ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన ఇన్వెస్టోపియా సమ్మిట్‌లో రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధిపై తన దృష్టిని సూటిగా వివరించారు. టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు, పరిశోధన, పెట్టుబడులు వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్‌గా చేయాలని తన దృఢ సంకల్పాన్ని చెప్పారు.

విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం చాలా ఆత్మవిశ్వాసంతో, స్పష్టమైన దిశతో ఉన్నాయి. ఈ సదస్సులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించిన తన ఆలోచనలను పూర్తిగా వివరించారు. అయన మాట్లాడుతూ "ఒకటి మాత్రమే కాదు, మీరు చెప్పిన ఏ రంగంలో అయినా, మేము నెంబర్ వన్ అవుతామంటున్నాను. డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ ఇవన్నీ భవిష్యత్తు టెక్నాలజీలు మా దృష్టిలో ఉన్నాయి.
అంటే, ఒక్క రంగంలోనే కాకుండా అన్ని కీలక రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే టెక్నాలజీలు లాంటి డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, అంతరిక్ష పరిశోధన (ఏరోస్పేస్) వీటన్నిటి మీద రాష్ట్రం ప్రత్యేక దృష్టి పెట్టబోతుందని చెప్పారు.
ఈ టెక్నాలజీలు భారతదేశ అభివృద్ధికి కీలకం అవుతాయని, అవి ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, పరిశోధనలకు అవకాశం కల్పిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లో మానకీ స్పష్టంగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీలో ముందంజలో ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన గట్టి ప్రణాళికలతో ఉన్నారు.
ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్ టెక్నాలజీలలో ఇది కీలకమైనదిగా పేర్కొంటూ, రాష్ట్ర అభివృద్ధికి ఇది బలమైన ఆధారంగా నిలుస్తుందన్నారు. ఆయన తన పాలన ఎప్పుడూ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుందంటూ, రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి కావలసిన అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఉందన్నారు. పేదరికాన్ని తగ్గించి, సంపదను సృష్టించడం ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జీవనం కల్పించడమే తన అభిప్రాయమన్నారు.
ఆయన ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు పెట్టడానికి అత్యుత్తమ స్థలమని చెప్పారు. రాష్ట్రంలో అవసరమైన ప్రాథమిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉండడం, 1,000 కిలోమీటర్లకుపైగా విస్తరించిన తీరప్రాంతం ఉండటం వంటి అంశాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయని వివరించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఇరిగేషన్, పంటలలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రథమ స్థానంలో ఉందని, అదే విధంగా టెక్నాలజీ, డిజిటల్ రంగం, మానవ వనరుల పరంగా కూడా రాష్ట్రం బలంగా ఉందని చెప్పారు. పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతోందని, 2030 నాటికి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌దే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం ఉందని ఆయన తెలిపారు.
ఆయన తన ప్రసంగంలో అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ప్రకటించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో సహజసిద్ధంగా, పర్యావరణానికి హానీ చేయని శక్తిని తయారు చేయవచ్చని ఆయన చెప్పారు. అలాగే, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసి, భారత్‌కు ఒక కొత్త టెక్నాలజీ కేంద్రంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మరోవైపు, విశాఖపట్నంలో గూగుల్ సంస్థ తన అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించబోతుందనడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ, పరిశ్రమల రంగాల్లో ముందుకు తీసుకెళ్లే కీలక అడుగులుగా పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే పెట్టుబడిదారుల ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలనే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. వాళ్లకు అవసరమైన అన్ని రకాల మద్దతు, సౌకర్యాలు అందించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు.
విశ్వాసాన్ని ఒక్క రాత్రిలోనే పొందలేము, ఇది కాలక్రమంలో ఏర్పడే విషయం. అందుకే పెట్టుబడిదారుల నమ్మకాన్ని గెలుచుకునేందుకు ప్రభుత్వంగా మేము తాము నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు.
More From GoodReturns

Layoffs: ఏఐ మీ ఉద్యోగాన్ని లాగేసుకుంటుందా లేక మిమ్మల్ని బాస్‌ను చేస్తుందా?

Gold bonds: బంగారంతో జాక్‌పాట్.. రూ. 1 లక్ష పెడితే రూ. 4 లక్షలు అయ్యాయి! రేపే ఆ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications