Nikesh Arora interview: కొన్నిసార్లు జీవితంలో మనకు ఎదురయ్యే అవమానాలు మనల్ని మరింత కష్టపడి పనిచేసేలా రాటుదేలుస్తాయి. ప్రపంచంలో చాలా మంది తమ జీవితంలో అనేక అవమానాలను ఎదుర్కొని వాటినే విజయసోపానాలుగా మార్చుకుని సక్సెస్ అయ్యారు. అవమానాలతో కెరీర్ ప్రారంభించి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా నిలిచారు. ఎక్కడైతే కింద పడ్డాడో అదే చోటు నుంచి తన గెలుపు కేకను అవమానించిన వారి చెవుల్లో మోగించిన వారిని చాలామందిని చూసే ఉంటాం. సరిగా అలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం.
ప్రపంచంలోని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓగా ఉన్న నికేష్ అరోరా.. తాను 400 చోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నానని..అయితే అక్కడ అన్నీ తిరస్కరించారని చెప్పుకొచ్చారు. ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవితం మనల్ని ఆటుపోట్లకు గురి చేసినప్పుడల్లా మనం బలంగా పైకి ఎదగాలని అరోరా అన్నారు. అరోరా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జన్మించాడు. తన తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశాడు.

అతను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU)లో ఇంజనీరింగ్ డిగ్రీ ఐఐటీ పూర్తి చేశాడు. ఆ తర్వాత USలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం US వెళ్లాలనుకున్నప్పుడు, తన దగ్గర కేవలం 100 డాలర్లు మాత్రమే ఉన్నాయని, దీంతో ఎటువంటి దరఖాస్తు రుసుము వసూలు చేయని యుఎస్ సంస్థలలో కోర్సులకు దరఖాస్తు చేసుకున్నానని అరోరా చెప్పాడు.
అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదవడానికి స్కాలర్‌షిప్ వచ్చిందని.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అమెరికా వెళ్లానని చెప్పాడు. అయితే నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్‌ను ఎంచుకోవాలని ఆఫర్ చేసిందని.. కాబట్టి దానిని అంగీకరించడం తప్ప తనకు వేరే మార్గం లేకపోయిందని అరోరా అన్నారు. అక్కడ ఉన్నత చదువులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం దాదాపు 400 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అన్ని చోట్ల అతని అప్లికేషన్ చెత్త బుట్టలో పడేశారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తాను తన విశ్వాసాన్ని కోల్పోలేదని పట్టు వదలకుండా ప్రయత్నించానని తెలిపారు.
తనకు తొలిసారిగా ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఉద్యోగ అవకాశం లభించిందని ఆయన అన్నారు. నేను ఆ కంపెనీలో క్రమంగా నా టాలెంట్ నిరూపించుకుని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పదవి స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. మీరు ఆర్థిక రంగానికి తగినవారు కాదని.. ఈ ఉద్యోగం మీకు సరిపోదని..వారు చాలా చోట్ల అదేపనిగా నన్ను అవమానించారని చెప్పుకొచ్చారు. వాటన్నింటినీ అధిగమించి 2014లో గూగుల్‌లో ఉద్యోగానికి వెళ్లానని ఆయన పేర్కొన్నారు.
గూగుల్ లో దశాబ్దం పాటు పనిచేశానని..ఈ సమయంలో నాకు పాత అనుభవంతో పాటుగా కొత్త అనుభవం కూడా తోడయిందని తెలిపారు. గూగుల్ తర్వాత సాఫ్ట్ బ్యాంక్ లో చేరారు. అక్కడ రెండున్నర సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2018లో పాలో ఆల్టోలో చేరారు. 2018లో ఆయన CEO గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కంపెనీ విలువ 18 బిలియన్ డాలర్లు, కానీ ఇప్పుడు దాని విలువ 118 బిలియన్ డాలర్లు.
ఏఐ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ..నికేష్ అరోరా ఒక కీలక ప్రశ్నను సంధించారు. కృత్రిమ మేధస్సు నిజమైన విలువ ఎక్కడ ఉంటుంది? శక్తివంతమైన మోడళ్లను భవిష్యత్తులో మీరు అద్దెకు తీసుకోగలుగుతారు. కానీ అసలు తేడా ప్రాంతీయ డేటా, డొమైన్ నాలెడ్జ్ ద్వారా వస్తుంది..మన భాషలు, మన ట్రాఫిక్, మన సంస్కృతి ఇవే పట్టుకొమ్మలు అవుతాయి. ఉదాహరణకు, అమెరికాలో శిక్షణ పొందిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారతదేశంలో నిలిచిపోయే పరిస్థితి వస్తుంది. ప్రపంచ స్థాయి ఏఐని భారతీయ సందర్భానికి సరిపడేలా మార్చడంలో అక్కడే భారతీయ కంపెనీలు మెరిసే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో తెలివైన వారు చాలామందే ఉన్నారు. వారు ఏఐను దేశీయంగా ఎలా ఉపయోగించాలో ఖచ్చితంగా కనిపెట్టగలరన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications