Ayodhya News: ఈనెల 22న అయోధ్యలో అద్భుతం ఆవిష్కుతం కానుంది. కోట్లాది మంది హిందువుల కల నెరవేరనుంది. అదే శ్రీరాముని ఆలయ ప్రారంభోత్సవం. దీనికి కేవలం భారతదేశం నుంచి కాక ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అంటూ రామనామమే వినిపిస్తోంది.
ఈ క్రమంలో దేశంలోని టాప్ వ్యాపారులకు సైతం రామమందిర ట్రస్టు నుంచి పిలుపు వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అధినేత ముఖేష్ అంబానీ , ఆదిత్య బిర్లా గ్రూప్ కుమార్ మంగళం బిర్లా, టాటా సన్స్‌కి చెందిన ఎన్ చంద్రశేఖరన్ , అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సహా భారతదేశపు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవ్వాలని ట్రస్టు నుంచి ఆహ్వానం అందుకున్నారు. మెుత్తం 10,000 అతిథుల జాబితాలో కేవలం వ్యాపార దిగ్గజాలు మాత్రమే కాకుండా.. వినోదం, క్రీడలు, రాజకీయాలు, కళలకు చెందిన కూడా ఉన్నారు.

హిందుస్థాన్ యూనిలీవర్ మాజీ సీఈవో సంజీవ్ మెహతా ఈ ఈవెంట్ గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు, హిందువులకు ఒక ముఖ్యమైన రోజుగా అభివర్ణించారు. హిందువుగా తనకు ఇది ఆధ్యాత్మిక యాత్ర అని మెహతా పేర్కొన్నారు. ఇదే క్రమంలో వేదాంత గ్రూప్‌కు చెందిన అనిల్ అగర్వాల్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన అజయ్ పిరమల్, రేమండ్ గ్రూప్‌కు చెందిన గౌతమ్ సింఘానియా, TVS ఎమెరిటస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ వంటి ఇతర వ్యాపార ప్రముఖులు ఆలయ ట్రస్ట్ ఆహ్వానించబడిన అతిథుల్లో ఉన్నారు.
అలాగే భారత్ ఫోర్జ్‌కి చెందిన బాబా కళ్యాణి, అమిత్ కళ్యాణి, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో అండ్ ఎండీ సతీష్ మెహతా, ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం కూడా అతిథిల లిస్టులో కనిపించారు. ఇలా దేశంలోని అనేక మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల రాకతో అయోధ్య హోటళ్లు కిక్కిరిసిపోగా అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లలో తలమునకలై ప్రొటోకాల్ ఏర్పాట్లు చేస్తున్నారు. అనేక మంది వీవీఐపీలు ప్రత్యేక విమానాల్లో అక్కడికి చేరుకునేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో భారతదేశంలోనే అతిపెద్ద ఇంజినీరింగ్ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ ఎలాంటి చార్జీలు లేకుండా ఆలయ డిజైన్, నిర్మాణాన్ని చేపట్టడం గమనార్హం.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications