ఇటీవలి కాలంలో యూబీపీ గ్రూప్ భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కోవటంపై కీలక నివేదికను ప్రచురించింది. విదేశీ పెట్టుబడుల మందగమనం, తగ్గిపోతున్న ఎగుమతులు, ఆర్థిక మందగమనంపై తన రిపోర్టులో కీలక అంశాలను ప్రస్థావించింది. ఈ క్రమంలో భారతీయ వినియోగదారుల ఖర్చులు చేసే విదానం ఊహించని స్థాయిల్లో మారిపోయింది.
వాస్తవానికి ప్రజల ఆదాయాలు పెరగటం, మెరుగైన జీవనశైలి కోసం ఆశయాలు పెరిగినప్పటికీ చాలా మంది ఆర్థికంగా డబ్బును ఖర్చు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ధరల హెచ్చుతగ్గులు కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫిన్‌ఫ్లూయన్సర్ విజ్డమ్ హ్యాచ్ వ్యవస్థాపకుడు అక్షత్ శ్రీవాస్తవ్ ఈ అంశంపై కీలక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండియాలో ఒక ఫ్రిడ్జ్ కొనుగోలు చేయటాన్ని ఒక ఉదాహరణలో వివరించారు. తాను దుబాయ్ లో 409 లీటర్ల బెకో రెఫ్రిడ్జరేటర్ కొనుగోలు చేయటానికి దాదాపు రూ.25,000 ఖర్చయిందని వెల్లడించారు. ఇదో మోడల్ గోవాలో కొనటానికి రూ.38,000లకు పెరిగిపోయింది. అయితే ఇక్కడ ధర వ్యత్యాసానికి అసలు కారణం భారతదేశంలో ఫ్రిడ్జ్ ఒక లగ్జరీ వస్తువుల కేటగిరీలో పన్ను వసూలు చేయటమేనని ఆయన పేర్కొన్నారు. అయితే ఇక్కడ సమస్య ఈ వస్తువు గురించి కాదని సెప్టెంబర్ 2024-జనవరి 2025 వరకు GDP వృద్ధి మందగించడం, బెంచ్‌మార్క్ సూచీలు వాటి ఆల్ టైమ్ గరిష్టాల నుండి 12% వరకు పడిపోవటం అన్ని రంగాలపై ప్రభావాన్ని సూచిస్తోంది.
ఒకప్పుడు రక్షణాత్మక కోటగా ఉన్న వినియోగదారుల వస్తువుల రంగం ఇప్పుడు ఒత్తిడి సంకేతాలను చూపుతోందని యూబీఎస్ వెల్లడించింది. ఆదాయాల నియంత్రణ వ్యాప్తి చెందుతోందని.. ఇది లోతైన, వ్యవస్థాగత సవాళ్లను సూచిస్తుందని యూబీఎస్ ప్రతినిధి వెల్లడించారు. దీనికి తోడు గృహోపకరణాల నుండి ప్రాథమిక వస్తువుల వరకు రోజువారీ వస్తువుల ధరలు పెరగడం, సంపన్న కుటుంబాల కొనుగోలు శక్తి కూడా దెబ్బతింటోంది. ప్రజలు ఇండియాలో పన్ను నిబంధనలకు అనుగుణంగా లగ్జరీగా పరిగణించబడే వస్తువులపై ఖర్చుచేయటాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు.
ప్రజలు తక్కువగా ఖర్చు చేయటం అనే ధోరణి ఎన్ని రోజులు కొనసాగుతుందనే అంశంపైనే ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల చేసితో ఖర్చు చేయటానికి ఆదాయం ఉన్నప్పటికీ చాలా మంది డబ్బును విచక్షణతో జాగ్రత్తగా ఉపయోగించటం వల్ల వినియోగదారు ఉత్పత్తులకు డిమాండ్ కనిపించటం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం కూడా దీనిపై ఎక్కువగా దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications