ఈ రోజుల్లో, యువ వ్యాపారవేత్తల విజయకథలు తరచూ వార్తల్లో కనిపిస్తాయి. కొద్దిపాటి పెట్టుబడితో కోట్ల రూపాయల వ్యాపారాలను నిర్మించినవారి కథలు మనలో మోటివేషన్ ఇస్తాయి. అలాంటి ప్రేరణతో బెంగళూరులోని ఒక 22 ఏళ్ల యువకుడు తన కలను నెరవేర్చుకోవడానికి రెస్టారెంట్ ప్రారంభించాడు. కొద్దికాలంలో పాపులర్ కావాలని, కస్టమర్లను సంతోషపెట్టాలని ఆశించాడు. అందుకోసం ఆరు నెలలుగా సరైన స్థలాన్ని వెతికాడు. చివరగా కళాశాలలు, హాస్టళ్లు ఉన్న రద్దీ ప్రాంతంలో చిన్న స్థలాన్ని నెలకు రూ. 30 వేలకి అద్దెకు తీసుకున్నాడు. విద్యార్థులు ఆహారం కోసం వస్తారని అనుకుని ముందుకు సాగాడు.
తర్వాత రెండు నెలలు రెస్టారెంట్ సిద్ధం చేయడంలోనే గడిపారు. పాత్రలు, వంటగది, హోర్డింగ్‌లను ఏర్పాటు చేసి ప్రతిదీ సిద్ధం చేశారు. ఇల్లు 15 కి.మీ దూరంలో ఉండటంతో, అతను, సోదరుడు సమీపంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. మే 2025లో వారి రెస్టారెంట్ ప్రారంభం అయింది. మొదటి కొన్ని రోజులు ఆశాజనకంగా సాగినప్పటికీతర్వాత.. రోజుకు అమ్మకాలు రూ. 2 వేల నుంచి 2,500 మాత్రమే జరిగేవి.

అయితే వీధి అవతల ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ రోజంతా రద్దీగా ఉంటూ రోజుకు రూ. 40 వేల నుంచి 45 వేల వ్యాపారం నడిచేది. విద్యార్థులు అతని నాణ్యమైన ఆహారం కంటే చౌకైన, వేగవంతమైన ఆహారాన్ని ఇష్టపడ్డారు. ఫలితంగా అమ్మకాలు తగ్గిపోయాయి. అద్దె, సిబ్బంది జీతాలు, ముడిపదార్థ ఖర్చులు భరించలేకపోవడంతో అతనిపై మరింతగా ఒత్తిడి పెరిగింది.అతను ఇద్దరు వంటవారిని నియమించి, వారి కోసం చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. ప్రతి ఉదయం 4 గంటలకు లేచి 5 గంటలకు వంట ప్రారంభించి, రాత్రి 9 వరకు అక్కడే గడపేవాడు. రోజూ హోటల్ మూసివేసిన తర్వాత తాను భోజనం వండుకుని కేవలం ఐదు గంటల నిద్ర మాత్రమే పొందేవాడు. వ్యాపారం సజావుగా సాగకపోవడంతో 20 రోజుల్లో 4 కిలోలు తగ్గి, మానసిక శాంతి కోల్పోయాడు.
జూన్ ప్రారంభానికి పరిస్థితి భరించలేనిదిగా మారింది. నెలవారీ నష్టాలు పెరిగడంతో సోదరులు రెస్టారెంట్ మూసివేయాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లు, కౌంటర్లు సగం ధరకు అమ్మాల్సి వచ్చింది. అమ్మేలోపు అవన్నీ నిల్వ చేయడానికి 15 కి.మీ దూరంలోని మరొక చిన్న గదిని నెలకు రూ. 6 వేలకు అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది.దీనివల్ల ఖర్చు భారం కూడా మరింతగా పెరిగింది.
ఆ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఆ యువకుడు రెడ్డిట్ లో ఎమోషనల్ అయ్యారు. ఈ వ్యాపారం ద్వారా అతను తెలుసుకున్న అత్యంత పెద్ద పాఠం ఏమిటంటే.. జనసమూహం ఎలాంటిదో కాదు, ఎక్కడ ఉందో చూసుకోవడం ముఖ్యం. ఆ ప్రాంతంలోని విద్యార్థులు రుచి, వాతావరణం కోసం కాకుండా, కేవలం తాము కడుపు నింపుకునే చౌకైన ఆహారాన్ని కోరుతూ ఉన్నారని అతను అర్థం చేసుకున్నాడు. అతని రెస్టారెంట్ అందించిన ఆహారం వారి అంచనాలకు సరిపోలలేదు. వెనక్కి తిరిగి చూస్తే.. చాలా త్వరగా తన వ్యాపారాన్ని వదిలి పెట్టకపోతే, ఆ చిన్న కల అతని మనసుకు, శరీరానికి మరింత నష్టం చేస్తుందని గ్రహించాడు.
తన వెనక ఉన్న అర్ధరాత్రి నిద్రలేని రాత్రులని, ప్రతిరోజూ వంటగదిలో కష్టపడి నిలిచిన కష్టాల్ని గుర్తుచేసుకుంటూ అతను చిరునవ్వుతో ఇలా చెప్పాడు.. మీరు ఎప్పుడైనా డబ్బును ఎందులోనైనా తగలెట్టాలని భావిస్తే ఒక రెస్టారెంట్ తెరవండి. డబ్బు కోల్పోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి..అవేంటంటే.. జూదం లేదా రెస్టారెంట్ నడపడం అంటూ చెప్పుకొచ్చారు. అవి సరదాగా చెప్పిన మాటలు అయినప్పటికీ వాటి వెనుక నిరాశ, బాధ, ఒక యువకుడి కలపై చిమ్మిన కష్టాల భావన స్పష్టంగా ఉంది. ప్రతి చిరునవ్వులో, ఓ గుండె నొప్పి, ఓ గొప్ప పాఠం దాగి ఉందని మనం చూడవచ్చు.
ఇంటర్నెట్‌లో అతని కథ వైరల్ అయింది. అనేక మంది వ్యాపారవేత్తలు అనుభవాన్ని పంచుకున్నారు. కొంతమంది సలహా ఇచ్చారు: లాభం లేకుండా జీవించడానికి కనీసం రెండు సంవత్సరాల పొదుపు అవసరం. చాలా మంది అతని నిజాయితీని ప్రశంసించి, ప్రారంభంలో ప్రతి వ్యవస్థాపకుడు ఎదుర్కొనే కష్టాలను గుర్తించారు.ఈ కథ మనకు ఏమి చెబుతుందంటే యువకుడి కలలు, ఉత్సాహం, మంచి ఉద్దేశాలు ఉన్నా, సరైన మార్కెట్ అంచనా, సరైన కస్టమర్ బేస్ లేకపోవడం, షరతులు తెలుసుకోకపోవడం వల్ల అతను ఒక నెలలోనే Restaurant మూసివేయాల్సి వచ్చింది. ఇది వ్యాపారంలో దిగే వారికి విలువైన పాఠం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications