అభిషేక్ కుమార్ ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ మరియు ఐఐఎమ్ విద్యార్థి గోల్డ్‌మాన్ సాక్స్‌లో ఉన్నత ఉద్యోగం. ఈ నేపథ్యంలో ఉన్న వ్యక్తి జీవితాన్ని శుభ్రమైన కేబిన్లు, కార్పొరేట్ సమావేశాలు, లక్షల్లో జీతం గుర్తుకు వస్తాయి. కానీ అభిషేక్ కుమార్ మాత్రం ఈ "ప్రశాంతమైన" మార్గాన్ని వదిలేసి అందరూ ఆశ్చర్యపోయే నిర్ణయాన్ని తీసుకున్నారు.

అతను ఒక రోజున తన ఉద్యోగాన్ని వదిలేసి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో వాచ్‌మ్యాన్‌గా పని చేయాలనుకున్నాడు. ఏదీ సీన్ కోసం కాదు. నిజంగానే 14 గంటల షిఫ్ట్‌లు, అపార్ట్‌మెంట్ గేటులో నిలబడి వాహనాల్ని ఆపుతూ, రిజిస్టర్‌లో నోట్లు రాస్తూ పనిచేశాడు.
అలా ఎందుకు?
అభిషేక్‌కి వాచ్‌మెన్‌ల బాధల మీద సహజమైన ఆసక్తి కలిగింది. వారికీ ఎలాంటి సౌకర్యాలు లేవు, వారి పని పూర్తిగా మానవ జ్ఞాపకశక్తిపై ఆధారపడి ఉంటుంది. సందేహాస్పద వ్యక్తులను గుర్తించడం, డెలివరీల్ని నిర్ధారించడం, అతిథుల వివరాల రిజిస్టర్ నింపడం - ఇవన్నీ రోజూ వాళ్లకున్న కష్టాలు. ఈ అనుభవాల తర్వాత ఆయనకు ఓ ఆలోచన వచ్చింది టెక్నాలజీతో వీరి పనిని సులభతరం చేయలేమా?
అలా ప్రారంభమైంది MyGate అనే యాప్ ప్రయాణం. ఇది గేటెడ్ కమ్యూనిటీలకు ఒక స్మార్ట్ సెక్యూరిటీ మరియు కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్. డెలివరీలు, అతిథులు, డాక్యుమెంట్లు అన్నింటినీ యాప్ ద్వారా నియంత్రించగలిగే విధంగా అభిషేక్ తన జట్టు సహాయంతో ఈ టెక్ సొల్యూషన్‌ను రూపొందించాడు.
MyGate ఇప్పుడు దేశవ్యాప్తంగా 25,000+ అపార్ట్‌మెంట్లు, లక్షలాది వినియోగదారుల భద్రతా భాగస్వామిగా మారింది. ఈ యాప్ మానవ శ్రమను తగ్గించడమే కాక, సమర్థతను పెంచింది. ఈ యాప్ ద్వారా డిజిటల్ చెక్-ఇన్, రికార్డింగ్, డెలివరీ మేనేజ్‌మెంట్ వంటి అనేక ఉపయోగకరమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది కేవలం నివాసితులకే కాకుండా, సెక్యూరిటీ గార్డ్స్ జీవితాలను కూడా చాలా సులభతరం చేసింది. ముందు లాగా మాన్యువల్ రిజిస్టర్ నింపాల్సిన అవసరం లేకుండా, అన్ని వివరాలు యాప్ ద్వారా సులభంగా నిర్వహించవచ్చు. దీంతో పని భారము తగ్గి, పారదర్శకత పెరిగింది. MyGate యాప్ ద్వారా కమ్యూనిటీలలో సురక్షితమైన, సమర్థమైన, ఆధునిక నివాస అనుభవం అందుబాటులోకి వచ్చింది.
ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది?
ఇటీవల బిలియనీర్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో అభిషేక్ కుమార్ గురించి ఓ పోస్ట్ పెట్టారు. అందులో అభిషేక్ వాచ్‌మ్యాన్‌గా పని చేసిన వీడియో క్లిప్ షేర్ చేస్తూ "ఇలాంటి నిజమైన ఇన్నోవేటర్లు మాత్రమే భారత భవిష్యత్‌కి మార్గనిర్దేశకులు" అని ప్రశంసించారు. ఇతరులు చూడని సమస్యను పరిశీలించి, దానికి టెక్నాలజీ ఆధారిత పరిష్కారం చూపించడం ద్వారా MyGate రూపొందింది. ఇదే అభిషేక్ విజయ రహస్యం.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో, అనేక మంది అభిషేక్‌ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఐఐటీ చదివి, భారీ జీతం వదిలేసి, వాచ్‌మ్యాన్‌గా మారటం అనేది వినడానికి వెరైనా... కానీ ఆ వెరితనం వెనుక ఉన్న ఆలోచన గొప్పదిగా మారింది.
ఈ ప్రయాణం మనకు చెబుతోంది ఏంటంటే ఓ మంచి ఉద్యోగం మాత్రమే విజయానికి మార్గం కాదు. ఒక సమస్యను హృదయంతో అర్థం చేసుకుని, పరిష్కారం కనుగొనాలన్న తపన ఉంటే ప్రపంచమే మారుతుంది.


Click it and Unblock the Notifications