Stock Market News: గడిచిన 3 రోజుల సెలవుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ రేపు అంటే ఏప్రిల్ 1న తిరిగి ప్రారంభం కానుంది. అయితే ఐదే రోజు కొత్త ఆర్థిక సంవత్సరం(financial year) మొదలు కానుంది. దింతో అందరి కళ్ళు స్టాక్ మార్కెట్ పైనే పెట్టారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ మూసివేసి ఉన్న ఈ 3 రోజుల్లో చాలా కంపెనీలకు సంబంధించి పెద్ద వార్తలు వచ్చాయి. ఈ కంపెనీల లిస్టులో టాటా మోటార్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, వారీ ఎనర్జీ(Waaree Energies Ltd), సుజ్లాన్ ఎనర్జీ మొదలైనవి ఉన్నాయి. ఈ కంపెనీలకు సంబంధించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా చూస్తే...

1- ఇరేడా (IREDA Share Price)
ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (IREDA) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టోక్యో శాఖతో JPY 26 బిలియన్లకు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం మార్చి 27న బ్యాంకు అండ్ కంపెనీ మధ్య జరిగింది. కంపెనీ అందుకున్న ఈ ఆర్థిక సహాయం దేశంలోని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఉపయోగించనుంది.
2- హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL Share Price)
కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఆర్డర్ శుక్రవారం అందింది. గత శుక్రవారం రోజున భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ 156 లైట్ కంబాట్ హెలికాప్టర్ల (LCH) కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ సుమేరు రూ.62,700 కోట్లు అని సమాచారం.
3- వేదాంత లిమిటెడ్ (Vedanta Limited Share Price)
అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని కంపెనీ మార్చి 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు డీమెర్జర్ ప్లాన్‌ను పొడిగించింది. కంపెనీ ఈ సమాచారాన్ని మార్చి 28న తెలిపింది.
4- వరుణ్ బెవరేజెస్(Varun Beverages)
పెప్సి బాట్లింగ్ కంపెనీ ఘనా బాట్లింగ్ కంపెనీ లిమిటెడ్ అండ్ టాంజానియా బాట్లింగ్ కంపెనీ SAలో వాటా కొనుగోలుకి ఒప్పంద ప్రక్రియ స్టార్ట్ చేసాయి. ఈ ప్రక్రియ రెండు కంపెనీలలో 100 శాతం వాటా కొనుగోలు చేయడం గురించి ఉంది.
5- వారీ ఎనర్జీస్ లిమిటెడ్(Waaree Energies Limited)
ఈ కంపెనీ గుజరాత్‌లో దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ ఉత్పత్తి చేసే గిగాఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇలాంటి సమయంలో కంపెనీ షేర్ల పర్ఫార్మెన్స్ చూడాల్సి ఉంటుంది.
6- సుజ్లాన్ ఎనర్జీ షేర్(Suzlon Energy )
28 జనవరి 2025 నాటికి కంపెనీకి 5523 మెగావాట్ల పని ఉండగా ఇప్పుడు అది 5622 మెగావాట్లకు పెరిగింది. అంటే కంపెనీకి కొత్త ఆర్డర్ వచ్చింది. ఇలాంటప్పుడు కంపెనీ షేర్ల పర్ఫార్మెన్స్ మంగళవారం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications