2024 అక్టోబర్ 9న, భారత వ్యాపార ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, లెజెండరీ పారిశ్రామికవేత్త రతన్ టాటా (డిసెంబర్ 28, 1937 - అక్టోబర్ 9, 2024) మరణంతో ప్రతి భారతీయుడి హృదయంలో ఒక శూన్యం ఏర్పడింది. ఆయన కేవలం ఒక వ్యాపార నాయకుడు కాదు. భారతదేశం నమ్మకాన్ని నిర్మించిన వ్యక్తి.చిన్ననాటి నుండి కృషితో ఎదిగిన మహనీయుడు. రతన్ టాటా ముంబైలోని ప్రసిద్ధ పారిశ్రామిక కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఆయన తన అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద పెరిగారు.
కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదివి, తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందారు. 1962లో ఆయన టాటా స్టీల్ లో జంషెడ్‌పూర్ ప్లాంట్‌లో తన కెరీర్ ప్రారంభించారు. అక్కడ ఆయన సాధారణ కార్మికులతో కలిసి పని చేశారు, రాత్రి పూట కూడా తానె స్వయంగా షిఫ్ట్‌లు చేశారు. అప్పటినుండే ఆయనలో ఉద్యోగుల పట్ల సానుభూతి, మానవతా దృష్టి పెరిగింది.

1991లో, J.R.D. టాటా ఆయనను టాటా సన్స్ ఛైర్మన్‌గా నియమించినప్పుడు చాలామంది సందేహపడ్డారు. కానీ రతన్ టాటా తన ప్రతిభతో, నిబద్ధతతో, దూరదృష్టితో అందరినీ ఆశ్చర్యపరిచారు.
అతను 80కి పైగా కంపెనీలను ఒకే దారిలో నడిపేలా గ్రూప్‌కి కొత్త నిర్మాణం ఇచ్చారు. బ్రాండ్ ఐడెంటిటీ, కార్పొరేట్ నైతికత, పారదర్శకతను ప్రధాన సూత్రాలుగా నిలబెట్టారు. ఆయన చెప్పిన మాట ఎప్పటికీ గుర్తు ఉండే ఉంటుంది. నాయకత్వం అంటే వారసత్వంగా రాదు, దానికోసం అర్హతను సంపాదించాలి.
రతన్ టాటా నేతృత్వంలో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 2000లో టాటా టీ బ్రిటిష్ బ్రాండ్ టెట్లీని కొనుగోలు చేసింది. 2007లో కోరస్ స్టీల్ ను 12 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మొదట కొందరు ఈ నిర్ణయాలను సాహసోపేతమని అనుకున్నారు, కానీ తరువాత టాటా గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడంలో ఇవే ప్రధాన మలుపులుగా నిలిచాయి.
టాటా నానో ఆయన కల. భారతదేశంలో సాధారణ కుటుంబం సురక్షితంగా, తక్కువ ధరలో కారును కొనుగోలు చేయగలగాలని ఆయన కలలు కనేవారు. వాణిజ్య పరంగా ఇది పెద్ద విజయాన్ని సాధించకపోయినా, అది ఆయన మానవతా దృక్పథాన్ని ప్రతిబింబించింది. 2008లో ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో ఆయన చూపిన నాయకత్వం చరిత్రలో నిలిచింది. బాధిత ఉద్యోగుల కుటుంబాలను Ratan Tata స్వయంగా కలుసుకున్నారు, వారి పిల్లల విద్యను భరించారు.
టాటా ట్రస్ట్స్ ద్వారా రతన్ టాటా.. విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, శాస్త్రీయ పరిశోధనల్లో బిలియన్ల రూపాయలు ఖర్చు చేశారు. అతను వ్యక్తిగతంగా కూడా పేటీఎం, ఓలా, లెన్స్‌కార్ట్, స్నాప్‌డీల్, వంటి 40కి పైగా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టి యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకుడిగా నిలిచారు. రతన్ టాటా జీవితం ఒక పాఠం. వ్యాపారం కేవలం లాభాల కోసం కాదు, మానవతా విలువలతో కూడిన ప్రయాణం అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. ఆయన చెప్పిన చివరి మాటలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తాయి. ఇనుము తన తుప్పుతోనే నాశనం అవుతుంది. మనిషిని కూడా అతని స్వభావమే నిర్మిస్తుంది లేదా నాశనం చేస్తుంది.ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నమ్మకానికి, నీతికి, దయకు చిహ్నమైన వారసత్వం ఎప్పటికీ భారతదేశాన్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications