ఉండగా, దీనిని మొదటిసారి సెప్టెంబర్ 30, ఆ తర్వాత డిసెంబర్ 31వ తేదీకి పొడిగించినట్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పొడిగించినందున మరోసారి పొడిగించే అవకాశం లేదు. కాబట్టి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేనివారు వెంటనే ఫైల్ చేయడం మంచిది.

జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు తమ యాన్యువల్ లైఫ్ సర్టిఫికెట్ జీవన్ ప్రమాణ్ పత్రను సమర్పించేందుకు చివరి తేదీ డిసెంబర్ 31. పెన్షన్ తీసుకోవడానికి రిటైర్డ్ ఉద్యోగులకు ఇది తప్పనిసరి. మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) మెంబర్ అయితే మీకు కాస్త సమయం ఉంది.

డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కేవైసీ డెడ్‌లైన్‌ను డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. సెబీ ఏప్రిల్ 2021లో ఇష్యూ చేసిన సర్క్యులర్ ప్రకారం ఆరు ముఖ్యమైన కేవైసీ ఆట్రిబ్యూట్స్ అవసరం. డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ హోల్డర్ కేవైసీ ఆట్రిబ్యూట్స్ అప్ డేట్ కోసం... పేరు, అడ్రస్, పాన్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, ఇన్‌కం రేంజ్.

ఆధార్ - యూఏఎన్ లింక్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో లేబర్ మినిస్ట్రీ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలకు ఆధార్-యూఏఎన్ లింకింగ్ తేదీని నాలుగు నెలలు పొడిగించింది. ఇది డిసెంబర్ 31, 2021తో ముగుస్తోంది. ఈపీఎఫ్‌తో ఆధార్ లింకింగ్ వల్ల మీ క్లెయిమ్ సెటిల్మెంట్ త్వరగా అవడానికి ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications