భారతదేశంలో టెలికాం రంగాన్ని షేక్ చేసిన రిలయన్స్ జియో ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా తన పాదం మోపేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శుక్రవారం జరిగిన వార్షిక వార్షిక జెనరల్ మీటింగ్ (AGM)లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఇక జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ కంపెనీ కస్టమర్ బేస్ ఇప్పటికే 500 మిలియన్లకు పైగా చేరిందని చెప్పారు. "అమెరికా, యుకె, ఫ్రాన్స్ జనాభా కలిపినా ఇంత మంది ఉండరు. ఇది జియో ఎంత వేగంగా ఎదిగిందో చూపించే సమయం," అని అన్నారు.
జియో గ్లోబల్ ప్లాన్స్‌పై ఆయన మరింత స్పష్టత ఇస్తూ "ఇకపై జియో ప్రయాణం భారత్‌కే పరిమితం కాదు. మేము తయారు చేసిన ఇన్నోవేటివ్ టెక్నాలజీలు ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, క్లియర్ రోడ్‌మ్యాప్‌తో జియో సేవలను ప్రపంచానికి తీసుకెళ్లబోతున్నాం. ఇది కేవలం కస్టమర్లకే కాదు, భాగస్వాములు మరియు షేర్ హోల్డర్లకూ భారీ విలువను సృష్టిస్తుంది," అన్నారు.
ఇక ఫైనాన్షియల్ పరంగా చూస్తే, 2025 ఆర్థిక సంవత్సరంలో జియో భారీగా పెర్ఫార్మ్ చేసింది. కంపెనీ ఆదాయం రూ. 1.28 లక్షల కోట్లు, EBITDA (వడ్డీ, పన్ను, డిప్రెషియేషన్, అమార్టైజేషన్‌కు ముందు లాభం) రూ. 64,170 కోట్లుగా నమోదైంది.
జియో ఇప్పటివరకు భారత్‌లోనే పెద్ద ఎత్తున పనిచేసింది. ఇప్పుడు "Made in India" టెక్నాలజీని ఇతర దేశాల ప్రజలు కూడా వాడబోతున్నారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, అక్కడి ప్రజలకు చౌకగా, క్వాలిటీ సర్వీసులు ఇవ్వడం ద్వారా జియోకి బలమైన మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. ఇది కేవలం టెలికాం వరకే పరిమితం కాదు జియో 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ సర్వీసులు, క్లౌడ్ టెక్నాలజీ, OTT, ఫిన్‌టెక్ వంటి రంగాల్లో కూడా గ్లోబల్ స్థాయిలో విస్తరించాలని చూస్తోంది. అంటే జియో ఒక గ్లోబల్ టెక్ కంపెనీగా రూపుదిద్దుకుంటోంది.
ఇప్పటివరకు అమెరికా, చైనా, యూరప్ టెక్నాలజీ కంపెనీలే ప్రపంచాన్ని ఆధిపత్యం చలాయించాయి. ఇప్పుడు ఆ లిస్టులో భారత్ కూడా చేరబోతోంది. దీని వల్ల మన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట పెరుగుతుంది. "ఇండియా టెక్" అంటే ఒక విశ్వసనీయ బ్రాండ్‌గా మారే అవకాశం ఉంది. అంతేకాదు, ఇతర దేశాల ఇన్వెస్టర్లు, భాగస్వాములు కూడా జియోతో పని చేయడానికి ఆసక్తి చూపుతారు. దీని ఫలితంగా మన దేశానికి మరింత ఇన్వెస్ట్మెంట్లు, కొత్త అవకాశాలు వస్తాయి.
ఇక కస్టమర్ల పరంగా చూస్తే, ఈ గ్లోబల్ ఎక్స్‌పాన్షన్ వల్ల కొత్త డిజిటల్ సర్వీసులు మనకు త్వరగా అందుబాటులోకి వస్తాయి. విదేశాలకు వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు రోమింగ్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కానీ జియో ఆపరేషన్స్ ఇతర దేశాల్లో కూడా మొదలైతే, రోమింగ్ చార్జీలు తగ్గే అవకాశం ఉంది. అలాగే గ్లోబల్ మార్కెట్లో టెస్టు చేసే కొత్త టెక్నాలజీలు, ఆఫర్లు మనకు కూడా త్వరగా అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకి 5G, క్లౌడ్ సర్వీసులు వంటివి.
అంటే జియో ఇక టెలికాం ఆపరేటర్‌గా మాత్రమే కాకుండా, గ్లోబల్ టెక్ ప్లేయర్‌గా కూడా తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications