Maha kumbhmela: 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళాలో రికార్డు స్థాయిలో ప్రజలు తమ ఆసక్తిని చూపారు. ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం దాదాపు 65 కోట్లకు పైగా ప్రజలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగమయ్యారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా దాదాపు రూ.3 లక్షల కోట్లు ప్రజలు ఖర్చు చేసినట్లు వెల్లడైంది.
యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో ఏర్పాట్ల కోసం భారీగానే ప్రభుత్వం తరఫున కేటాయించినప్పటికీ.. అనేక కార్పొరేట్ కంపెనీలు తమ వంతు సాయంగా అనేక కార్యక్రమాలను చేపట్టి అక్కడికి వచ్చిన భక్తుల పర్యటనను ఫలవంతంగా పూర్తి చేయటానికి సహకరించాయి. అయితే అక్కడక్కడా కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ మెుత్తాన్నికి 45 రోజుల పాటు జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ కలయికగా నిలిచింది. ప్రపంచ దేశాలు కూడా దీనిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

ముందుగా ఓలా సంస్థ భక్తుల కోసం దాదాపు 1000 ఈవీ స్కూటర్లను అందుబాటులో ఉంచింది. ఇది కర్భన ఉద్ఘారాలను తగ్గించటంతో పాటు ప్రజలకు రవాణాను మెరుగుపరిచింది. ఇదే క్రమంలో దేశంలోని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ IIFLకి చెందిన ఫౌండేషన్ 15 బోట్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. ఈ పడవ అంబులెన్స్‌లు పడవ ప్రయాణికుల అత్యవసర వైద్య అవసరాలకు చికిత్స అందించాయి. ఇదే క్రమంలో ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ అయిన స్విగ్గీ మహా కుంభమేళా కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఎవరైనా తప్పిపోతే వారిని కనిపెట్టడానికి సహకారం అందించింది.
పార్క్+ కంపెనీ ప్రయాగ్‌రాజ్‌లో స్మార్ట్ పార్కింగ్‌ను ప్రవేశపెట్టింది. ఇది అక్కడికి వచ్చిన వ్యక్తులకు తమ వాహనాలను పార్క్ చేయడం, తిరిగి పొందడం సులభం అయింది. ఇంత పెద్ద కార్యక్రమంలో శానిటైజేషన్ చాలా కీలకంగా మారిన వేళ 15,000 మంది పారిశుధ్య కార్మికులకు పారిశుధ్యంపై శిక్షణ ఇచ్చింది. ఇదే క్రమంలో జొమాటోకి చెందిన క్విక్ కామర్స్ కంపెనీ బ్లింకిట్ అక్కడికి చేరుకున్న భక్తులకు అవసరమైన వస్తువులు తక్షణం అందించేందుకు ప్రత్యేక స్టోర్లను ఏర్పాటు చేసింది. మ్యాన్‌కైండ్ ఫార్మా వైద్య శిబిరాలతో ఉచిత సేవలను అందించింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వేలాది మంది భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు కార్డ్‌బోర్డ్ పెట్టెలతో బాక్సులను తయారు చేసింది. అలాగే సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకాకోలా భక్తులు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేకంగా రూమ్స్ ఏర్పాటు చేసింది. ఇక ఓలినీ సంస్థ భక్తుల కోసం మసాజ్ థెరపీ సెంటర్లను అందుబాటులో ఉంచింది. ఎవరెడీ సంస్థ పోలీసు సిబ్బందికి ఐదు వేల సైరన్ టార్చిలను అందించడం ద్వారా భద్రతను నిర్ధారించింది. ఇక ప్రముఖ స్పోర్ట్స్ బైక్స్ తయారీ సంస్థ కేటీఎం ప్రజల కోసం మొబైల్ ఫోన్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇక అంబానీకి చెందిన రిలయన్స్ భక్తుల కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications