IPO News: ఈనెల రెండవ అర్థ భాగంలో మార్కెట్లోకి ఐపీవోలు వరుసగా క్యూ కట్టాయి. దీంతో ఇన్వెస్టర్లలో సైతం కోలాహలం నెలకొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు ఐపీవోలు ఈ వారం మార్కెట్లలోకి వస్తున్నాయి.
మెుత్తం ఏడు ఐపీవోలలో మూడు మెయిన్ బోర్డ్ ఐపీవోలు ఉండగా.. మరో నాలుగు ఎస్ఎమ్ఈ క్యాటగిరీకి చెందిన కంపెనీలు ఉన్నాయి. 7 ఐపీవోలు మెుత్తంగా మార్కెట్ల నుంచి రూ.1,600 కోట్లను సమీకరిస్తున్నాయి. ఇందులో ముందుగా డ్రోన్ తయారీ కంపెనీ ఐడియా ఫోర్జ్ మార్కెట్ల నుంచి రూ.567 కోట్లను సమీకరిస్తోంది. ఇందుకోసం ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.638-672గా నిర్ణయించింది. ఈ ఐపీవో నేటి నుంచి సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతోంది.

ఇక ఐటీ సేవల సంస్థ Cyient DLM ఐపీవో రేపు రిటైల్ ఇన్వెస్టర్లకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి రానుంది. కంపెనీ ఈ ఐపీవో ద్వారా రూ.592 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం షేర్ల ఇష్యూ ధరను రూ.250-265గా నిర్ణయించింది. ఇదే క్రమంలో PKH వెంచర్స్ ఐపీవో జూన్ 30న ప్రారంభం అవుతోంది. కంపెనీ దీని ప్రైస్ బ్యాంక్ ఇంకా ప్రకటించలేదు. అయితే కంపెనీ మాత్రం రూ.380 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. షేర్ల లిస్టింగ్ జూలై 12న జరుగనుంది.
ఇదే క్రమంలో SME క్యాటగిరీ నుంచి మార్కెట్లోకి వస్తున్న నాలుగు ఐపీవోల వివరాలను పరిశీలిస్తే.. ముందుగా కన్వేయర్ బెల్ట్ తయారీ సంస్థ పెంటగాన్ రబ్బర్ అడుగుపెడుతోంది. ఇది 100 శాతం తాజా ఇష్యూ ద్వారా రూ.16.17 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ప్లాస్టిక్ బాటిల్ తయారీ మెషిన్స్ ఉత్పత్తిదారు గ్లోబల్ పెట్ ఇండస్ట్రీస్ సైతం ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లోకి వస్తోంది. జూన్ 29న తెరవబడే ఈ ఐపీవో మార్కెట్ల నుంచి రూ.13.23 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం షేర్ ధరను రూ.49గా నిర్ణయించింది.
సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రొవైడర్ Tridhya Tech దేశీయ మార్కెట్ల నుంచి 26.41 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. దీనికోసం షేర్ ధర రూ.35-42గా నిర్ణయించింది. ఈ మెుత్తాన్ని రుణాల చెల్లింపులకు, కార్పొరేట్ చెల్లింపు అవసరాలకు వినియోగించాలని కంపెనీ నిర్ణయించింది. ఇక చివరగా మార్కెట్లోకి అడుగుపెడుతున్న Synoptics Technologies కంపెనీ ఐటీ సేవల రంగంలో తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. రూ.54.03 కోట్లను సమీకరిస్తున్న ఈ కంపెనీ తన షేర్ ఇష్యూ ధరను రూ.237గా నిర్ణయించింది.
More From GoodReturns

పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. Jio IPO రెడీ అవుతోంది.. 250 మిలియన్లకు పైగా షేర్లు మార్కెట్లోకి..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications