ప్రతినెల ఒకటో తేదీన జీతం రాగానే ఇంటి ఖర్చుల కోసం కొంత వెచ్చిస్తుంటారు. ఇవి కాకుండా కొన్ని రూల్స్ మార్పులు కూడా మన ఆదాయంపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ ఏడాది చివరి నెల అయినా డిసెంబర్ నెల ప్రారంభంలో కూడా కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి, ఇవి సామాన్యుల పాకెట్ పై ప్రభావం చూపవచ్చు. డిసెంబర్ నెలలో రానున్న కొన్ని రూల్స్ మార్పులు ఏంటంటే, టెలికాం పరిశ్రమ నుండి ట్రావెల్ ఛార్జీల వరకు డిసెంబర్ 1 నుండి అమలులోకి వచ్చే కొన్ని మార్పులు ఇవే..
ఫేక్ OTP: ఫేక్ OTP సమస్యలను అరికట్టడానికి ఇంకా మోసపూరితమైన OTPల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను పెంచడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రముఖ టెలికాం కంపెనీలకు ఫేక్ మెసేజులు ఎక్కడి నుండి వస్తున్నాయో ట్రాక్ చేసే ఫెసిలిటీ అమలు చేయాలని ఆదేశించింది.

ఈ చర్య ఆర్థిక మోసాలను తగ్గిస్తుంది ఇంకా సురక్షితంగా ఉంచుతుంది.అయితే OTP పొందడంలో సమస్యను ఎదురుకోవచ్చు. ఇంకా బ్యాంకింగ్, డిజిటల్ సేవలను యాక్సెస్ చేసినప్పుడు OTPని పొందడంలో ఆలస్యం కావొచ్చు.
LPG ధర: ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు (OMC) ప్రతి నెలా 1వ తేదీన LPG సిలిండర్ ధరలను మారుస్తాయి. అయితే డిసెంబర్ నెలలో కూడా LPG ధరలు సవరించనున్నారు. అయితే గత నెలలో డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ అక్టోబర్‌లో హోటళ్లలో ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ ధర రూ.48 పెరిగింది.
క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పు: చాలా బ్యాంకులు డిసెంబర్ 1 నుండి క్రెడిట్ కార్డ్ రివర్డ్స్, ఆఫర్స్ మార్చాలని యోచిస్తున్నాయి.
యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్: ఇప్పుడు కస్టమర్లకి విమానాలు, హోటళ్లలో రివార్డ్ పాయింట్లపై లిమిట్ ఉంటుంది.
HDFC బ్యాంక్: మూడునెలలకి ఒకసారి రూ. 1 లక్ష వరకు ఖర్చు చేసే కస్టమర్‌లకు మాత్రమే ఉచిత లాంజ్ యాక్సెస్ ఉంటుంది.
SBI అండ్ యాక్సిస్ బ్యాంక్: SBI, యాక్సిస్ బ్యాంక్ కూడా రివార్డ్ పాయింట్లు & క్రెడిట్ కార్డ్ ఛార్జీలను సవరించాయి.
మాల్దీవులు: ఇండియా నుండి మాల్దీవులను వెళ్లే వారు ఇప్పుడు ఫ్లయిట్ ఛార్జీలు పై ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు విమాన ఛార్జీ రూ.2,532 నుంచి రూ.4,220కి పెరగనుంది. అలాగే బిజినెస్ క్లాస్ ప్రయాణీకుల ఛార్జీ రూ.10,129కి పెరగగా, ఇంతకుముందు సగానికి సగం కంటే ఈసారి రెండింతలు పెరిగింది. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు రూ.20,257 చెల్లించాలి. ఈ కొన్ని మార్పులు సామాన్యుడి ప్రతినెలా జీతంపై ప్రభావాన్ని చూపువచ్చు. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం, మీ ఫైనాన్సియల్ ప్లాన్స్ రూపొందించడం చాలా ముఖ్యం.


Click it and Unblock the Notifications