For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్థిక మందగమనం: బడ్జెట్‌పై నిర్మలా సీతారామన కసరత్తు

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పైన కసరత్తు ప్రారంభించారు. బడ్జెట్ తయారీకి ముందు వివిధ వర్గాలు, సంఘాలు, ఆర్థికవేత్తలతో సోమవారం నుంచి సంప్రదింపులు జరపనున్నారు. స్టార్టప్, ఫిన్ టెక్, డిజిటల్ రంగాల ప్రతినిధులతో చర్చించనున్నారు. సోమవారం సాయంత్రం ఫైనాన్షియల్ రంగం, క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. జనవరి 25వ తేదీలోపు సంప్రదింపులు ముగించి ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

2020-21వ సంతవస్రానికి గాను ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మందగమనం ఉంది. భారత్‌లోను ఈ ప్రభావం ఎక్కువే ఉంది. మందగమనం నేపథ్యంలో ఇప్పటికే మోడీ ప్రభుత్వం పలు ఉద్దీపనలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ వైపు అందరి చూపులు ఉన్నాయి. ఆర్థికమందగమన చర్యలు తగ్గించేందుకు నిర్మల ఏం చర్యలు తీసుకుంటారనే అంశం ప్రధానం కానుంది.

Fresh steps to revive the economy on 1 February

ఎఫ్ఎంసీజీ, రియల్, ఆటో రంగాలపై మందగమన ప్రభావం తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. ఆయా రంగాలకు నిర్మలా సీతారామన్ పలు ఊరట ప్రకటనలు చేశారు. ఇటీవలి క్వార్టర్‌లో జీడీపీ 4.5 శాతానికి పడిపోయింది. దాదాపు అన్ని రంగాలు ఢీలా పడ్డాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ వైపు అందరు చూస్తున్నారు.

English summary

ఆర్థిక మందగమనం: బడ్జెట్‌పై నిర్మలా సీతారామన కసరత్తు | Fresh steps to revive the economy on 1 February

Finance minister Nirmala Sitharaman will present the Union budget for fiscal year 2020-21 on 1 February with possible big ticket announcements based on requirements voiced by industry as she looks to pull India out of its economic slowdown.
Story first published: Sunday, December 15, 2019, 12:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X