భారతదేశం ఐటీ సేవల ఎగుమతికి ఫేమస్ కావటంతో ఈ రంగంలో భారీ ఉపాధిగా అవకాశాలు పెరిగాయి. జాబ్ వచ్చినా రాకున్నా ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ చాలా మంది చేసేవారు. కానీ నేటి యువత చాలా తెలివిగా ముందుకు సాగుతోంది.
ముఖ్యంగా దేశంలోని చిన్న పట్టణాలు, నగరాల్లో యువ ఇంజనీర్లు తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ట్రెండ్ కి అనుగుణంగా అధిక డిమాండ్ ఉన్న సాంకేతికతలైన జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఫుల్ స్టాక్, ఈవీ డిజైన్ వంటి వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యమంగా ఒకప్పుడు నగరాల్లోని యువత ఇలా ఉండేవారు.. అయితే ప్రస్తుతం ఈ కల్చర్ చిన్న పట్టణాలకు సైతం విస్తరించింది. మార్కెట్లకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకునేందుకు యువ గ్రాడ్యుయేట్లు రూ.1-4 లక్షలు వెచ్చిస్తున్నారు.

అత్యంత పోటీతో కూడిన జాబ్ మార్కెట్లో మంచి జీతాలను అందించే డిమాండ్ ఉన్న టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలని చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. ఈ క్రమంలో మధురై, నాగ్‌పూర్, విశాఖపట్నం, కోయంబత్తూర్, లక్నో, ఇండోర్, తిరుచిరాపల్లి, మైసూర్, కొత్తత్తూరు, భువనేశ్వర్ వంటి చిన్న పట్టణాల్లో యువత ఎక్కువగా ఇటువైపు మెుగ్గుచుపుతున్నట్లు డేటా వెల్లడించింది. ఈ నగరాల నుంచి నమోదు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 40 శాతానికి పైగా ఉన్నట్లు గణాంకాలు తేటతెల్లం చేశాయి.
ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ అప్‌గ్రాడ్ మునుపటి త్రైమాసికంతో పోలిస్తే రెండవ త్రైమాసికంలో నాన్-మెట్రో స్థానాల నుంచి వచ్చిన ఫ్రెషర్ క్వార్టర్లీ 50 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇదిలా ఉన్నప్పటికీ వీరందరినీ తీసుకునేందుకు ఐటీ జాబ్ మార్కెట్ మాత్రం అస్సలు సిద్ధంగా లేదు. వాస్తవానికి దేశంలోని టాప్ టెక్ కంపెనీలు సైతం ఈ ఏడాది అనిశ్చిత వ్యాపార వాతావరణం కారణంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను దాటవేయాలని నిర్ణయించుకున్నాయి. ఖర్చులను నియంత్రించడానికి వారి ఎంట్రీ-లెవల్ రిక్రూట్‌మెంట్‌లో ప్రధానంగా కోత విధించాయి.


Click it and Unblock the Notifications