దేశానికి ఐటీ రాజధానిగా ఆంధ్రప్రదేశ్.. సరికొత్త రోడ్ మ్యాప్ ఆవిష్కరించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ను సమాచార సాంకేతికత (IT, ఎలక్ట్రానిక్స్ రంగాలకు భారతదేశ ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు టిడిపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ఒక మహత్తరమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో.. ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు, వేగవంతమైన పారిశ్రామిక వృద్ధిని సాధించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం స్వర్ణాంధ్ర దార్శనికత కింద 2024-29 కాలానికి పలు కొత్త విధానాలను ప్రకటించింది. అందులో ఐటీ & గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీ,సెమీకండక్టర్ & డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, ఇన్నోవేషన్ & స్టార్టప్ పాలసీ వంటివి ఉన్నాయి.
ఈ విధానాల ద్వారా మూలధన రాయితీలు, అద్దె, విద్యుత్ సబ్సిడీలు, కో-వర్కింగ్ స్పేస్‌లకు మద్దతు, ఉద్యోగ సృష్టి ప్రోత్సాహకాలు, ఉద్యోగుల సంక్షేమ పథకాలు అందించబడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో ప్రతి ఉద్యోగానికి రూ. 3 లక్షల వరకు నియామక సబ్సిడీ ఇవ్వబడుతోంది. మహిళలు, వెనుకబడిన వర్గాలకు అదనపు ప్రయోజనాలు కూడా కల్పించారు. ఉద్యోగులకు గృహ, విద్యా భత్యాలు కూడా నేరుగా అందే విధంగా మార్పులు చేశారు.

జూన్ 2024 తర్వాత Andhra Pradesh రాష్ట్రంలో పారిశ్రామిక ఆసక్తి గణనీయంగా పెరిగింది. అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెద్ద ప్రాజెక్టులకు భూమి కేటాయింపులు కూడా అనేక కంపెనలు జరిగాయి. వాటిలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, LG ఎలక్ట్రానిక్స్, డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా, ప్రీమియర్ ఎనర్జీస్, వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ. 22,188 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా 47,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేస్తున్నారు. అదనంగా సత్వా గ్రూప్, ANSR విస్తరణ ప్రణాళికలతో మరో రూ. 1,500 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాలు రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల పనితీరు ఇటీవల మరింతగా బలపడింది. STPI రిజిస్టర్డ్ యూనిట్ల నుండి ఐటీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు దాదాపు రూ. 80,000 కోట్లకు చేరాయి. రాష్ట్రం ప్రతి నెలా 3.5 మిలియన్ మొబైల్ ఫోన్లు, ఏటా 3 మిలియన్ టెలివిజన్లు ఉత్పత్తి చేస్తోంది. ఈ సంఖ్యలు ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ మ్యాప్‌లో ముందుకు తెచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, సౌర తయారీ పరిశ్రమలు, AI ఆధారిత డేటా సెంటర్లుపై దృష్టి సారిస్తోంది. 2014-19 మధ్య తిరుపతి, విశాఖపట్నంలో టెక్నాలజీ హబ్‌ల పునాది వేయబడింది. కానీ 2019 తర్వాత ప్రాజెక్టులు మందగించాయి. 2024లో తిరిగి పునరుద్ధరించిన దృష్టి, విధాన మద్దతుతో ఈ ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమయ్యాయి. రాబోయే సంవత్సరాల్లో ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందకెళుతోంది.
ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారం సులభతరం చేయడం ప్రధానంగా ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు దృష్టి పెట్టింది. ఈ వేగం వల్లనే భారతదేశంలోని ప్రముఖ టెక్నాలజీ హబ్‌లతో పోటీగా ఆంధ్రప్రదేశ్ ఎదగగలదని అన్నారు.


Click it and Unblock the Notifications