భారతదేశంలోని పెద్ద నగరాల్లో జీవించడం ఇప్పుడు సాధారణ ప్రజలకు కష్టసాధ్యంగా మారింది. వేతనాల పెరుగుదల స్థిరంగా ఉండగా, అద్దె, జీవన వ్యయాలు విపరీతంగా పెరగడంతో నగర జీవితం ఇప్పుడు ఒక విలాసంగా మారింది. ఇటీవల లింక్డ్ఇన్‌లో విశ్లేషకుడు సుజయ్ యు పంచుకున్న పోస్ట్ ఈ సమస్యను మళ్లీ అందరి ముందుకు తెచ్చింది. ఆయన పోస్ట్ దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. ఎందుకంటే ఆయన అందించిన గణాంకాలు ప్రతి నగర నివాసితుడి వాస్తవ జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
సుజయ్ యు తన పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలోని పెద్ద నగరాల్లో ప్రజలు తమ నెలవారీ ఆదాయంలో సగానికి పైగా Rents వెచ్చిస్తున్నారు.ముంబైలో సగటు నెలవారీ ఆదాయం రూ. 25,000 మాత్రమే ఉండగా.. ఒక చిన్న 1BHK ఫ్లాట్ అద్దె కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటుంది.ఇక బెంగళూరులో సగటు వేతనం రూ. 28,400, అయితే అద్దె రూ. 20,000కు చేరింది.ఇక ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ.. అక్కడ కూడా అద్దె ఆదాయంలో సగానికి పైగా ఉంటుంది.

ఆయన పోస్టు ప్రకారం.. ఒక వ్యక్తి నెలకు రూ. 30 వేలు సంపాదించినా, దాదాపు రూ. 15 వేల నుంచి రూ. రూ.20 వేలు అద్దెకే వెళ్తుంది. మిగతా డబ్బు కిరాణా, విద్యుత్, నీటి బిల్లులు, ప్రయాణ ఖర్చులు వంటి ప్రాథమిక అవసరాలకే సరిపోతుంది. ఇక అతను ఏమి మిగుల్చుకోగలడని ప్రశ్నించారు. సుజయ్ యు పోస్ట్‌లో ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఏమిటంటే.. ఇళ్లను నివసించడానికి స్థలంగా కాకుండా పెట్టుబడిగా చూడటం. రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు ఇళ్లను ఖాళీగా ఉంచి ధరలను కృత్రిమంగా పెంచుతున్నారు. ఇది మార్కెట్‌లో సరఫరాను తగ్గించి, అద్దెలను పెంచుతోందన్నారు.
ఈ ధోరణి వల్ల సాధారణ మధ్యతరగతి వ్యక్తికి నగరంలో నివాసం కలిగి ఉండటం దాదాపు అసాధ్యంగా మారింది. ఉద్యోగాల కోసం నగరాలకు వచ్చే యువత తక్కువ వేతనాలతో ఎక్కువ అద్దెలు చెల్లిస్తూ జీవన నాణ్యతను కోల్పోతున్నారు. భారతదేశంలోని అనేక రంగాల్లో వేతనాల పెరుగుదల గత కొన్నేళ్లుగా నిలిచిపోయిందని సుజయ్ పేర్కొన్నారు.అయితే అదే సమయంలో, నగర జీవన వ్యయాలు ముఖ్యంగా అద్దె, రవాణా, ఆహారం, విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగాయని తెలిపారు.
పెద్ద నగరాలకు ప్రజల కదలిక వేగంగా పెరుగుతోంది.. కానీ మౌలిక సదుపాయాలు, వేతనాలు అదే స్థాయిలో పెరగడం లేదు. ఇది సామాజిక అసమానతకు దారితీస్తుందని ఆయన అన్నారు.ఒక 1BHK అద్దె మీ జీతంలో 60 నుంచి 70 శాతం తీసుకుంటే, ఆ నగర కల నిజంగా విలువైనదేనా అని తన పోస్టులో ప్రశ్నించారు. ఈ రోజుల్లో విజయాన్ని మనం ఎక్కడ నివసిస్తున్నామో అనే దానితో కాదు, మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామో దానితో కొలవాలని తెలిపారు.
క్లుప్తంగా చెప్పాలంటే.. భారతదేశంలోని పెద్ద నగరాలు ఇప్పుడు ఆర్థికంగా సామాన్యుల కంటే ధనికులకు మాత్రమే అందుబాటులో ఉన్న విలాసంగా మారుతున్నాయి. వేతనాలు పెరగకపోవడం, అద్దె రేట్లు ఆకాశాన్నంటడం, పెట్టుబడిదారుల మానసికత.. ఇవన్నీ కలిపి నగర జీవన సమీకరణాన్ని అసమానంగా మార్చాయి.


Click it and Unblock the Notifications