గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కట్ల పతనం ఊహించని స్థాయికి పడిపోయి ఇన్వెస్టర్లకు కన్నీళ్లు తెప్పించాయి. అలాగే తక్కువ కాలంలోనే సెన్సెక్స్ నిఫ్టీ అత్యల్ప స్థాయిని తాకాయి. దీనికి తోడు బంగారం ధర రోజుకి రోజుకి పెరుగుతూ ఆల్ టైం హై రికార్డ్ సృష్టించాయి. నేడు కూడా బంగారం ధర భారీగా పెరిగి కస్టమర్లకు షాకిచ్చాయి. అయితే పెళ్లిళ్ల సీజన్లో ధరలు తగ్గుతాయని భావించిన కస్టమర్లకు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఇక ఈ సంవత్సరం మొదటి నుండే భారత స్టాక్ మార్కెట్లు నిరంతర క్షీణతలో ట్రేడవుతున్నాయి. దింతో పెద్ద సంఖ్యలో షేర్లు అమ్ముడవుతున్నాయి. ఇంకా షేర్ల ధర క్రమంగా తగ్గుతోంది. ఈ కారణంగా పెట్టుబడిదారులు భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. స్టాక్ మార్కెట్ పతనం పెట్టుబడిదారులను మాత్రమే కాకుండా దేశంలోని మెగా-మిలియనీర్లను కూడా ప్రభావితం చేస్తోంది.

ఈ ఏడాది స్టాక్ మార్కెట్ పతనం కారణంగా అత్యంత ధనవంతులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అండ్ అజీమ్ ప్రేమ్‌జీతో సహా టాప్ 7 బడా-సంపన్నులు దాదాపు 70 రోజుల్లో మొత్తం రూ.2.95 లక్షల కోట్లు ($34 బిలియన్లు) కోల్పోయారు. ఈ బడా-బిలియనీర్ల మొత్తం ఆస్తులు 300 బిలియన్ డాలర్లను మించిపోవడం గమనార్హం. టాప్ 7 బడా సంపన్నులలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్టాక్ మార్కెట్ పతనం వల్ల ఎక్కువగా ప్రభావితమైయ్యారు. ఈ సంవత్సరం అదానీ నికర విలువ $10.1 బిలియన్లు తగ్గింది. దీని తరువాత అతని నికర విలువ $68.8 బిలియన్లకు పడిపోయింది. అదానీ గ్రూప్ కంపెనీలలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర 12 శాతం తగ్గింది.
ఇంకా, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ ధర 22 శాతం, అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర 21.26 శాతం తగ్గాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సహా అదానీ పోర్ట్స్ 6 నుండి 3 శాతం పడిపోయాయి.
ఇక ఏడాది స్టాక్ మార్కెట్ పతనం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 3.13 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అయినకూడా అతను భారతదేశపు బడా-ధనవంతుల లిస్టులో టాప్ లో కొనసాగుతున్నాడు. ఆయన నికర ఆస్తుల విలువ 87.5 బిలియన్ డాలర్లు. స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 2.54 శాతం పెరిగింది. మరోవైపు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ధర 28.7 శాతం పడిపోయింది.
అంతేకాదు HCL టెక్నాలజీస్ చైర్మన్ శివ్ నాడార్ నికర విలువ 7.13 బిలియన్ డాలర్లు తగ్గింది. అతని ప్రస్తుత నికర విలువ $36 బిలియన్లు. ఈ ఏడాది ఇప్పటివరకు విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ నికర విలువ 2.7 బిలియన్ డాలర్లు పడిపోయింది. ప్రస్తుతానికి, అతని నికర విలువ $28.2 బిలియన్లు. ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వెనుక ఉన్న వ్యక్తి షాపూర్ మిస్త్రీ నికర విలువ $4.53 బిలియన్లు తగ్గింది. ఆయన ప్రస్తుత నికర ఆస్తుల విలువ $34.1 బిలియన్లు. OP జిందాల్ గ్రూప్ ఎమెరిటస్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ కూడా $2.22 బిలియన్లను కోల్పోయారు. ఆమె ప్రస్తుత నికర ఆస్తుల విలువ $30.1 బిలియన్లు. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ చైర్మన్ దిలీప్ సంఘ్వీ నికర విలువ 4.21 బిలియన్ డాలర్లు తగ్గింది. ఆయన ప్రస్తుత నికర ఆస్తుల విలువ $25.3 బిలియన్లు.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications