Donald Trump: కొన్ని నెలలుగా కొనసాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో చివరికి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికై 132 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండవ వ్యక్తిగా నిలిచారు. విజయం తర్వాత తన మొదటి ప్రసంగంలో డొనాల్డ్ ట్రంప్ టెస్లా యజమాని ఎలాన్ మస్క్ అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.
బహిరంగంగానే ట్రంపుకు మస్క్ తన సపోర్ట్ అందించారు. ఈ క్రమంలో ఆర్థికంగా సైతం అనేక మిలియన్ల డాలర్లు ట్రంపుకు క్యాంపెయిన్ సమయంలో విరాళంగా అందించి మద్ధతుగా నిలిచారు. చివరికి ట్రంప్ ఘన విజయం సాధించటంతో చివరికి ఆ అదృష్టం మస్క్ మామకు కాసుల రూపంలో కలిసొస్తోంది. టెస్లా స్టాక్ సైతం నిన్న ట్రేడింగ్ సమయంలో భారీగా పెరిగింది. ఇవన్నీ కలిసి ప్రస్తుతం టెస్లా సీఈవో సంపదను అమాంతంగా పెంచేశాయి. ఆయన నికర విలువ ఒక్కరోజులో భారీగా పెరిగిపోయింది.

ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర విలువ 26.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ రూ.2.23 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ పెరుగుదల తర్వాత మస్క్ మెుత్తం సంపద ఏకంగా 290 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. ఎండార్స్‌మెంట్ పోస్ట్‌లలో ఒకదానిలో ఏఐ ఆధారిత చిత్రంలో మస్క్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినట్లు చూపించబడింది. దీని తర్వాత ట్రంప్ కేబినెట్లో మస్క్ మంత్రి అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా దృవీకరణ దీని గురించి రాలేదు. అయితే ట్రంప్ గెలుపు వల్ల కేవలం మస్క్ మాత్రమే కాకుండా అనేక మంది బిలియనీర్ల సంపదను పెంచేసింది. అమెరికా స్టాక్ మార్కెట్లు మంచి ర్యాలీని చూడటంతో
అలా సంపదను పెంచుకున్న కుబేరుల్లో అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్ 7.14 బిలియన్ డాలర్ల పెరుగుదలతో ఆయన నికర విలువ 228 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే ఒరాకిల్ లారీ ఎల్లిసన్ $9.88 బిలియన్లను సంపాదించారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ $5.53 బిలియన్లు, వారెన్ బఫెట్ $7.58 బిలియన్ల మేర సంపద పెరుగుదలను చూశారు. ఇదే క్రమంలో ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న భారతీయ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ముకేశ్ అంబానీ సంపద ఈ క్రమంలో 1.3 బిలియన్ డాలర్ల వృద్ధిని చూసింది. దీంతో అంబానీ నికర విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే మరో వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద 3.62 బిలియన్ డాలర్లు పెరిగి నికర విలువ 97.2 బిలియన్ డాలర్లకు చేరుకోవటంతో ప్రపంచంలో 18వ అత్యంత ధనికుడి స్థానాన్ని అధిరోహించారు.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications