Mukesh Ambani: 2023 అదానీని ఎంత ఇబ్బందులకు గురిచేసిందో.. అదే స్థాయిలో అంబానీకి కలిసొచ్చింది. ఈ ఏడాది రిలయన్స్ గ్రూప్‌లోని కంపెనీల పనితీరు ఇదే విషయాన్ని సూచిస్తోంది.
ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ SMCP భారత మార్కెట్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించింది. ఇందుకోసం అంబానీకి చెందిన రిటైల్ వెంచర్- రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ కంపెనీ Sandro, Maje, Claudie Pierlot, Fursac బ్రాండ్ల కింద తన ష్యాషన్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. అంబానీతో ఒప్పందం తర్వాత ఈ బ్రాండ్ దుస్తులు రిలయన్స్ రిటైల్ ద్వారా దేశవ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియులకు విక్రయించవచ్చని తెలుస్తోంది.

సాండ్రో అండ్ మజే 2024లో దేశంలో తమ మొదటి స్టోర్‌ని ప్రారంభిస్తుందని అంచనా. అంబానీతో ఫ్రెంచ్ కంపెనీ కొత్త భాగస్వామ్యం SMCP కంపెనీని ప్రపంచ వ్యాప్తంగా 47 దేశాల్లో విస్తరించటంలో భాగంగా జరిగింది. ప్రీమియం నుంచి లగ్జరీ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌ల వరకు దేశంలోని అగ్రగామి కంపెనీ అయిన రిలయన్స్ బ్రాండ్స్, బొట్టెగా వెనెటా, టిఫనీ & కో, వాలెంటినో, వెర్సేస్, జెగ్నా వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది.
ఇటీవల రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ రిలయన్స్ రిటైల్ మెుదటి స్వదేశ్ స్టోర్‌ను హైదరాబాదులో ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌లోని 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు జరిగింది. ఇందులో భారతీయ కళలు, చేతి వృత్తుల ద్వారా తయారైన ఉత్పత్తుల కోసం అంకితం చేయబడింది. దేశంలోని పురాతన సాంప్రదాయం ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. హస్తకళలతో పాటు చేతితో తయారు చేసిన ఆహార పదార్థాలు, బట్టలు వంటి ఉత్పత్తులు కూడా స్వదేశ్ దుకాణంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచారు.


Click it and Unblock the Notifications