Billionaires loss: ఫలితాల సునామీలో మార్కెట్లు.. వేల కోట్లు కోల్పోయిన బిలియనీర్స్ వివరాలు..

Eletion Results Effect: భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలో నిన్న మరచిపోలేని రోజు. ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కంటే పూర్తి భిన్నంగా ఉండటం ఇన్వెస్టర్లను, ట్రేడర్లను, విదేశీ మదుపరులను ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. ఈ ఫలితాల సునామీతో దేశంలోని బిలియనీర్ వ్యాపారవేత్తల సంపద సైతం భారీగా క్షీణతకు గురైంది.

మంగళవారం స్టాక్ మార్కెట్‌ను తాకిన సునామీలో భారతీయ బిలియనీర్ల సంపద భారీగా ఆవిరైంది. ఈ క్రమంలో అందరి దృష్టి ప్రధానంగా ఉండేది అంబానీ, అదానీలపైనే. వాస్తవానికి నిన్న ఒక్కరోజే ముఖేష్ అంబానీకి చెందిన లిస్టెడ్ కంపెనీల పతనంతో ఆయన సంపద ఏకంగా రూ.75,144 కోట్లు ఆవిరైపోయింది. దీనికి తోడు ఇదే క్రమంలో కోటి ఆశలతో ఇన్వెస్టర్లు తమ డబ్బును పెట్టిన అదానీ గ్రూప్ కంపెనీల పతనం కారణంగా గౌతమ్ అదానీ సంపద అత్యధికంగా ఒక్కరోజే రూ.2,08,129 కోట్ల పతనాన్ని నమోదు చేసింది.

From ambani to adani Billionaire lost thouusand crores amid election results setback to BJP

ఇదే క్రమంలో వీరితో పాటు సావిత్రి జిందాల్, కెపి సింగ్, సునీల్ మిట్టల్, కుమార్ మంగళం బిర్లా, మంగళ్ ప్రభాత్ వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు సైతం ఊహించని రీతిలో సంపదను కోల్పోయారు. ప్రపంచంలోని బిలియనీర్లలో మంగళవారం అత్యధిక సంపదను కోల్పోయిన టాప్-10లో 8 మంది భారతదేశానికి చెందినవారే. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా జాబితా ప్రకారం, గౌతమ్ అదానీ 24.9 బిలియన్ డాలర్లు నష్టపోయిన తర్వాత టాప్ లూజర్‌గా నిలిచారు.

ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ముఖేష్ అంబానీ మంగళవారం సంపదను కోల్పోవడంలో ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచారు. అతని నికర విలువలో 8.99 బిలియన్ డాలర్లు తగ్గాయి. భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ నిన్న సంపదను కోల్పోయిన వారి జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. 3.58 బిలియన్ డాలర్ల విలువైన ఆమె సంపద కరిగిపోయింది. ఇప్పుడు ఆమె నికర విలువ 30.50 బిలియన్ డాలర్లు. అమెరికాకు చెందిన వారెన్ బఫెట్ నాల్గవ స్థానంలో ఉన్నారు, అతని సంపద $2.94 బిలియన్లు తగ్గింది.

ప్రపంచంలోని 120వ అత్యంత సంపన్నుడైన భారతదేశానికి చెందిన కేపీ సింగ్‌కు మంగళవారం 2.42 బిలియన్ డాలర్ల షాక్ తగిలింది. అతని సంపద కేవలం 16.8 బిలియన్ డాలర్లకు తగ్గింది. టెలికాం రంగ దిగ్గజం సునీల్ మిట్టల్ 1.68 బిలియన్ డాలర్లు నష్టపోగా.. కుమార్ బిర్లా సంపద 1.52 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. ఇక చివరిగా మంగళ్ ప్రభాత్ లోధా 1.18 బిలియన్ డాలర్ల నష్టాన్ని పొందారు.

నిన్న నష్టపోయిన అదానీ గ్రూప్ స్టాక్స్ వివరాలు:

అదానీ పోర్ట్స్ 21.40 శాతం

అదానీ ఎంటర్‌ప్రైజెస్ 19.13 శాతం

అదానీ పోర్ట్స్ 20 శాతం

అదానీ ఎనర్జీ 19.80 శాతం

అదానీ పవర్ 19.76 శాతం

అంబుజా సిమెంట్స్ 19.20 శాతం

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+