వచ్చే నెల అంటే జూన్ 1 నుంచి కొన్ని రూల్స్ మారబోతున్నాయి. వీటిలో PF , FD రేట్లు ఇంకా క్రెడిట్ కార్డ్ వాడకంపై ఛార్జీలు ఉన్నాయి. మీరు ఉద్యోగం చేస్తూ PF కట్ అవుతుందా లేదా మీరు FD చేసి ఉంటే లేదా ఎఫ్ది చేయాలని ప్లాన్ చేస్తున్నారా అలాగే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే మీరు ఈ కొత్త రూల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రూల్స్ మీ పాకెట్ మని పై ప్రభావాన్ని చూపవచ్చు.

పీఎఫ్ నిబంధనల్లో మార్పులు: EPFO 3.0 అంటే ఈపీఎఫ్‌ఓ (EPFO) సిస్టంను అప్ గ్రేడ్ చేస్తూ EPFO 3.0 పేరుతో కొత్త వెర్షన్‌ను తీసుకువస్తోంది. దీనితో మీ పీఎఫ్ అకౌంట్ నుండి డబ్బు తీసుకోవడం మరింత ఈజీ అవుతుంది. కేవైసీ (KYC) అప్‌డేట్స్ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేదు. కొత్త సిస్టం క్లెయిమ్‌లను వేగంగా ప్రాసెస్ చేస్తుంది. అంతేకాకుండా మీరు ఏటీఎం (ATM) కార్డు తరహాలో ఒక ప్రత్యేక కార్డును పొందే అవకాశం ఉంది, దీని ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్లలో కొత్త నిబంధనలు: సెబీ (SEBI) మ్యూచువల్ ఫండ్ల కటాఫ్ సమయాల్లో మార్పులు చేసింది. ఆంట్ ఇపుడు మ్యూచువల్ ఫండ్లలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి లేదా విత్ డ్రా చేసుకోవడానికి గడువును సూచిస్తుంది. ఇకపై ఆఫ్‌లైన్ లావాదేవీలకు కటాఫ్ సమయం మధ్యాహ్నం 3 గంటలు కాగా, ఆన్‌లైన్ లావాదేవీలకు సాయంత్రం 7 గంటలు. ఈ మార్పులు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మీ డబ్బును మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి.
క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు: కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ జూన్ 1 నుండి మారుస్తోంది. స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఫెయిల్ అయినా లేదా డైనమిక్ కరెన్సీ మార్పిడి చేసినా కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. అలాగే, యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డులో కొన్ని మార్పులను ప్రకటించింది, ఇవి 20 జూన్ 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఈ మార్పులలో రివార్డ్ పాయింట్ల లెక్కింపు, వ్యాపారి క్యాటగిరి మార్పులు, కొత్త ఆఫర్లు అలాగే ఉపయోగించని రివార్డ్ పాయింట్ల వాలిడిటీ వంటివి ఉన్నాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్ల తగ్గింపు: సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు జూన్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఇకపై ఎఫ్‌డిలపై 4% నుండి 8.4% వరకు వడ్డీ లభిస్తుంది. 30 నుండి 36 నెలల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై అత్యధిక వడ్డీని పొందవచ్చు. మార్కెట్‌లో వడ్డీ రేట్ల మార్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
More From GoodReturns

EPFO 3.0: అప్లై చేయకుండానే మీ పీఎఫ్ డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి.. అది గంటల్లోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications