May 2024 Changes: నేటి నుంచి కొత్త నెల ప్రారంభం కావటంతో దేశంలోని ప్రజలు గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ క్రమంలో మే నెల నుంచి మారుతున్న రూల్స్ గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవి ప్రతిఒక్కరి జేపుపై ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి.
- ముందుగా ఐసీఐసీఐ బ్యాంక్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ హోల్డర్లకు పెద్ద వార్త ఉంది. మే 1 నుంచి సేవింగ్స్ ఖాతాలో ఛార్జీలను రివైజ్ చేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీని కింద డెబిట్ కార్డులపై ఏడాదికి రూ.200 వరకు వార్షిక రుసుము ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు దీనిని రూ. 99గా బ్యాంక్ నిర్ణయించింది. అలాగే ఏడాదికి 25 టెక్ లీఫ్స్ ఉచితమని ఆపై ఒక్కోదానికి రూ.4 ఛార్జీగా వసూలు చేయాలని బ్యాంక్ నిర్ణయించింది. అలాగే IMPS లావాదేవీల కోసం ఛార్జీలను ప్రకటించింది. ఆర్థిక కారణాల దృష్ట్యా ప్రతి ECS/NACH డెబిట్ రిటర్న్‌కు రూ.500 పెనాల్టీ ఛార్జీ కూడా ఉంటుందని బ్యాంక్ పేర్కొంది.

- ప్రస్తుత కాలంలో దేశంలోని చాలా మంది తమ పెట్టుబడి అవసరాలను మ్యూచువల్ ఫండ్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మే 1 నుంచి మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్‌లో మీ పేరు మీ పాన్ కార్డుతో సరిపోలకపోతే దరఖాస్తు తిరస్కరించబడుతుంది. అధికారిక రికార్డులలో మీ పేరు ఎలా కనిపిస్తుందో స్పష్టం చేయడానికి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-నిర్దేశించిన KYC నియమాల ప్రకారం పేరు ఏకరీతిగా ఉండాలి. మీరు మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్ ఫోలియోలో పెట్టుబడి పెడుతున్నట్లయితే పేరు, పుట్టిన తేదీ మీ పాన్‌లో, ఆదాయపు పన్ను రికార్డులలో ఒకే విధంగా ఉండాలి.
- ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలోని కంపెనీ అయిన యెస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై వివిధ ఛార్జీలను మే నెల నుంచి సవరించింది. సేవింగ్స్ ఖాతాలలో నిర్దేశించిన సగటు నెలవారీ బ్యాలెన్స్ ఛార్జీలను పెంచింది. వీటిని బ్యాంకు రూ.250 నుంచి రూ.1,000గా వసూలు చేయాలని నిర్ణయించింది. గతంలో ఇది రూ.250 నుంచి రూ.750గా ఉండేది. సేవింగ్స్ ఖాతా రకం, బ్యాంక్ బ్రాంచ్ ఉన్న ప్రదేశం, ఖాతాలోని బ్యాలెన్స్ మొత్తాన్ని బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. తక్కువ బ్యాలెన్స్ కారణంగా ECS రిటర్న్స్‌తో, బ్యాంక్ ఇప్పుడు మొదటిసారిగా రూ.500 వసూలు చేస్తుంది.
- యుటిలిటీ బిల్లులు చెల్లించడం ఖరీదైనది. మే 1 నుంచి క్రెడిట్ కార్డుల ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లింపులపై బ్యాంకులు 1% అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. మే 1, 2024 నుండి యెస్ బ్యాంక్, ఐడిఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఏవైనా యుటిలిటీ బిల్లులను చెల్లిస్తే దానిపై 1 శాతం ఛార్జీలను వర్తింపజేయాలని నిర్ణయించాయి. అయితే వీటిలో యెస్ బ్యాంక్ రూ.15,000 ఉచిత వినియోగ పరిమితిని అందిస్తుండగా.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌కు ఇది రూ.20,000 కంటే ఎక్కువ బిల్లు చెల్లింపుపై అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది.
- చివరిగా మే 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్, ఎటీఎఫ్ ధరల్లో కూడా మార్పు ఉంటుంది. LPG సిలిండర్ ధరను చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయని తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.19 తగ్గించగా.. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల రేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications