RodBez Founder Dilkhush Success Story: ఒకప్పుడు ఆటో డ్రైవర్‌గా రోడ్ల మీద రాత్రింబవళ్లు తిరిగిన వాడే... ఈ రోజు కోట్లు విలువైన కంపెనీకి CEO అయ్యాడు. కాలేజీ విద్యను కూడా పూర్తి చేయని ఒక సాధారణ యువకుడు... కష్టాలే జీవితం అనుకున్న రోజుల్లోనూ తన కలలు ఏ మాత్రం వదల్లేదు. చేతిలో ఓ చిన్న అవకాశమూ లేకపోయినా, హృదయంలో ఆశ అనేది ఉంటే మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లగలడో ఈ యువకుడి జీవితం నిరూపించింది. ఆటోమీటర్ టిక్‌టిక్‌ల మధ్య పెరిగిన అతని కల... ఈరోజు రూ.400 కోట్ల వ్యాపార ప్రపంచాన్ని నిర్మించింది. పేదరికం అడ్డుపడినా, చదువు లేకపోయినా, పరిచయాలు లేకపోయినా ఒక సాధారణ యువకుడు ఎలా అసాధారణ విజయాన్ని సాధించాడో ఈ కథ చదివితే మీకే తెలుస్తుంది.
బీహార్‌లోని ఒక చిన్న పట్టణంలో దిల్‌ఖుష్ కుమార్ అనే యువకుడు తన జీవితాన్ని మార్చే ఒక నిర్ణయాత్మక క్షణంతో మన ముందుకు వచ్చాడు. 12వ తరగతి పాసైన ఈ యువకుడు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఒక రోజు సెక్యూరిటీ గార్డ్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. అతని ముందు ఉన్న వ్యక్తికి ఆ ఉద్యోగం లభించింది. కానీ దిల్‌ఖుష్‌ను మాత్రం 12వ తరగతి మాత్రమే అనే ఒక మాటతో తిరస్కరించారు. చాలా మందికి ఆ క్షణం అసహనంగా మారి జీవితాన్ని చిందరవందర చేస్తుంది. అయితే దిల్‌ఖుష్‌కు మాత్రం అది మరో తలుపు తెరిచింది. ఇప్పటివరకు తనకు ఉన్న తలుపులు సరైనవికాదని తెలిపింది.

ఆ రోజు అతను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. పోటీ ప్రపంచంలో అవకాశాలు తక్కువైనా, తన స్వంత దారిని తానే నిర్మించుకోవాలని అనుకున్నాడు. అతని నిజమైన చదువు బీహార్ రోడ్లపైనే మొదలైంది. రోజూ ఆటో నడుపుతూ ప్రజలు ఎదుర్కొనే సాధారణ సమస్య ఒకటి అతన్ని ఆలోచింపజేసింది. అదేంటంటే సుదూర ప్రయాణం చాలా కష్టం, టాక్సీలు విశ్వసనీయంగా ఉండవు, ఖరీదైనవి. నగరాల మధ్య ప్రయాణం సాధారణ ప్రజలకు భారమవుతోంది. ఇదే సమయంలో దిల్‌ఖుష్ దాన్ని సమస్యను కాకుండా అవకాశాన్ని చూశాడు. ఆ సమస్యనే వ్యాపారంగా మార్చుకున్నాడు.
2016లో ఎక్కువ పెట్టుబడి లేకపోయినా.. తన మీద తనకు ఉన్న నమ్మకంతో అతను Roadbez అనే సేవను ప్రారంభించాడు. రోడ్‌బెజ్ ఒక రైడ్-హైలింగ్ యాప్ కాదు, టాక్సీలు కూడా దాని సొంతం కావు. ఇది ప్రజలు, ధృవీకరించబడిన స్థానిక డ్రైవర్లను కలిపే నమ్మకమైన ప్లాట్‌ఫారమ్. రోడ్‌వేస్"కు స్నేహపూర్వక మలుపు ఇచ్చినట్టుగా ఉండే ఈ పేరులోనే విశ్వాసం దాగి ఉంది. దిల్‌ఖుష్ ఈ యాప్ ప్రారంభించే ముందు అనేక ఇంటర్వ్యూలకు వెళ్లాడు. ఒకసారి ఇంటర్వ్యూలో ఐఫోన్ లోగో చూపించగా.. అతను గుర్తించలేకపోయాడు. ఎందుకంటే అతను ఎప్పుడూ ఐఫోన్ చూడలేదు. మళ్ళీ అక్కడ ఉద్యోగం తిరస్కరణతో వెనకకి వచ్చాడు. కానీ ఈ తిరస్కరణలు అతన్ని వెనక్కి నెట్టలేదు.. మరింత ముందుకు నడిపించాయి.
రోడ్‌బెజ్ బీహార్ ప్రజలకు నిజమైన అవసరాల ఆధారంగా సేవలను అందించింది. రౌండ్ ట్రిప్‌కి డబ్బు ఖర్చు చేయని వన్-వే టాక్సీ కాన్సెప్ట్ ప్రజల్లో హిట్ అయ్యింది. 50 కిలోమీటర్లకంటే ఎక్కువ ప్రయాణాలకు కార్‌పూలింగ్, షేర్డ్ రైడ్‌లను ప్రవేశపెట్టాడు. బీహార్ వంటి రాష్ట్రంలో ఇది సుదూర ప్రయాణానికి పెద్ద మార్పు.
2021లో అతను మరొక ముందడుగు వేసి బీహార్‌లోని ప్రతి నగరాన్ని అనుసంధానించే యాప్‌ను ప్రారంభించాడు. అతని ఆలోచన అంత బలంగా ఉండటంతో పెట్టుబడిదారులు అతనికి రూ. 40 లక్షల పెట్టుబడి ఇచ్చారు. అందులో కీలకంగా, రోడ్‌బెజ్ ఇచ్చింది ఒక ప్రత్యేక నమ్మక వాగ్దానం. డ్రైవర్ తప్పు వల్ల ప్రయాణికుడు విమానాన్ని మిస్ అయితే, కంపెనీ కొత్త టికెట్ బుక్ చేస్తుంది. ఈ ప్రాంతంలో ఇలాంటి గ్యారెంటీ ఇచ్చిన మొదటి సంస్థ కూడా ఇదే. ఆటో డ్రైవర్ సీటు నుండి పుట్టిన ఈ చిన్న స్టార్టప్, ఏళ్లలోనే వందల కోట్ల వ్యాపారంగా ఎదిగింది. బీహార్‌లో వేలకొద్దీ ఉద్యోగాలను సృష్టించింది.
తన ప్రయాణానికి అత్యంత పెద్ద గుర్తింపు వచ్చింది Shark Tank India వేదికపై. IIT-IIM గ్రాడ్యుయేట్ల ముందు అతను తన 5 శాతం వాటాకు రూ. 50 లక్షలు అడిగాడు. షార్క్స్ అతని మార్కెట్ అవగాహన, కృషి, ప్రయాణం చూసి ఆశ్చర్యపోయారు. చివరికి OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్, ఎమ్క్యూర్ ఫార్మా చీఫ్ నమితా థాపర్ అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు.
దిల్‌ఖుష్ కథ IIT గ్రాడ్యుయేట్లను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాదు. ఒక గొప్ప పాఠంగా మారింది. గొప్ప ఆలోచనలు ఎక్కడి నుంచైనా రావచ్చు.. కొన్నిసార్లు డ్రైవర్ సీటు నుంచే వస్తాయి. కష్టపడి పనిచేస్తే, ధైర్యం ఉంటే, ఎక్కడి నుండి ప్రారంభించినా విజయం సాధ్యమే అని ఆ యువకుడు నిరూపించాడు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications