కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్లో ఏడాదికి రూ. 12 లక్షల వరకు ఆదాయం పై ట్యాక్స్ ఫ్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో అధిక వేతనం పొందుతున్న టెక్ ఉద్యోగులకు అలాగే ఇతర రంగాలలో పని చేసేవారికి ఎంతో ఆనందం కలిగించింది. మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ రాబడులు కూడా ప్రతి ఏడాది భారీగా వసూల్ అవుతున్నాయి. కానీ 1 ఏప్రిల్ 2026 నుండి ఆదాయపు పన్ను శాఖకి మీ సోషల్ మీడియా అకౌంట్స్, పర్సనల్ ఇమెయిల్స్, బ్యాంక్ అకౌంట్స్, ఆన్‌లైన్ పెట్టుబడి అకౌంట్స్, ట్రేడింగ్ అకౌంట్స్ సహా మరిన్నింటిని చెక్ చేసేందుకు ఇంకా వాటికీ యాక్సెస్ చేయడానికి చట్టపరమైన హక్కు ఉంటుంది. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి దీనివల్ల ఎటువంటి సమస్యను ఉండదు, అయితే పన్ను ఎగవేసే వారు మాత్రం ఇక తప్పించుకోలేరు. కొత్త ఆదాయపు పన్ను చట్టంలో అధికారులకు ఈ అధికారం ఉంటుంది. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 132 అధికారులు సోదాలు నిర్వహించి ఆస్తి లేదా అకౌంట్ బుక్స్ స్వాధీనం చేసుకోవడం ఇంకా సీజ్ చేసే హక్కు ఉంది. ఎవరైనా ఆదాయపు పన్నును ఎగవేసేందుకు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిన ఏదైనా ఆదాయం, ఆస్తులు లేదా డాకుమెంట్స్, బంగారం, నగలు, విలువైన వస్తువులు ఉన్నాయని సమాచారం లేదా అనుమానం కలిగినప్పుడు ఈ విధంగా జరుగుతుంది.
మీ దగ్గర నల్లధనాన్ని దాచిపెట్టే సీక్రెట్ ప్లేస్ ఉందని అనుకుందాం.. కానీ ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు దానిని పసిగట్టి తెరవగలదు. ప్రస్తుత చట్టాల ప్రకారం ఇలా చేయడానికి ఒక మార్గం ఏమిటంటే ఏదైనా డోర్స్, పెట్టె లేదా లాకర్ తాళం లేనపుడూ పగలగొట్టడం. ఒకవేళ తాళం లేనప్పుడు అలాగే కొన్ని వెల్లడించని ఆస్తులు లేదా అకౌంట్ బుక్స్ అందులో ఉండొచ్చని వారు అనుమానించినప్పుడు ఇలా చేయవచ్చు.

ఆథరైజేడ్ ఆఫీసర్ ఎవరు : ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ఆథరైజేడ్ ఆఫీసర్ అనే పదానికి అర్థం: 1. జాయింట్ డైరెక్టర్ లేదా అడిషనల్ డైరెక్టర్, 2. అసిస్టెంట్ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్, 3. అసిస్టెంట్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్, 4. జాయింట్ కమిషనర్ లేదా అడిషనల్ డైరెక్టర్, 5. ఆదాయపు పన్ను అధికారి లేదా ట్యాక్స్ రికవరీ అధికారి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం సోషల్ మీడియా అకౌంట్స్, ఇమెయిల్ సర్వర్లు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్, ట్రేడింగ్ అకౌంట్స్, బ్యాంకింగ్ అకౌంట్స్ మొదలైనవి, రిమోట్ సర్వర్లు లేదా క్లౌడ్ సర్వర్లు, డిజిటల్ అప్లికేషన్స్, ఏదైనా ఆస్తుల వివరాలు స్టోర్ చేయడానికి ఉపయోగించే ఏదైనా వెబ్‌సైట్ వీటిపై ఆక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఉంటుంది.
కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం, ఆదాయపు పన్ను అధికారులకు మీ కంప్యూటర్ సిస్టమ్ లేదా వర్చువల్ డిజిటల్ స్పేస్‌లోకి ఆక్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ కంప్యూటర్, మీ ఇమెయిల్స్ , మీ సోషల్ మీడియా అకౌంట్స్ ప్రతిదీ ప్రభుత్వ నిఘాలో ఉంటుంది. ఆదాయపు పన్ను బిల్లులోని క్లాజ్ 247 ప్రకారం, ఏ వ్యక్తి దగ్గరైన వెల్లడించని ఆదాయం లేదా ఆదాయపు పన్ను చట్టం పరిధిలోకి వచ్చే ఆస్తులు ఉన్నాయని అధికారం ఉన్న అధికారికి నమ్మకం ఉంటే అతను దేనినైన తాళాన్ని పగలగొట్టవచ్చు ఇంకా ఆక్సెస్ కోడ్‌ను ఓవర్‌రైడ్ చేయడం ద్వారా ఏదైనా కంప్యూటర్ సిస్టమ్ లేదా వర్చువల్ డిజిటల్ స్పేస్‌కి ఆక్సెస్ పొందవచ్చు. దీని అర్థం మీరు ఉద్దేశపూర్వకంగా ఆదాయపు పన్ను ఎగవేస్తున్నారని అనుమానించినట్లయితే అధికారులు మీ కంప్యూటర్ సిస్టమ్‌లు, ఇమెయిల్ లేదా సోషల్ మీడియా అకౌంట్స్లోకి చొరబడవచ్చు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications