ప్రతి పెద్ద బిజినెస్ కూడా ఒక చిన్న ఆలోచనతోనే మొదలైంది. మనకు వచ్చిన ఆ ఐడియాను సరైన విధంగా ప్లాన్ చేసుకుని, ఒక్కో స్టెప్‌గా అమలు చేయగలిగితేనే అది విజయవంతమైన బిజినెస్‌గా మారుతుంది. బిజినెస్ ప్రారంభించడానికి ఎప్పుడూ పెద్ద పెట్టుబడి లేదా పెద్ద టీమ్ అవసరం ఉండదు. స్పష్టమైన ఆలోచన, సరైన ప్లానింగ్ మరియు ఆచరణే ముఖ్యం. ఇక్కడ ఒక చిన్న ఐడియాతోనే ఎలా బిజినెస్‌ను ప్రారంభించాడో చూద్దాం.
26 ఏళ్ల వయసులో చాలామంది "ఇది పిచ్చి నిర్ణయం"అలాంటి పని ఎందుకూ చేస్తున్నావ్ అని చాలా మంది గువాహటి యువకుడు ఆనంత్ అజ్మేరాని అన్నారు. పీఎచ్‌డీ మధ్యలోనే చదువు వదిలేసి, రూ. 10 లక్షల పెట్టుబడితో బ్రూమ్స్ తయారీ వ్యాపారం మొదలెట్టాడు. తనతో పాటు ఉన్న స్నేహితులు అందరూ కార్పొరేట్ ఉద్యోగాల కోసం పరుగెత్తుంటే, ఆనంత్ మాత్రం బ్రూమ్ వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నాడు.

వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజుల్లో, అన్నీ సులభంగా సాగలేదు. ప్రభుత్వ నిబంధనలు, రవాణా సమస్యలు, స్థానిక ప్రజల అవగాహన లోపం ఇవన్నీ ఆనంత్ కోసం పెద్ద సవాళ్లుగా నిలిచాయి. కానీ ఆయనకు ఒక స్పష్టమైన ఆలోచన ఉండేది "నిజమైన సమస్యను పరిష్కరిస్తే, విజయం తప్పదు." అందువల్ల, ఆయన మేఘాలయ మరియు అస్సాం గ్రామాల నుంచి ఊతగడ్డి నేరుగా సేకరించడం ప్రారంభించారు. మధ్యవర్తులను తీసేసి, రైతులకు వారి పంటకు న్యాయమైన ధరలు అందేలా చూసాడు. ఈ విధంగా సుమారు 4,800 మంది రైతుల జీవనోపాధి మెరుగుపడేలా వారి జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకురావడంలో ఆయనకు అవకాశం లభించింది.
2014లో, ఆనంత్ కేవలం 1,000 చదరపు అడుగుల చిన్న గిడ్డంగి నుండి జంగిల్ ఆగ్రోస్ ను ప్రారంభించారు. ఆ సమయంలో ఆయనకు పెద్ద స్థలం లేదా అధిక ఉత్పత్తి సామర్థ్యం లేదు. కానీ కాలంతో పాటు వ్యాపారం పెరిగింది. నేడు ఆ చిన్న స్థలం 40,000 చదరపు అడుగుల పెద్ద ఫ్యాక్టరీగా విస్తరించబడింది. ఈ ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో చీపురులను తయారు చేస్తున్నారు. ఇందులో నూతన విధానాలు, మెరుగైన క్వాలిటీ నియంత్రణ, మరియు సాంకేతిక పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి. చిన్న స్థలంలో ప్రారంభమైన వ్యాపారం ఇప్పుడు పెద్ద స్థాయి పరిశ్రమగా మారింది.
భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025
ఆనంత్ తన వ్యాపారంలో చిన్న చిన్న, కానీ ప్రభావవంతమైన మార్పులు చేసాడు. మొదట, ఊతగడ్డి ఎండబెట్టే పద్ధతిని మార్చి, గడ్డి రంగు మెరిసేలా చేయడం ప్రారంభించాడు. తర్వాత తేమ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇనుప హ్యాండిల్ తుప్పు పట్టే సమస్యను పరిగణనలోకి తీసుకుని, ప్రత్యేకమైన కొత్త రకమైన హ్యాండిల్ డిజైన్ చేసి, పేటెంట్ కూడా పొందాడు. అంతే కాక చీపురులోని ఫిల్లర్లను తయారు చేసే ప్రక్రియలో కూడా మార్పు చేసి, చేతి పనికి భవిష్యత్తులో యంత్రాల సహాయాన్ని కలిపి సెమీ-మెకనైజ్డ్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ చిన్న చిన్న ఆవిష్కరణలే ఆయన వ్యాపారానికి బలమైన పునాది కట్టడం, లక్షల చీపురులను క్వాలిటీతో తయారు చేయడంలో కీలక పాత్ర వహించాయి.
భారతదేశంలో బ్రూమ్స్ వ్యాపారం చాలా పెద్దది, దాని మొత్తం విలువ సుమారు రూ. 600 కోట్లతో సమానంగా ఉంది. ఇందులో మేఘాలయే రూ. 400 కోట్ల విలువైన బ్రూమ్స్ ను సరఫరా చేస్తుంది. హై గ్రేడ్ గడ్డి ధర కిలోకు రూ. 50-రూ. 57 ఉంటే, లో గ్రేడ్ గడ్డి ధర కిలోకు రూ. 25 మధ్య ఉంటుంది. ఒక సిద్దమైన బ్రూమ్ ధర సాధారణంగా రూ. 40-రూ. 65 మధ్య ఉంటుంది. ఈ బ్రూమ్స్ దేశంలోనే కాకండా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ వంటి దేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. మొత్తం ఇండస్ట్రీలో సుమారు 3,500-5,000 తయారీదారులు, 50,000-1 లక్ష మంది రైతులు, ఎండ బెట్టేవారు, ప్యాకింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ పెద్ద పరిశ్రమలో జంగిల్ ఆగ్రోస్ తన ప్రత్యేక ఆవిష్కరణల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఆనంత్ గౌహటి యూనివర్సిటీలో కామర్స్ చదివాడు, తరువాత MBA మరియు M.Com పూర్తి చేశాడు. JRF లో ఈస్ట్ ఇండియా ర్యాంక్ II, I సాధించి PhD కూడా ప్రారంభించాడు. కానీ వ్యాపారం పెద్దదవుతుండటంతో, PhD ను వదిలేయాల్సి వచ్చింది. మొదట ఆయన చిన్న గిడ్డంగిలో ఊతగడ్డి ముడి సరుకును హోల్‌సేల్‌గా అమ్మేవాడు. తర్వాత తయారీ రంగంలోకి అడుగుపెట్టి, కొత్త రకాల ఊతగడ్డలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశాడు. ఇటీవల మార్కెట్లో ప్లాస్టిక్ మరియు నైలాన్ బ్రూమ్స్ ఉపయోగం ఎక్కువ అవుతోంది. ఇది సహజ గడ్డి పరిశ్రమకు పెద్ద సవాలు. ఆనంత్ చెబుతున్నాడు, "మరి 10-15 సంవత్సరాల్లో ఈ పరిశ్రమ ఇంకా నిలుస్తుందా అనేది చెప్పడం కష్టం. ప్లాస్టిక్ బ్రూమ్స్లకు 5% GST ఉంటే, సహజ గడ్డి బ్రూమ్స్ కు GST లేదు. కానీ ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే రా మెటీరియల్ పై 18% GST ఉండటం వల్ల, పరోక్షంగా ప్లాస్టిక్ బ్రూమ్స్ కు ఎక్కువ మద్దతు లభిస్తోంది.
ఒక చిన్న, సాధారణ ఐడియాతోనే ఆనంత్ అజ్మేరా రూ. 20 కోట్ల వ్యాపారాన్ని నిర్మించగలిగాడు. ఆయన కథ మనకు "ఐడియా చిన్నదైనా, ఉద్దేశ్యం పెద్దదైతే విజయం తప్పదు" అనే సత్యం. పీహెచ్‌డీ చదువును వదిలి, గ్రామీణ ప్రాంతాల్లోని సహజ వనరులను ఉపయోగించి వ్యాపారం ప్రారంభించి, అనేక రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడం ద్వారా ఆయన వ్యాపారవేత్తగా మాత్రమే కాక, ఒక ప్రేరణాత్మక నాయకుడిగా కూడా ఎదిగాడు. ఇది కేవలం వ్యాపారంలో విజయం మాత్రమే కాదు, గ్రామీణ సమాజంలో వెలుగులు నింపిన ఒక ప్రేరణాత్మక కథ.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఈ సారి బడ్జెట్లో కొత్త పథకాలు.. అవేంటంటే..



Click it and Unblock the Notifications