Billionaires: ఎలాన్ మస్క్‌ను దాటేసిన మరో బిలియనీర్.. ఇక ప్రపంచ కుబేరుడు అతడే..
Bernard Arnault: చాలా కాలంగా ప్రపంచ కుబేరుడిగా తన స్థానాన్ని పధిలంగా ఉంచుకున్న ఎలాన్ మస్క్ ప్రస్తుతం నెనకపడ్డారు. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ కంపెనీలను నడుపుతున్న మస్క్ రియల్ టైమ్ ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నారు.
అయితే ఇప్పుడు అందరి చూపు మెుదటి స్థానాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి ఎవరు అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ అయ్యి ఉంది. లగ్జరీ దిగ్గజం LVMH వెనుక ఉన్న ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో మెుదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం నాడు ఆర్నాల్ట్ నికర విలువ శుక్రవారం నాడు 207.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఆర్నాల్డ్ విలువ 23.6 బిలియన్ డాలర్లు పెరగటంతో ఇది జరిగింది.

ఇదే క్రమంలో ఎలాన్ మస్క్ సంపద మాత్రం 204.5 బిలియన్లకు పరిమితమైంది. మస్క్ కంటే ఆర్నాల్డ్ విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లు అధికంగా ఉండటంతో తొలి స్థానానికి చేరుకోగలిగారు. ఇదే క్రమంలో ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ తయారీ సంస్థ టెస్లా స్టాక్ గురువారం యూఎస్ మార్కెట్లో 13 శాతం క్షీణించటం కూడా మస్క్ వెనుకపడటానికి పరోక్షంగా కారణమైంది. ఈ క్రమంలో నికర విలువ 18 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించింది.
అయితే టెస్లా మెుత్తం మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 586.14 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఎల్‌విఎంహెచ్ స్టాక్ 13 శాతం బలమైన పెరుగుదలను నమోదు చేయటంతో మార్కెట్ క్యాప్ 388.8 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఫోర్బ్స్ నివేదిక తెలిపింది. ఐదుగురు సంతానం కలిగిన ఆర్నాల్ట్ LVMH కంపెనీకి 74 ఏళ్ల CEO. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన విలాసవంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. లూయిస్ విట్టన్, TAG హ్యూయర్, డోమ్ పెరిగ్నాన్ వంటి దిగ్గజ బ్రాండ్‌లను నిశితంగా కొనుగోలు చేసి వాటిని మరింతగా విస్తరింపజేశారు.


Click it and Unblock the Notifications