టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగ బలాన్ని దాదాపు 2% తగ్గించనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దీని ప్రభావం కంపెనీలో దాదాపు 12,000 మందికిపైగా ఉద్యోగులపై పడనుంది. ఈ ఉద్యోగ తొలగింపుల నిర్ణయం ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిల్లోని ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని టీసీఎస్ కంపెనీ పేర్కొంది.అయితే ఇదేమి కొత్త కాదు.గత కొన్ని త్రైమాసికాలుగా TCSలో ఉద్యోగాల తగ్గింపులు స్థిరంగా పెరుగుతున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1 FY25)లో అట్రిషన్ (క్షీణత) రేటు 12.1 శాతంగా ఉండగా, ఇది 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1 FY26) 13.8 శాతానికి పెరిగింది. ఇది గత రెండేళ్లలో అత్యధికమని చెప్పుకోవచ్చు.
అట్రిషన్ పెరిగే కొద్దీ.. మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. Q3, Q4 FY25లో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగుల వలసలు పెరగడంతో.. స్టాక్ ధరలో తక్కువ నుంచి మధ్యస్థాయి వరకూ దిద్దుబాట్లు వచ్చాయి. అలాగే FY25 ప్రారంభంలో అట్రిషన్ తగ్గిన సమయంలో TCS స్టాక్ బలంగా పెరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో.. ఉద్యోగుల తొలగింపుల ప్రకటన మార్కెట్‌లో మరో నెగటివ్ సౌండ్ ను చూపించింది. Q1 FY26లో టీసీఎస్ కంపెనీ స్టాక్ ధర మరింత ఖచ్చితమైన తగ్గుదల చూపించింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో TCS షేరు ధర 0.66 శాతం పడిపోయింది. గత నెలలో 9%కిపైగా తగ్గింది. గత ఆరు నెలల్లో 22శాతానికి పైగా తగ్గగా చివరికి గత సంవత్సరంలో 28 శాతం మేర టీసీఎస్ స్టాక్ ధర తగ్గింది.

స్టాక్ మార్కెట్లో తగ్గుదలకు కారణం ఏమిటి? టీసీఎస్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ఒక వ్యూహాత్మక పునఃనిర్మాణం. కొత్త సాంకేతికతలు, AI పరిజ్ఞానాన్ని కలుపుకుని సేవలను వేగంగా మెరుగుపరిచే దిశగా వెళ్తోంది TCS కంపెనీ. ఇందుకోసం.. ఉద్యోగులకు ట్రైనింగ్ కూడా ఇస్తోంది. ఎంత చేసినప్పటికీ ఉద్యోగాల కోత మాత్రం తప్పలేదు. రోజు రోజుకు పెరుగుతున్న ఉద్యోగుల అట్రిషన్, షేరు ధర తగ్గుదల మధ్య అవినాభావ సంబంధం కనిపిస్తోంది.
పెట్టుబడిదారులు ఉద్యోగుల స్థిరతను సంస్థ విశ్వసనీయతకు ప్రతీకగా చూస్తున్నారు. ఉద్యోగాల కోతలు, నిర్వహణ మార్పులు, AIకి మార్పులు ఈ అంశాలన్నీ పెట్టుబడిదారుల్లో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నాయి. కంపెనీ విశ్వసనీయతపై ఆలోచనలో పడేస్తున్నాయి. అయిన్పటికీ టీసీఎస్ కంపెనీ బలంగా ముందుకు అడుగులు వేస్తోంది. TCS ఈ దశలో ఉద్యోగులను కోల్పోయినా దీర్ఘకాలిక వ్యూహానికి అనుగుణంగా కొత్త ఉద్యోగులతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మళ్లీ గెలుచుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
వచ్చే ఏడాది వరకూ తమ స్టాఫ్‌లో 1,200 వేల మందిని తొలగించనునట్లు కంపెనీ కీలక ప్రకటన చేసిన సంగతి విదితమే. ఆదివారం మనీ కంట్రోల్ వార్తా సంస్థతో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే.కృతివాసన్ ఈ వివరాలను వెల్లడించారు. ఐటీ రంగంలో చాలా మార్పులు వస్తున్నాయని.. కృత్రిమ మేధ, ఆపరేటింగ్ మోడల్ మార్పులు ఇలా కొత్త సాంకేతికత పుట్టుకొచ్చిందని తెలిపారు. అందుకు అనుగుణంగానే ఎవరైనా నడుచుకోవాలన్నారు. తొలగించిన వాళ్లకు వేతనంతో పాటు మంచి ప్యాకేజీ ఇస్తామని భరోసా ఇచ్చారు. నోటీస్ పీరియడ్ సమయానికి జీతం చెల్లిస్తామన్నారు. వీటితో పాటు ఆరోగ్య బీమాను కొనసాగిస్తూనే వాళ్లు ఇతర సంస్థల్లో ఉద్యోగం సాధించడానికి అవసరమైన సహకారం అందిస్తామని కృతివాసన్ పేర్కొన్నారు.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications