Market Next Week: గడచిన రెండు వారాలు దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత ఒడిదొడుకులకు లోనైనప్పటికీ.. కొత్త రికార్డులను సృష్టించాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల సంపదను అమాంతం పెంచాయి. అయితే ఈ వారం మార్కెట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రానున్న వారంలో మార్కెట్ సెంటిమెంట్లు పాజిటివ్ గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా ద్రవ్యోల్బణం ఆగస్టులో తగ్గటంతో పాటు వడ్డీ రేట్ల పెంపుపై యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బ్రేక్ వంటి కీలక నిర్ణయాలు భారత మార్కెట్ల ర్యాలీకి దోహదపడనున్నాయి. ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్, టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు నమోదు కావొచ్చని తెలుస్తోంది.

ఇదే క్రమంలో సెప్టెంబర్ 20న షెడ్యూల్ చేయబడిన అమెరికా సెంట్రల్ బ్యాంక్ FOMC సమావేశం చాలా కీలకం కానుంది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు దీనిపై ప్రస్తుతం ఆసక్తిగా ఉన్నారు. ఫెడ్ రేట్ల పెంపును ప్రకటిస్తుందా లేక ప్రస్తుతానికి బ్రేక్ కొనసాగిస్తుందా అనే ఉత్కంఠ అందరిలోనూ కొనసాగుతోంది. కొందరి అంచనాల ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్ సమావేశంలో పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఆగస్టులో నిరుద్యోగిత రేటు పెరుగుదల, సీపీఐ ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఫెడ్ చీఫ్ పావెల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆందోళనలు ఉన్నాయి. ఇదే క్రమంలో 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ భారీగా పెరిగి 4.33 శాతం వద్ద కొనసాగుతున్నాయి.
మరో పక్క ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు 10 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. ప్రధానంగా ఒపెక్ దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించటంతో బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరుకునే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం ఇది 94 డాలర్లుగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో విదేశీ ఇన్వెస్టర్లు తమ డబ్బును భారత మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటున్నారు. ఇక దేశీయంగా ఫారెక్స్ నిల్వల డేటా 22న రానుంది. ఇక టెక్నికల్స్ విషయానికి వస్తే నిఫ్టీ సూచీ వీక్లీ చార్స్ బలమైన బులిష్ క్యాండిల్ నమోదు చేసింది. 20,300 మార్క్ రెసిస్టెంట్ కింద పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications